
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఈ సారి ‘సింగూర్’ ను మమత వైపుకు తిప్పుతున్నారా?
ఒకప్పుడు సింగూర్ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన టీఎంసీ, ఇదే అంశాన్ని ఉపయోగించుకుంటున్న బీజేపీ
బెంగాల్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు ప్రభావం అయ్యాయని బీజేపీ ప్రచారం చేయబోతోంది.
టీఎంసీ పాలనలో ఇదే అత్యంత బలహీనమైన అంశం. సరిగ్గా ఇదే అంశంపై కాషాయదళం తన దృష్టిని నిలిపింది. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం(జనవరి 18) సింగూర్ వద్ద ర్యాలీ నిర్వహించబోతున్నారు.
సింగూర్ లో నెలకొల్పబోయే టాటా నానో కార్ల పరిశ్రమ ఆందోళనల ఆధారంగానే 2011 లో మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగింది. 34 సంవత్సరాలుగా అధికారం చెలాయిస్తున్న కమ్యూనిస్టులకు సింగూర్ పోరాటాలు శాశ్వత బ్రేక్ వేశాయి. తరువాత వారి ఉనికే ప్రశ్నార్థకం అయింది.
2008 లో టాటా గ్రూప్ తమ కార్ల పరిశ్రమను గుజరాత్ కు తరలించాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధాని మోదీ అప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఆయన కార్ల తయారీ పరిశ్రమను సాదరంగా రాష్ట్రంలోకి ఆహ్వానించారు.
ఇప్పుడు జరగబోయే ర్యాలీలో ఇదే అంశాన్ని ఆయన హైలైట్ చేయవచ్చు. తరువాత కొన్ని రోజులకు అక్కడి రైతులు అనుభవిస్తున్న సౌకర్యాల వీడియోను పలు మీడియా సంస్థలు హైలైట్ చేశాయి.
బెంగాల్ లో రెండురోజుల పర్యటన..
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మాల్డాకు వెళ్తారు. తరువాత హౌరా- గౌహతి(గువహాటి) కలిపే వందే స్లీపర్ రైల్ సేవలు ప్రారంభిస్తారు.
బీజేపీలో లో ఇంటర్నల్ గా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. కోల్ కతకు దగ్గరలోని హుగ్లీ జిల్లాలోని సింగూర్ లో మోదీ రాకకోసం పార్టీ శ్రేణులను ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారు. సింగూర్ లో ఆయన రూ. 830 కోట్ల విలువ గల అనేక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు.
సింగూర్ వైఫల్యం నుంచి లాభాలు..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్యతో సహ బీజేపీ నాయకులు సింగూర్ ఆ పరిసర గ్రామాల ప్రజలతో చురుకుగా సంబంధాలు నెరుపుతున్నారు. ర్యాలీలు, పారిశ్రామికీకరణ, ఈ ప్రాంత అభివృద్ధిపై పార్టీ అభిప్రాయాలను, ఉద్దేశాలను వారికి చేరవేస్తున్నారు.
ఇక్కడ బీజేపీ లక్ష్యం సుస్పష్టం. ప్రజలు కోల్పోయిన అవకాశాలను తమ రాజకీయాల లాభంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటోంది.
‘‘టాటా కార్ల తయారీ యూనిట్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్న చోట, రాజకీయాలు పరిశ్రమలను ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని మనం చూశాము. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో పారిశ్రామిక విధానం అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారింది’’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు.
బీజేపీ బెంగాల్ లో అధికారంలోకి వస్తే తిరిగి టాటా సహ ఇతర పెద్ద పెద్ద పెట్టుబడిదారులు సింగూర్ కు తిరిగి వచ్చి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
బీజేపీ మద్దతు..
బెంగాల్ లో చాలామంది బీజేపీ నాయకులు సింగూర్ ర్యాలీని పార్టీ ప్రధాన ఎజెండాగా హడావుడి చేస్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం బుద్ధదేవ్ భట్టాచార్య పాలనలో సింగూర్ భూసేకరణకు మమతా బెనర్జీ చేసిన నిరసనలకు అప్పట్లో బీజేపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కోల్ కత- ఢిల్లీ నేషనల్ హైవే పై టీఎంసీ చేసిన ఆందోళనలో వేదిక పంచుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. టీఎంసీ అప్పట్లో ఎన్డీఏ లో భాగస్వామిగా ఉండేది.
