సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
x
ప్రధాని నరేంద్ర మోదీ

సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

ఏ అంశంపై ప్రసంగించబోతున్నారో స్పష్టం తెలియని పీఎంఓ


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మోదీ ప్రసంగించే అంశంపై అధికారిక సమాచారం లేదు. ‘‘ఈ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు’’ అని ప్రధాని కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది.

రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు ప్రారంభం..
ప్రధాని ప్రసంగంలో జీఎస్టీపై తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి సవరించిన పన్నురేట్లు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
పెద్ద సంఖ్యలో ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు ప్రకటించింది. స్లాబ్ ల సంఖ్యను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది. ఇక నుంచి దేశంలో కేవలం 5 శాతం, 18 శాతం పన్నులు మాత్రమే వసూలు చేస్తారు. అయితే సూపర్ లగ్జరీ వస్తువులు, డీ మెరిట్ వస్తువులు మాత్రం 40 శాతం పన్నును వసూలు చేస్తారు.
హెచ్ వన్-1 బీ వీసా పై..
అమెరికాతో సంబంధాలలో భారత్ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో గతంలో అమెరికాకు భారత ఎగుమతులపై 50 శాతం పెంచడం, ఇప్పుడు హెచ్-1 బీ వీసా రుసుములను బాగా పెంచడం పై కూడా మోదీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం పెనాల్టీ సుంకాలు విధించిన అమెరికా, మరో 25 శాతం అమెరికా ప్రతీకార సుంకం విధిస్తామని చెప్పాారు.
అమెరికా ప్రభుత్వం హెచ్ వన్ బీ దరఖాస్తుల వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచింది. ఈ చర్య భారతీయులను భారీగా ఇబ్బంది పెడుతుంది.
స్వావలంబన సాధించాలి..
సుంకాలు, వీసా రుసుము గురించి పరోక్షంగా ప్రస్తావించిన మోదీ, భారత్ ఇతర దేశాలపై ఆధారపడటాన్ని వదిలివేసి స్వావలంబన పొందాలని అన్నారు. 2016 నోట్ల రద్దు, 2019 లో భారత్ విజయవంతంగా యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్షించడం వంటి ముఖ్యమైన ప్రకటనలు చేసినప్పుడు మోదీ ఇలాగే జాతినుద్దేశించి ప్రసంగించారు.
2020 లో కోవిడ్ తరువాత ఆయన ఇలాంటి ప్రసంగాల ద్వారా ప్రజలను నేరుగా సంప్రదించారు. లాక్ డౌన్ ల గురించి వారికి తెలియజేశారు. వారికి సూచనలు అందించారు. దేశాన్ని, ప్రపంచాన్ని తాకిన అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైలైట్ చేశారు.
Read More
Next Story