యూపీలో మూడో కూటమి.. ‘‘సామాజిక పరివర్తన్ మోర్చా’’
x

యూపీలో మూడో కూటమి.. ‘‘సామాజిక పరివర్తన్ మోర్చా’’

చంద్రశేఖర్ ఆజాద్ మా కూటమి సీఎం అంటూ ప్రకటించిన ఓవైసీ


Click the Play button to hear this message in audio format

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు మూడో కూటమి ఏర్పాటు అయింది. ఆజాద్ సమాజ్ పార్టీ(కాన్షిరాం), ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య పొత్తు కుదిరింది. ఈ కూటమికి సామాజిక పరివర్తన్ మోర్చా అని పేరు పెట్టి, ఈ కూటమి గెలిస్తే చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు.

బీజేపీని అడ్డుకుంటాం..

లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తూ, రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోకుండా నిరోధించడమే తమ రెండు పార్టీల పొత్తు లక్ష్యమని ఒవైసీ అన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని నేను విశ్వాసంతో చెప్పగలవు’’ అని ఆయన అన్నారు.
కులంతో సంబంధం లేకుండా వెనుకబడిన, దళిత వర్గాలతో పాటు అణగారిన, అట్టడుగు వర్గాల సమస్యలను కూడా ఈ మోర్చా చేపడుతోందని ఓవైసీ అన్నారు. రాజకీయ పార్టీలు ఈ వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, వారిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నామని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో విద్య ప్రమాణాలు పడిపోతున్నాయని, యువతలో నిరుద్యోగం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రశ్నలు లేవనెత్తుతుందని ఆయన అన్నారు. ‘‘మన సోదరుడు చంద్రశేఖర్ ఆజాద్ ఎస్పీఎంకు అధ్యక్షుడిగా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను’’ అని ఓవైసీ అన్నారు.

అణగారిన వర్గాలు..

కూటమి విజయం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని, ఆ విజయం ఉత్తర ప్రదేశ్ ప్రజల విజయవంతమవుతుందని ఆయన అన్నారు. నవంబర్ 26న జరిగే బహిరంగ సభకు హజరు కావాలని ఓవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సమావేశం రాష్ట్రంలో సామాజిక మార్పు ఉద్యమానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు.
బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలకు లక్ష్యంగా చేసుకుని అవి పాతకాలపు రాజకీయలకు చెందినవని ఒవైసీ అన్నారు. సామాజిక్ పరివర్తన్ మోర్చా భిన్నమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటుందని ఆయన చెప్పారు. ‘‘మేము భవిష్యత్ కోసం రాజకీయాలు చేస్తాము. మెరుగైన భవిష్యత్ ను నిర్మించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రజలు చంద్రశేఖర్ ఆజాద్ తో చేతులు కలుపుతారని మేము ఆశిస్తున్నాము’’ అని ఆయన అన్నారు.
Read More
Next Story