ఎన్నికల వేళ ‘ఆప్’ కు మరో ఎదురుదెబ్బ
x

ఎన్నికల వేళ ‘ఆప్’ కు మరో ఎదురుదెబ్బ

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఆప్ అనేక వివాదాలతో సతమతం అవుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కాం, స్వాతి మాలీవాల్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కీలక నాయకులు..


లోక్ సభ ఎన్నికలకు ముందు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు చివరి రెండు దశల్లో ఇక్కడ జరగనున్నాయి. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జగ్ బీర్ సింగ్ బ్రార్ మంగళవారం ఆప్ ను వీడి బీజేపీలో చేరారు.

పంజాబ్ మాజీ ఎమ్మెల్యే అయిన బ్రార్ ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌తో సహా సీనియర్ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన అంతకుముందు శిరోమణి అకాలీదళ్ లో ఉన్నారు. ఒక సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలవ్వడంతో ఆయన ఆప్ లో చేరారు.
బ్రార్ 2007 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున జలంధర్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన గతంలో కాంగ్రెస్ జలంధర్ జిల్లా విభాగానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావల్ల పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఆప్ లో కీలకనేతలంతా వరుసగా జైల్లో పడటం,దాడులు, ప్రతిదాడులతో ప్రజల్లో పరువు పొగొట్టుకుంటున్న నేపథ్యంలో కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పార్టీని ఢిల్లీ లిక్కర్ స్కాం కుదిపేస్తుంది. పార్టీ నెంబర్, టూ, త్రీలు జైలు పాలయ్యారు. కేజ్రీవాల్ మాత్రం ఎన్నికల ప్రచారం నెపంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే జూన్ 2న ఆయన తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నారు.
మరోవైపు సొంత పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ సీఎం పీఏ, స్వయంగా ఆయన ఇంట్లోనే దాడులు చేయడం, దీనిపై కేసు నమోదు కావడంతో ఆప్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీనితో నేతలంతా తలో దారి చూసుకుంటున్నారు.


Read More
Next Story