![ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆతిశీ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆతిశీ](https://telangana.thefederal.com/h-upload/2025/02/09/511606-atish.webp)
ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆతిశీ
ఢిల్లీ కొత్త సీఎం పై ప్రధాని మోదీ దే తుది నిర్ణయం అన్న బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం తరువాత సీఎం పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ ఎన్నికల్లో అతి కష్టం మీద తను పోటీ చేసిన కల్కాజీ సీటును నిలుపుకున్న ఆమె, రాజ్ నివాస్ లో ఎల్జీ ని కలిసి రాజీనామా లేఖను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
నిన్న వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 26 సంవత్సరాల తరువాత తిరిగి అధికారంలోకి వచ్చింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు పది సంవత్సారాలు గా అధికారంలో ఉన్న ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. వరసుగా మూడోసారి కాంగ్రెస్ డకౌట్ అయి చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై దృష్టి పెట్టింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం విదేశీ పర్యటనలకు బయల్దేరబోతున్నారు. ఆయన వచ్చాక ఈ విషయంలో తుది నిర్ణయం ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కోసం డజన్ మంది దాక పోటీ పడుతున్నారు. అందులో పర్వేష్ వర్మ అందరికంటే ముందున్నారు. అర్వింద్ కేజ్రీవాల్ ను న్యూఢిల్లీలో ఓడించిన ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ కుమారుడు. దాంతో ఆయన ప్రతిష్ట అమాంతం పెరిగింది.
గత ఏడాది లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ అలాగే పదవిని అట్టిపెట్టుకుని ఉన్నాడు. బయటకు వచ్చాక రాజీనామా చేసి అతిశీకి పట్టం కట్టారు. అయితే ఎన్నికల్లో వీటిని ప్రజలు పట్టించుకోలేదు. కేజ్రీవాల్ వ్యవహార శైలి, అవినీతితో ప్రజలు విసిగిపోయి బీజేపీకి అధికారం అప్పజెప్పారు.
Next Story