
ప్రధాని నరేంద్ర మోదీ
రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: ప్రధాని
వ్యక్తిగతంగా నష్టం చేకూర్చినప్పటికీ భారత్ తలవంచదని స్పష్టం చేసిన మోదీ
భారత్ పై వరుసుగా సుంకాల రంకెలేస్తున్న అమెరికాపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. భారత రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలతో రాజీపడే ప్రసక్తే లేదని బలమైన సందేశాన్ని పంపారు. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ధి ఉత్సవాలకు హజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
‘‘రైతుల ప్రయోజనాలే మాకు ప్రధానం. భారత్ తన రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలతో ఎప్పుడూ రాజీపడదు. దీనికి నేను వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. దేశ రైతులు, మత్స్యాకారులు, పశువుల పెంపకందారుల కోసం భారత్ సిద్దంగా ఉంది’’ అని మంగళవారం వ్యాఖ్యానించారు.
స్వామినాథన్ కు మోదీ నివాళులు..
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆహర భద్రత వారసత్వాన్ని పెంపొందించుకుంటూ మన వ్యవసాయ శాస్త్రవేత్తల తదుపరి సరిహద్దు అందరికీ పోషకార భద్రతను అందించడమే స్వామినాథన్ కు నిజమైన నివాళి అన్నారు. భారత్ అనేక వ్యవసాయ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ సుంకాలు విధించడం వలన ఈ రంగం బాగా ప్రభావితం అవుతుంది.
70 దేశాలకు సుంకాలు..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే వివిధ సుంకాలను జాబితా ట్రంప్ విడుదల చేశారు. దీనిలో భారత్ పై 25 శాతం సుంకాలు విధించారు.
పరస్పర సుంకాల రేట్ల మరింత సవరించడం అనే కార్యనిర్వాహక ఉత్తర్వూలో ట్రంప్ 70 దేశాలకు సుంకాల రేట్లను ప్రకటించారు. భారత్ పై విధించిన 25 శాతం పరస్పర సుంకం, సర్ధుబాటు చేసినట్లు, అవి గురువారం అమల్లోకి వచ్చినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది.
ఈ సుంకాలు పదిశాతం నుంచి 40 శాతం వరకూ ఉన్నాయి. జపాన్ 15 శాతం, లావోస్ మయన్మార్ 40 శాతం, పాకిస్తాన్ 19 శాతం, శ్రీలంక 20 శాతం, యూకే 10 శాతం విధించింది. గత వారం ప్రకటించిన 25 శాతం సుంకానికి అదనంగా బుధవారం భారత్ పై జరిమానా విధించారు. దీనితో భారత్ పై 50 శాతం సుంకాలు చేరుకున్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యధికం.
తాత్కాలిక ఎదురుదెబ్బ..
అమెరికా విధించిన సుంకాలు భారత్ కు ఎదురుదెబ్బ తాత్కాలికమే అని వివిధ ప్రపంచ డయాస్పోరా నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు ముగిసిన తరువాత పరిస్థితి మారుతుందని తెలిపారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, పౌర జీవితానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ అమెరికన్లు అర్థవంతంగా దోహదపడుతున్నాయని ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య డయస్పోరా ఒక సజీవ వారధిగా పనిచేస్తుందని ‘ఇండియా స్పోరా’ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా - భారత్ సంబంధం చాలా ముఖ్యం..
‘‘అమెరికా- భారత్ సంబంధాలు కేవలం ముఖ్యమైనదే కాదు.. అది చాలా అవసరమని మేము భావిస్తున్నాము. ప్రపంచ గతిశీలత మారుతున్న కొలదీ ఈ ఆర్థిక భాగస్వామ్యం 21 వ శతాబ్దంలో స్థిరత్వం, ఆవిష్కరణ, పురోగతికి మూల స్తంభంగా నిలుస్తుంది’’ అని అది పేర్కొంది.
భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించాలనే ట్రంప్ నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ అమెరికా కమ్యూనిటీ నాయకుడు, జో బిడెన్ మాజీ సలహదారు అజయ్ భూటోరియా అన్నారు.
‘‘అమెరికాకు అందుబాటులో ఉన్న జనరిక్ ఔషధాలలో దాదాపు సగం భారత్ సరఫరా చేస్తుంది. ఈ సుంకాలు ప్రిస్క్రిప్షన్ ధరలను పెంచుతాయి. కుటుంబాలు, వృద్దులు, చిన్న వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తాయి.
నిత్యావసరాలు, సుగంధ ద్రవ్యాలు, పప్పులు, దీపావళీ దుస్తుల ధరలు పెరుగుతాయి. వీటిపై 37 శాతం ధరలు పెరిగే అవకాశం ఉండవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.
ట్రంప్ చైనాకు 90 రోజుల విరామం ఇచ్చారని, అదే సమయంలో భారత ఇంధన అవసరాలను లక్ష్యంగా చేసుకున్నారని భూటోరియా పేర్కొన్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు 186 బిలియన్ డాలర్ల అమెరికా- భారత్ వాణిజ్య భాగస్వామ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలనే ఉమ్మడి లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు కలిసి సవాళ్లను అధిగమించాలన్నారు.
Next Story