ఢిల్లీని కాపాడాలంటే, ఆ ఒక్క పనే దిక్కు అంటున్న ఆప్ మంత్రి..
ప్రస్తుతం ఢిల్లీ అత్యంత తీవ్ర వాయుకాలుష్యంతో ఇబ్బంది పడుతోంది. ఎయిర్ ఇండెక్స్ ఏకంగా 500 దాటడంతో వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీని..
దేశ రాజధాని కాలుష్యం తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 కి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ప్రజల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని వెంటనే కృత్రిమ వర్షం కురిపించాలని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘ ఢిల్లీ ప్రజల పరిస్థితి దీనంగా ఉంది. ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. చర్య తీసుకోవడం ప్రధాని నైతిక బాధ్యత. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’’ అని మీడియా సమావేశంలో మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.
“ఉత్తర భారతదేశాన్ని మంచు పొరలు కప్పేశాయి. స్మోగ్‌ని వదిలించుకోవడానికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ' అని ఢిల్లీ పర్యావరణ మంత్రి అన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాలుగు లేఖలు పంపినప్పటికీ కృత్రిమ వర్షంపై ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు " అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ వర్షం పై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలి. ఢిల్లీ ప్రజలపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు.