‘ఆయుష్మాన్ భారత్’ పథకం పెద్ద స్కామ్: ఆప్ ఆరోపణలు
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ అధికార పార్టీ ఆప్ విమర్శలు గుప్పించింది. మీ పథకం పెద్ద స్కామ్ అంటూ ఎదురుదాడికి దిగింది.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం, ప్రధాని నరేంద్రమోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ఈ పథకాన్ని దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించింది. రాజకీయాల కారణాలతోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించిన తరువాత ఆ పార్టీ స్పందించింది.
మీ పథకం కంటే.. మాది గొప్పది
ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మీడియాతో మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ పథకం ఒక "స్కామ్" అని, బదులుగా ఢిల్లీ ఆరోగ్య నమూనాను అధ్యయనం చేయమని మోదీకి సూచించారు. “ ప్రజా ఆరోగ్యం అనే అంశం ఆప్‌కి ముఖ్యమైనది. కోఫీ అన్నన్ (యుఎన్ మాజీ సెక్రటరీ జనరల్) మమ్మల్ని మెచ్చుకునేలా మేము ఆరోగ్యానికి సంబంధించిన ఒక నమూనాను అందించాము.
కానీ ఆయుష్మాన్ భారత్ కింద ప్రధాని మోదీ ఒక స్కామ్‌ను సమర్పించారు... దీని గురించి కాగ్ మాట్లాడాలి. ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హెల్త్ మోడల్‌ను ప్రధాని మోదీ పరిశీలించి దేశమంతటికీ వర్తింపజేయాలని ఆమె అన్నారు.
మోదీ ఏం చెప్పారు
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో మంగళవారం మోదీ మాట్లాడుతూ, “ఢిల్లీ- పశ్చిమ బెంగాల్‌లోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. మీ బాధను నేను వింటున్నాను, అయితే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల నేను మీకు సాయం చేయలేను. "
దేశ రాజధానిలో ప్రజారోగ్య సమస్యపై ప్రధాని రాజకీయాలు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో విలీనం చేయబడిన 27,000 ఆసుపత్రులలో 7,000 పేపర్‌పై ఉన్నాయని, 4,000 ఆస్పత్రులు పథకం కింద ఏ రోగిని చేర్చుకోలేదని AAP ప్రతినిధి విమర్శించారు.
కేజ్రీవాల్ విమర్శలు..
పశ్చిమ బెంగాల్ - ఢిల్లీలో వృద్ధులకు ఉచిత వైద్యం అందించడం పట్ల తాను నిరాశకు గురయ్యానని, సీనియర్ సిటిజన్‌లకు సేవ చేయడానికి ఇది ఒక అవకాశాన్ని కోల్పోయిందని మోదీ అన్నారు. మోదీ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రజారోగ్య సమస్యపై తప్పుగా మాట్లాడటం, దానిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన సుదీర్ఘ పోస్ట్‌లో, మోదీ.. ఢిల్లీ మోడల్ హెల్త్‌కేర్‌ను అధ్యయనం చేయాలని, ప్రజలకు నిజమైన ప్రయోజనం కోసం దేశవ్యాప్తంగా తన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని భర్తీ చేయాలని అన్నారు.
ఢిల్లీ ఆసుపత్రుల ఉచిత చికిత్స
ఢిల్లీ ప్రభుత్వ పథకం కింద నగరంలో ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతుందని కేజ్రీవాల్ తెలిపారు. రూ.5 ఖరీదు చేసే మాత్ర అయినా.. శస్త్ర చికిత్సకు రూ. కోటి ఖర్చైనా.. మొత్తం ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య పథకంలో లక్షలాది మంది లబ్ధిదారుల జాబితాను ప్రధానికి పంపుతామని కూడా ఆయన చెప్పారు.
కేంద్ర పథకంలోని లోపాలు..
ఆయుష్మాన్ భారత్ వైఫల్యాల కారణంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి పేద రోగులు శస్త్రచికిత్సల కోసం ఢిల్లీ ఆసుపత్రులకు వస్తున్నారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. మరో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వ పథకం ఆచరణ సాధ్యం కాదని కొట్టిపారేశారు.
"మీకు రిఫ్రిజిరేటర్, మోటార్ సైకిల్ ఉంటే లేదా రూ. 10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, మీరు ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను పొందలేరు" అని సింగ్ చెప్పారు
Next Story