ఆ కూటమి నుంచి బెంగాల్ లో గెలిచిన ఏకైక ఎంపీ మమతా బెనర్జీనే. కానీ తరువాత రాజకీయ సమీకరణాలు మారి రెండు పార్టీలు విడిపోయాయి. ఇప్పుడే ఇదే సింగూర్ ను బీజేపీ తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
‘‘ఉద్యోగాలు నినాదాలా ద్వారా కాదు, కర్మాగారాల ద్వారానే సృష్టించబడుతాయనే నిజాన్ని బెంగాల్ యువత గ్రహించాలని మేము కోరుకుంటున్నాము’’ అని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అన్నారు.
ఒకప్పుడు ఈయన కూడా టీఎంసీ నాయకుడిగా సింగూర్ వ్యతిరేక ఆందోళనలలో పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి కచ్చితంగా జరగాలని కోరుకుంటున్నారు.
బెంగాల్ రాణిస్తోంది..
అయితే బీజేపీ వాదనలు కొంతమంది ఆర్థివేత్తలు అంగీకరించడం లేదు. బెంగాల్ ఆర్థిక వ్యవస్థ సేవలు, రిటైల్, ఎంఎస్ఎంఈలు పలు రంగాలలో వృద్ధిని కనపరిచిందని, ఉపాధిని కల్పిస్తున్నాయని వారి వాదన.
2025-26 నాటికి రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రూ. 20.31 ట్రిలియన్లుగా అంచనా. వీటిలో ఉత్పత్తి, ఉద్యోగాలలో సేవల రంగం వాటా పెద్దది. అలాగే పర్యాటక రంగంలో మంచి పురోగతి సాధిస్తోంది.
ఇండియా టూరిజం డేటా కాంపెడియం 2025 ప్రకారం.. రాష్ట్రంలో 2024 లో దాదాపు 31 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 15 శాతం అధికం. మహారాష్ట్ర తరువాత విదేశీయులు ఎక్కువ సందర్శిస్తున్న రెండో ప్రజాదరణ పొందిన రాష్ట్రం బెంగాలే.
ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు వంటి రంగాలలో ఎగుమతి కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతులు రూ. 97,156 కోట్లకు చేరుకున్నాయి.
విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గాయి..
అయితే భారీ పరిశ్రమలు రాక, విదేశీ పెట్టుబడుల రాక విషయంలో మాత్రం టీఎంసీకి నెగటివ్ గా ఉన్నాయి. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) డేటా ప్రకారం అక్టోబర్ 2019 నుంచి డిసెంబర్ 2024 మధ్య బెంగాల్ లో వచ్చిన ఎఫ్డీఐలు కేవలం రూ. 13, 945 కోట్లు వచ్చాయి. ఇవి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.
ఇదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఎప్డీఐల వరద పారింది. మహారాష్ట్ర ఒక్కటే రూ. 6.9 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ మధ్య నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఆరో అతిపెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థ అయిన బెంగాల్, ఎగుమతుల్లో 12 వ స్థానంలో నిలిచింది.
ఇదే నివేదికలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలలో తయారీ, ఎగుమతి శక్తిలో ముందంజలో ఉన్నాయి. కానీ బెంగాల్ లో ఆ పరిస్థితి మాత్రం లేదు. బీజేపీ, అధికార టీఎంసీపై విమర్శలు గుప్పించడంలో ఈ గణాంకాలను ఉదహరిస్తున్నారు.
మమతా హయాంలో పెద్ద ప్రాజెక్ట్ లు లేవు..
బీజేపీ ప్రచారంలో ఒక మాటను పదే పదే వాడుతున్నారు. మమతా ప్రారంభించిన ఒక పెద్ద పరిశ్రమ రిబ్బన్ కటింగ్ ఫొటో ఉంటే విడుదల చేయమని పదే పదే సవాల్ విసురుతున్నారు. ఇది పెద్ద ప్రాజెక్ట్ లు ఏవీ రాష్ట్రానికి రాలేదని తెలియజేస్తున్నాయి.
ఈ వాదనకు ప్రతిగా టీఎంసీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వలస కూలీలపై వేధింపులు జరుగుతున్నాయని చెబుతోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా జాతీయవాద భావాలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తోంది.
బీజేపీ చెప్పాలనుకుంటున్న సందేశం ఏమిటంటే.. ఉద్యోగాలు తక్కువగా ఉండటం వలసదారులు రాష్ట్రం విడిచిపెడుతున్నారంటే దానికి కారణం టీఎంసీ పారిశ్రామికంగా చూపిన నిర్లక్ష్య వైఖరి కారణం.
Next Story

