బెంగాల్: లెప్ట్ - కాంగ్రెస్ కూటమి ఎవరిని గెలిపిస్తుంది?
x

బెంగాల్: లెప్ట్ - కాంగ్రెస్ కూటమి ఎవరిని గెలిపిస్తుంది?

బెంగాల్ లో అధికార టీఎంసీ, కేంద్రంలోని బీజేపీని లెప్ట్ కాంగ్రెస్ కూటమి వణికిస్తోంది. ప్రచారంలో కూడా కాంగ్రెస్ కూటమి జోరుగా ఉండడంతో ఓట్ల చీలిక భారీగానే ఉంటుందని..


బెంగాల్ లో టీఎంసీ దాదాపు పుష్కరకాలంపై నుంచి అధికారం చలాయిస్తోంది. అయితే దాని పాలనపై కూడా బెంగాలీ ముస్లింలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీని ఎదురించే విషయంలో టీఎంసీ ధృడంగా వ్యవహరించట్లేదనే భావనే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే ఈద్ సందర్భంగా జరిగిన విరాళాలా కార్యక్రమంలో ఓ టీఎంసీ కార్యనిర్వహాకుడు రిటైర్ట్ ఉపాధ్యాయుడు రషీద్ ఆలం అనే వ్యక్తి కాంగ్రెస్, లెప్ట్ ఉమ్మడి అభ్యర్థి ఇమ్రాన్ అలీ అకా విక్టర్ కు కు రూ. 5 వేలు విరాళంగా ఇచ్చారు. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది. . అతను తన అల్లుడు తరపున మరో ₹2,000 విరాళంగా ఇచ్చాడు. “తన తండ్రి వలె, అతను (విక్టర్) ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. అతని వద్ద డబ్బు లేనందున నేను వినయపూర్వకమైన సహకారం అందించాను. పైగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ ఖాతాను స్తంభింపజేసింది' అని ఆలం అన్నారు. విక్టర్ తండ్రి మామ ఫార్వర్డ్ బ్లాక్ శాసనసభ్యులు. విక్టర్ కూడా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే, కానీ 2022లో కాంగ్రెస్‌లోకి మారారు.

ఈద్ సంప్రదాయం ప్రకారం పెద్దలు యువకులకు డబ్బును బహుమతిగా ఇస్తారు. కానీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి విరాళం ఇవ్వడం మాత్రం కొంచెం ఆశ్చర్య పరిచే విషయం. బెంగాల్‌లో పార్టీ పోటీలు తరచుగా దుర్మార్గంగా, క్రూరంగా ఉంటాయి. పార్టీ కార్యకర్తలు ఎదురుపడితే శత్రువుగా చూసే సంస్కృతి ఇక్కడ ఉంది. అయితే దేశంలో బలంగా ఉన్న బీజేపీని ఓడించాలంటే అందరూ ఒక్కటవ్వాలన్నా భావన అక్కడి కార్యకర్తల్లో బలంగా ఉండడమే దీనికి దారి తీసి ఉంటుందని అనుకోవచ్చు. చివరి దాకా ఇండి కూటమిలో ఉంటుందని అనుకున్న టీఎంసీ.. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది. అయితే లోకల్ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం దీనిపై సంతోషంగానే ఉంది. బెంగాల్ లో మైనారిటీ ముస్లింలు దాదాపు 27 శాతంగా దాకా ఉన్నారు. వీరిని తమ వైపు తిప్పుకున్న పార్టీలే అధికారాన్ని చెలాయిస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు అదే ప్రణాళికలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వారి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ అధికార టీఎంసీకి చెమటలు పట్టిస్తున్నారు. “బెంగాల్‌లోని మైనారిటీలు TMC పరిపాలనపై సంతోషంగా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు సాధించాల్సిన సమయం ఇది' అని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఇది ఆ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేస్తోంది.

టీఎంసీ అధికార వ్యతిరేకత..

వరుసగా మూడో సారి అధికారంలోకి రావడంతో టీఎంసీ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ఇంకా పూర్తి రూపం సంతరించుకోనప్పటికీ 2021 ఎన్నికల్లో లాగా మైనారిటీలు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి మద్ధతు ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో కొన్ని ఓట్లు వేరే పార్టీలకు దక్కవచ్చు. అవే ఫలితాలను పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో టిఎంసి, కాంగ్రెస్ మధ్య మైనారిటీ ఓట్ల చీలిక వల్ల మైనారిటీలు అధికంగా ఉండే మాల్డా, నార్త్ దినాజ్‌పూర్ జిల్లాల్లో బిజెపికి సీట్లు వచ్చాయి.ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న సాగర్‌డిఘిలో కాంగ్రెస్, వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి బేరాన్ బిశ్వాస్ గెలుపొందడంతో మైనారిటీలు ఇకపై ఒకే పార్టీకి పెద్దఎత్తున ఓటు వేయకుండా, బలమైన బీజేపీయేతర అభ్యర్థిని ఎంపిక చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే ఏడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. జనాభాలో 66 శాతానికి పైగా ముస్లింలు ఉన్న జిల్లాలో కాంగ్రెస్ 1,000 గ్రామ పంచాయతీ స్థానాలను గెలుచుకోగా, సీపీఐ (ఎం) దాదాపు 600 స్థానాలను గెలుచుకుంది. “ఎన్‌ఆర్‌సి-సిఎఎ వంటి బలమైన సమస్యలు లేనప్పుడు మైనారిటీలు ఏకమొత్తంగా టీఎంసీ వైపు వెళ్లకపోవచ్చు” అని బెంగాల్ మద్రాసా ఎడ్యుకేషన్ ఫోరమ్‌కు చెందిన ఇస్రారుల్ హోక్ మోండల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో సీఏఏ..

