పామునైనా నమ్మొచ్చు,  బీజేపీని మాత్రం కాదు: మమతా బెనర్జీ
x
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ

పామునైనా నమ్మొచ్చు, బీజేపీని మాత్రం కాదు: మమతా బెనర్జీ

ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. పామును అయినా నమ్మవచ్చు కానీ బీజేపీ మాత్రం కాదని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.


సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మోడల కోడ్ ఆఫ్ కండక్ట్ ను పాటించట్లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని కూచ్ బెహర్ లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. విషసర్పాన్ని అయినా నమ్మవచ్చు కానీ బీజేపీని నమ్మలేమని ఘూటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినా సీబీఐ, ఈడీ, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) కేంద్రంలోని బిజెపి ఆదేశానుసారం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను పరిశీలించి దీని తగిన చర్య తీసుకోవాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు.
"ఆవాస్ యోజన కోసం మళ్లీ పేర్లను నమోదు చేయమని బిజెపి మిమ్మల్ని అడుగుతోంది. పేర్లు మళ్లీ ఎందుకు నమోదు చేస్తారు? మీరు విషపూరిత పామును నమ్ముతారా?; పామును ఎవరైనా పెంచుకుంటారా?. బీజేపీని ఎప్పుడూ నమ్ముతారా పాము లాగే బీజేపీ కూడా.. కమలదళం దేశాన్ని నాశనం చేస్తోంది’’ అని ఆమె అన్నారు.
"కేంద్ర సంస్థల బెదిరింపులకు" తమ పార్టీ తలొగ్గదన్నారు. ఏప్రిల్ 19న జరగనున్న ఎన్నికలకు ముందు "BSF స్థానికులను చిత్రహింసలకు గురిచేసిన సందర్భాలు ఉంటే" పోలీసు ఫిర్యాదులు చేయాలని కూచ్ బెహార్‌లోని మహిళలను సీఎం బెనర్జీ కోరారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థలు, NIA, ఆదాయపు పన్ను, BSF, CISF బిజెపి కోసం పని చేస్తున్నాయి. కేంద్ర ఏజెన్సీలు కాషాయ శిబిరం కోసం పని చేస్తున్నందున ఎన్నికల మైదానంలో అవి తమ ఆట ఆడుతున్నాయి. కావునా ఎన్నికల కమిషన్ ను వీటిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. బిజెపి నియమాలను ఉల్లంఘిస్తోందన్నారు. బీజేపీ ఒకే దేశం, ఒకే పార్టీ అనే సూత్రాన్ని మాత్రమే అనుసరిస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
నిసిత్ ప్రమాణిక్ విషయాన్ని " ప్రస్తావిస్తూ అనేక కేసులున్న వ్యక్తిని హోంశాఖ సహాయ మంత్రిగా నియమించడం దేశానికే తలవంపులు తెచ్చే విషయమని.. ఆయనను మా పార్టీ నుంచి తొలగించారని.. ఇప్పుడు ఆయనే బీజేపీకి అస్త్రంగా మారారు"అని ఆమె వ్యాఖ్యానించారు. టీఎంసీ యూత్ కాంగ్రెస్ మాజీ నేత ప్రమాణిక్ 2018లో పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
బీర్భూమ్ నుంచి మాజీ కూచ్ బెహార్ ఎస్పీ దేబాషిస్ ధర్‌ను అభ్యర్థిగా నామినేట్ చేసినందుకు కాషాయ శిబిరంపై బెనర్జీ ఇలా అన్నారు, "2021లో సితాల్‌కుచిలో ఐదుగురి హత్యకు కారణమైన వ్యక్తి. ఇది బిజెపి నిజాయితీని ప్రతిబింబిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు దాని అభ్యర్థిగా నామినేట్ చేసింది." గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో SP కూచ్ బెహర్‌గా ఉన్న ధర్, తరువాత సస్పెండ్ అయ్యారు.
రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయమని బెనర్జీ మరోసారి ప్రకటించారు. CAA కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారుని విదేశీయుడిగా పేర్కొంటారన్నారు. "చట్టపరమైన పౌరులను విదేశీయులుగా మార్చడానికి CAA ఒక ఉచ్చు. మీరు (BJP) CAAని అమలు చేసిన తర్వాత, NRC అనుసరిస్తుంది. మేము పశ్చిమ బెంగాల్‌లో CAA లేదా NRCని అనుమతించము. మీరు దరఖాస్తు చేస్తే, మీరు విదేశీయులుగా గుర్తించబడతారు" అని బెనర్జీ చెప్పారు. .
జనాభా లెక్కల విభాగానికి చెందిన ఒక సభ్యుడిని CAA కమిటీలో చేర్చడాన్ని ఆమె ప్రశ్నిస్తూ, “భవిష్యత్తులో NRC కోసం ఎటువంటి ప్రణాళిక లేకపోతే అలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చారు? CAA తల కాగా NRC ని తోక గా అభివర్ణించారు. " పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష కూటమి ఇండి కూటమి -- సిపిఐ (ఎం), కాంగ్రెస్ "బిజెపితో చేతులు కలిపాయని" బెనర్జీ విమర్శించారు రాష్ట్రంలో ప్రతిపక్ష ఫ్రంట్ ఉనికిలో లేదన్నారు.
"పశ్చిమ బెంగాల్‌లో ఇండి కూటమి లేదు. ప్రతిపక్ష కూటమి ‘ఇండి’ ఏర్పాటులో నేనే కీలక పాత్ర పోషించాను. కూటమి పేరు కూడా నేనే పెట్టాను. కానీ సీపీఐ (ఎం), కాంగ్రెస్‌లు బిజెపి కోసం పనిచేస్తున్నాయి.’’ అని ఆమె ఆరోపించారు.
"మీరు బిజెపిని ఓడించాలనుకుంటే కాంగ్రెస్ సిపిఐ (ఎం)లకు అనుకూలంగా ఓటు వేయకండి. సిపిఐ (ఎం), కాంగ్రెస్ వారి మిత్రపక్షమైన మైనారిటీ పార్టీ (ఐఎస్ఎఫ్)కి ఒక్క ఓటు కూడా వేయవద్దు అని బెనర్జీ అన్నారు. ." "ఈ మైనారిటీ పార్టీ (ISF) AIMIM లాగానే ఉంది. వారు మైనారిటీ ఓట్లను చీల్చడానికి, బిజెపికి సాయం చేయడానికి పని చేస్తున్నారు" అని ఆమె విమర్శించారు.
Read More
Next Story