
బెంగాలీ వద్దన్న ఒడియాలు హిందీని ఎందుకు వాటేసుకున్నారు?
త్రిభాషా సూత్రాన్ని స్వాగతిస్తున్న ఒడిశా ప్రజలు, బ్రిటిష్ ఇండియాలో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయినప్పటికీ..
సంహతి మహాపాత్ర
జాతీయ విద్యావిధానంలో భాగంగా హిందీని తమపై రుద్దుతున్నారని తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళనాడు నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలో త్రిభాషా విధానానికి ప్రతిఘటన అనేది ఎక్కడా మచ్చుకైన కానరావడం లేదు.
రాష్ట్రంలో ఒడియా అధికార భాష. అయితే దీనిపై హిందీ ప్రభావం బాగానే ఉంది. ఇక్కడ భాషా వ్యతిరేక ఉద్యమం 19 శతాబ్దంలో చివరలో జరిగింది. ఒడియాలపై బెంగాలీని రుద్దే ప్రయత్నం చేయడంలో ప్రజలు తిరుగుబాటు చేశారు.
ఆ తరువాత మరోసారి రాష్ట్రంలో భాషోద్యమాలు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం పై ఇక్కడ ఎలాంటి నిరసనలు లేవు.
చాలాకాలంగా ఇక్కడ హిందీ వాడుకలో ఉంది. పొరుగున్న ఉన్న రాష్ట్రాలు కూడా హిందీవే కావడంతో, హిందీలోనే విద్యావ్యాప్తి జరగడం, ఇక్కడ ఆ భాషకు ఆదరణ ఉంది.
ప్రజలలో ఒడియా జాతీయవాద భావాలను పెంపొందించడానికి ఒక వ్యవస్థీకృత ఉద్యమం లేకపోవడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ప్రస్తుతం ఎన్ఈపీ అమలు చేయబోయే రాష్ట్రాలలో ఒడిశా ఒకటి. ఇక్కడ బీజేపీనే అధికారంలో ఉంది.
హిందీ అంటే మక్కువ ఎందుకు?
‘‘మేము హిందీని వేరుగా చూడము. చాలాకాలంగా ఆ భాషతోనే జీవిస్తున్నాము. ’’ అని ఒడియా రిటైర్డ్ ప్రొఫెసర్ నటబర సత్పతి ‘దిఫెడరల్’ తో అన్నారు.
దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఒడియాల సాంస్కృతిక జీవితం ఎక్కువగా హిందీచే ప్రభావితమైంది. ఎక్కువగా హిందీ సినిమాలు, పాటల పట్ల ప్రేమ కారణంగా ఇది సాధ్యమైందని అన్నారు. హిందీ, ఒడియా రెండింటికి సంస్కృతంలోనే మూలాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు, ఇది వారి సామూహిక జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలుస్తుంది.
‘‘ఒడియాలో తత్సమ( సంస్కృతం నుంచి తెచ్చుకున్న పదాలు), తత్భామ(సంస్కృత పదాల స్థానీకీకరణ) పదాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సంస్కృత పదం కుపా ను ఒడియాలో కువా అని, హిందీలో కువాన్ అని పలుకుతారు.
ఇవి రెండు సంస్కృత భాష మారిన పదాలు. రెండు భాషల సారూప్యత హిందీని ఆమోదయోగ్యంగా చేశాయని జగత్సింగ్ పూర్ జిల్లాలోని మాజీ పాఠశాల ఉపాధ్యాయురాలు బిష్ణుప్రియ మిశ్రా ఫెడరల్ తో అన్నారు.
పాఠశాల విద్యలో హిందీ..
చాలా సంవత్సరాలుగా ఒడిశాలోని చాలా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో హిందీని ప్రధాన భాషగానే బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే ఒడియా, ఇంగ్లీష్ తరువాత హిందీని మూడో భాషగా పాఠాలు చెబుతున్నారు.
‘‘కొన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులకు హిందీని రెండో భాషగా ఎంచుకునే అవకాశం కల్పించాయి. దీనివలన ఒడియా మూడో స్థానానికి చేరుకుంది’’ అని జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు రబీదాస్ అన్నారు.
ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో హిందీనే మాట్లాడాతారు. కాబట్టి విద్య, ఉద్యోగాల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హిందీలో ప్రావీణ్యం సంపాదించాలని కోరుకుంటారని మిశ్రా అన్నారు.
‘‘ఒకప్పుడు వలసలు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారి, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కూడా హిందీ మాట్లాడుతుండటంతో దానికే ప్రాధాన్యం ఏర్పడింది’’ అని ఉపాధ్యాయురాలు చెప్పారు. స్థానికులు హిందీని జాతీయ భాషగానే చూస్తారు. ప్రజలు దానిని గౌరవించడానికి, నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని మిశ్రా చెప్పారు.
ఒడియాను పణంగా పెడుతున్నారా?
హిందీ భాష ప్రభావం ఒడియాపై చాలా స్పష్టంగా కనిపిస్తుందని విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు. ఇది ఒడియా భాషకు నష్టం కలిగించిందనే అభిప్రాయాన్ని మాత్రం వారు వ్యక్తం చేయడం లేదు.
రోజు వారి సంభాషణలో హిందీ పదబంధాలు, జాతీయాలను ఉపయోగించే యువత ఎక్కువగా ఉన్నారని సత్పతి చెబుతున్నారు. ఇటీవల వస్తున్న ఒడియా చిత్రాలలో కూడా మాటలు, పాటల్లోఇది కనిపిస్తుంది చెబుతున్నారు. ఇది కొంత పెడధోరణి లాంటిదే అని చెప్పారు.
ఒడియా పదాలు చచ్చిపోతున్నాయి..
ఇంగ్లీష్, హిందీ ప్రభావం యువతరంలో అనేక ఒడియా పదాలను వాడుకలో లేకుండా చేసిందని రుద్ర ప్రసన్న రథ్ అనే కాలమిస్ట్ అభిప్రాయపడ్డారు.
‘‘ప్రజలు సంభాషణల్లో ‘తోడినా’, ఫిర్బీ’ వంటి హిందీ పదాలను వాడుతున్నారు. దాంతో అనేక రోజువారి ఒడియా పదాలు కనుమరుగు అవుతున్నాయి. మీరు ఏ యువకుడిని అడిగినా వారికి ఆత్మగర్భి(అహంకారపూరిత), స్వార్థ(స్వార్థపూరిత) వంటి పదాల అర్థం తెలియదు. సోషల్ మీడియా పరిస్థితిని మరింత దిగజారుస్తుంది’’ అని ఆయన ఫెడరల్ తో అన్నారు.
2018 లో ఓ ప్రకటనలో ఇలాగే బెంగాలీ పదాలను ఉపయోగిస్తే సోషల్ మీడియాలో ట్రోల్ జరిగే సరికి వ్యాపారులు క్షమాపణ చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు ఒడియా సాహిత్యం, భాష పట్ల ప్రేమను వివరించి చెప్పడంలో వైఫల్యంతోనే యువత భాషకు దూరమవుతుందని రథ్ చెప్పారు.
పాఠకులు లేకపోవడం వల్ల ప్రజాతంత్ర, మీనాబజార్, సంసార్, శిశు రైజా, జన్హా మాము వంటి ప్రముఖ ఒడియా పత్రికలు మూతపడ్డాయని ఆయన్ చెప్పారు.
1971-2011 మధ్య ఒడియా మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని జనాభా లెక్కలు చెబుతున్నాయని వివరించే ప్రయత్నం చేశారు. ఈ నివేదికల ప్రకారం.. 1971 లో దేశంలో 3.62 శాతం ఒడియా మాట్లాడేవారి శాతం ఉండగా, 1981 నాటికి 3.46 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 లో 36.99 శాతం నుంచి 2011 నాటికి 43.63 శాతానికి చేరింది.
వ్యవస్థీకృత ఉద్యమం లేదు..
19 శతాబ్ధం నుంచి ఒడియాలో వ్యవస్థీకృత ఉద్యమం పూర్తిగా లేకపోవడంతో ఒడియా భాష, సంస్కృతి హిందీ హైజాక్ చేసే ప్రమాదం ఉందని ప్రముఖ జర్నలిస్ట్ సందీప్ సాహూ అన్నారు.