2024 లోక్‌సభ షెడ్యూల్‌ల ప్రకటనకు ముందే CAA నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది, అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనారిటీలలో అది పెద్ద సమస్యగా మారలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌ఆర్‌సి-సిఎఎపై స్థానిక ఎన్జీఓలు ‘నో ఓట్ టూ బీజేపీ’ అంటూ ప్రచారం నిర్వహించాయి. అయితే టీఎంసీ మాత్రం సీఏఏను పెద్ద సమస్యగా చూపుతూ ప్రచారం చేస్తోంది. బీజేపీ విభజన రాజకీయంలో “నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) తలలా, పౌరసత్వ సవరణ చట్టం (CAA) పొట్ట లా, యూనిఫాం సివిల్ కోడ్ (UCC) తోక లా సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు. దానిని బెంగాల్ లో అనుమతించము అని టీఎంసీ అధినేత ప్రతినబూనారు.

వామపక్షాలు-కాంగ్రెస్‌ల పట్ల బీజేపీ కూడా ..

TMC మైనారిటీ ఓట్లను చీల్చడం బిజెపికి లాభిస్తోంది. అయితే బీజేపీ నేతల ప్రచారాలను జాగ్రత్తగా గమనిస్తే వారు బెంగాల్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. “బెంగాల్‌లో బిజెపికి వ్యతిరేకంగా టిఎంసి, వామపక్షాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా పోరాడుతున్నారు ”అని ప్రధాని నరేంద్ర మోదీ తమకు గుర్తు చేసినట్లు ఓ సీనియర్ బీజేపీ కార్యకర్త ఫెడరల్ కు చెప్పారు. టిఎంసిని ఓడించడానికి వామపక్షాలతో "మహాజోత్" (మహాకూటమి) అనే అసాధ్యమైన ఆలోచనను గత సంవత్సరం ప్రతిపాదించిన బిజెపి నాయకుడు సుబేందు అధికారి ఇప్పుడు వామపక్షాలను కాంగ్రెస్‌ కూటమికి ఓటు వేయద్దని ప్రజలను కోరారు. మిగిలిన పక్షాలు కూడా ఇదే స్థాయిలో ప్రజలను కోరుతున్నారు. లోపాయికారీగా మరో పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని మమ్మల్ని ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని అన్ని పార్టీలు ప్రజలను కోరుతున్నాయి.

బీజేపీ ఓట్ల శాతం నిరంతరం తగ్గుతోంది

ఓటర్లలో ఒక వర్గం మళ్లీ వామపక్షాల వైపుకు తిరిగి వచ్చే అవకాశం ఉందని పార్టీ ఇప్పుడు భయపడుతోంది. 2019లో బీజేపీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అది 35 శాతానికి పరిమితమైంది. 2022 లో జరిగిన ఎన్నికల్లో కేవలం 12 శాతానికి పడిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో 22 శాతం గెలుచుకుంది. వామపక్షాల సంయుక్త మోర్చా (ఉమ్మడి ఫ్రంట్), కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఏకంగా 23 శాతానికి పైగా ఓట్లను పొందాయి. అయితే ఈసారి ఐఎస్ఎఫ్ ఏ కూటమిలోనూ భాగం కాదు. వామపక్ష-కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో TMC వ్యతిరేక ఓట్లను చీల్చి, చివరికి రాష్ట్ర అధికార పార్టీకి లాభం చేకూర్చవచ్చు.

హిందూ ఓట్లపై బీజేపీ ఆందోళన

మైనారిటీ ఓట్లు పూర్తిగా తమకు అనుకూలంగా మారకపోవచ్చని టీఎంసీ భయపడుతున్నట్లే, హిందూ ఓట్లపై బీజేపీకి కూడా అదే ఆందోళన ఉంది. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ TMC - BJP మధ్య హోరాహోరీ పోటీని చూపిస్తున్నాయి. అయితే ఏ పార్టీకైనా మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు దూరమైతే సీట్ల సంఖ్యలో భారీగా మార్పులు ఉండవచ్చు. బెంగాల్ పోల్ ఫలితం ఎక్కువగా లెఫ్ట్-కాంగ్రెస్ ఓట్ల శాతంపై ఆధారపడి ఉంటుంది. ఓట్లు చీలితే ఎవరు గెలుస్తారో ఫలితాలు వస్తే కానీ తెలియదు.

Read More
Next Story