మతంతో సంబంధం లేదు, పీఓకే లో ఉన్నవారంతా భారతీయులే
మతంతో సంబంధం లేకుండా పీఓకే లో నివసిస్తున్న వారంతా భారతీయులే అని హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందువులు, ముస్లింలు భారత్ సొంతమని వ్యాఖ్యానించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారతదేశంలో భాగమని, మతంతో సంబంధం లేకుండా అక్కడ నివసిస్తున్న వారంతా భారతీయులేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
"PoK భారతదేశంలో భాగం. PoK ప్రజలు కూడా భారతీయులే - అది హిందువులు కావచ్చు లేదా ముస్లింలు కావచ్చు. PoKలో ఉన్న హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా స్వంతం" అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో జరిగిన ఇంటరాక్షన్‌లో ఆయన అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని కూడా గట్టిగా సమర్థించాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింసించబడిన మైనారిటీలకు భారత జాతీయతను అందించడానికి ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు. చట్టం 2019లో ఆమోదించబడిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నిబంధనలు జారీ చేసి చట్టాన్ని అమలు చేస్తున్నామని షా ఉద్ఘాటించారు.
సీఏఏ ప్రాంతం ప్రాతిపదికగా ఉందని చెప్పిన హోంమంత్రి దానిని వ్యతిరేకించే వారు ముస్లిం పర్సనల్ లా వంటి చట్టాలను సమర్థిస్తున్నారని విమర్శించారు. విభజన సమయంలో మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సహా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు.. పాకిస్థాన్ నుంచి వచ్చిన మైనారిటీలను భారతదేశంలో స్వాగతిస్తామని చెప్పారని అన్నారు.
విభజన సమయంలో పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 23 శాతం ఉండగా ఇప్పుడు రెండు శాతానికి తగ్గిందని, బంగ్లాదేశ్‌లో హిందువుల సంఖ్య 22 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, ఆఫ్ఘనిస్థాన్‌లో సిక్కుల సంఖ్య లక్ష నుంచి కేవలం 378కి తగ్గిందని గణాంక పూర్వకంగా వివరించారు. విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని బీజేపీ ఇప్పుడు నెరవేర్చిందని అన్నారు.
మూడు దేశాలకు చెందిన హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, క్రిస్టియన్, పార్సీ శరణార్థులకు పౌరసత్వం కల్పించే సీఏఏ పరిధి నుంచి ముస్లింలను మినహాయించడం గురించి ప్రశ్నించగా, మూడు దేశాలూ ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించబడ్డాయని, ముస్లింలు హింసను ఎదుర్కోలేరని హోంమంత్రి వివరించారు.
"సిఎఎ వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరు. ప్రతిపక్షాల మాట వినవద్దని నేను ముస్లిం సోదరులు, సోదరీమణులను కోరుతున్నాను. ప్రతిపక్షాలు మళ్లీ మీతో రాజకీయాలు చేస్తున్నాయి" అని ఆయన అన్నారు.నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) గురించి ప్రశ్నించగా, ఎన్నికల తర్వాత దాని గురించి మాట్లాడతానని చెప్పారు.
OBC సంక్షేమం గురించి రాహుల్ గాంధీ తరచుగా పదేపదే చేస్తున్న ప్రకటనపై అమిత్ షా చమక్కులు విసిరారు. ప్రధానమంత్రి స్వయంగా OBC అని, కానీ రాహుల్ గాంధీ కంటికి మాత్రం ఈ ఓబీసీ కనిపించరని అన్నారు.కేంద్ర కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని, రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకు కూడా తెలియదని షా అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో, 42 సీట్లలో బిజెపి 25 సీట్లకు పైగా గెలుస్తుందని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగా రాష్ట్రాన్ని నడుపుతున్నప్పుడు శాంతిభద్రతలు పరిరక్షించబడవు, అభివృద్ధి జరగవు. ఓటు బ్యాంకు కోసం రాష్ట్ర ప్రాయోజిత చొరబాట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
Next Story