‘‘మన భాష, వారసత్వం, సంస్కృతి పట్ల మనకు శ్రద్ధ, గౌరవం లేకపోవడమే దీనికి కారణం. మన ఉదారవాద, సంకుచిత వైఖరి కారణంగా మన బాహ్య సంస్కృతులకు ప్రభావాలకు గురవుతున్నాయి. వివాహాలలో సంప్రదాయం కానీ సంగీత్, మెహందీ, హల్దీ వంటి ఉత్తర భారత ఆచారాలను అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు.
1895 లో ఒడిశా పాఠశాల విద్యలో బెంగాలీ భాషను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రమైన భాషా ఉద్యమాన్ని చూసింది. ఈ ఉద్యమం భారత్ లో వచ్చిన పునరుజ్జీవనం నుంచి ప్రేరణ పొందిందని చరిత్రకారుడు ఖరబేలా మొహంతి అన్నారు.
మధుసూదన్ దాస్, ఫకీర్ మోహన్ సేనాపతి, రాధానాథ్ రే, గంగాధర్ మెహర్ వంటి సామాజిక సంస్కర్తలు, సాహితీవేత్తలు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇది ఒడియా సాహిత్య విస్తరణకు దారితీసింది.
ఇది దాని గొప్ప సంస్కృతి, ప్రాచీనత గురించి బ్రిటిష్ పాలకులను ఒప్పించి చివరకు ఏప్రిల్ 1, 1936 లో ఒడిశా ప్రావిన్స్ ఏర్పాటుకు దారితీసింది. భారత్ లో స్వాతంత్య్రానికి పూర్వం భాష ఆధారంగా ఏర్పడిని మొట్టమొదటి రాష్ట్రం ఒడిశా అనే అని ఆయన గుర్తు చేశారు.
నవీన్ పట్నాయక్ ఉదాహారణ..
నేడు రాష్ట్రంలో భాష పై అభిమానం లేకపోవడంతో రాజకీయాలో ఈ అంశం ఎక్కువగా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నవీన్ పట్నాయక్ దాదాపు 24 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ భాషను నేర్చుకోవడానికి ఆయన శ్రద్ద పెట్టలేదు. పబ్లిక్ మీటింగ్ లో కూడా అతను భాషను సరిగా పలకనప్పటికీ ప్రజలు చప్పట్లు కొట్టేవారు. అయితే పాండియన్ వివాదంతో అధికారం కోల్పోయాడని సాహు అన్నారు.
‘‘నేను ఒకసారి ఒక బీజేడీ ప్రతినిధిని అడిగాను. నవీన్ ఒడియా ఎందుకు నేర్చుకోలేదని, దానికి అతను ‘నవీన్ బాబు లోగోకి మన్ కి భాషా పధ్ లేతేహై’ అని( అతనికి ప్రజల హృదయాల భాష తెలుసు) అని అదే ప్రస్తుతం ముఖ్యం’’ అని ఎగతాళి చేశాడని గుర్తు చేశారు.
ప్రాచీన భాష..
అనేక పోరాటాల తరువాత ఒడియా భాషకు 2014 లో ప్రాచీన భాష హోదా దక్కింది. రాష్ట్రం పోరాటాల ఫలితంగానే శాస్త్రీయంగా ఆ హోదా దక్కిందని సాహూ అన్నారు. అయితే ఇది పట్నాయక్ కు మంచి కంటే చెడు ఎక్కువగా చేసిందని ఆయన అన్నారు.
‘‘2017 లో సుభాష్ పట్నాయక్ ఒక భాషా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడూ అది తనకు ఇబ్బందిగా మారబోతుందని గ్రహించిన నవీన్ పట్నాయక్.. ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశాడు.
స్థానిక బోర్డులు స్థానిక భాషలోనే ఉండాలని ఆ ఉద్యమం ప్రారంభం అయింది. తరువాత చట్టానికి సవరణ చేశారు. అలాగే ఒడియాలో పనిచేయడానికి నిరాకరించిన అధికారులకు శిక్ష విధించాలని ఆదేశించే నిబంధనలను తొలగించడానికి నవీన్ వ్యక్తిగతంగా కలగజేసుకున్నారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యదాతథ స్థితిని కొనసాగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ‘‘హిందీని ఇష్టానుసారంగా నేర్చుకోవడం వేరు, బలవంతంగా నేర్చుకోవడం వేరు. ’’ అని దాస్ చెప్పారు.
Next Story