![మెనులో ‘బీఫ్ బిర్యానీ’వివాదం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మెనులో ‘బీఫ్ బిర్యానీ’వివాదం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు](https://telangana.thefederal.com/h-upload/2025/02/10/511882-nipp.webp)
మెనులో ‘బీఫ్ బిర్యానీ’వివాదం.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
నోటీసుపై వర్సిటీ అధికారుల సంతకం లేదన్న సంబంధిత అధికారులు
అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరగబోయే విందు భోజనంలో ‘బీఫ్ బిర్యానీ’ వడ్డించాలనే నోటీస్ అంటించిన అంశంపై వివాదం చెలరేగింది. దీనిపై పోలీసులు ఇద్దరు విద్యార్థులు, వర్సిటీ చీఫ్ ప్రోవోస్ట్ సహ ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
నోటీసు అతికించిన సర్ షా సులైమాన్ హాల్ ప్రోవోస్ట్ గౌహార్, ఇద్దరు విద్యార్థులయిన మహ్మద్ ఫైజుల్లా, ముజాస్సిమ్ అహ్మద్ లపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 302(మతపరమైన భావాలను దెబ్బతీయం, అనవసర పదాలు మాట్లాడటం) 270( ప్రజా ఇబ్బంది), 353 (ప్రజా దుష్ఫ్రవర్తన) ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో తమకు కర్ణి సేన మోమోరాండం సమర్పించిందని పోలీసులు తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ అభయ్ పాండే మాట్లాడుతూ.. మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.
ఏఏంయూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరు పాల్గొనే సులేమాన్ హాల్ లో బీఫ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని కర్ణిసేన ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ జ్ఞానేంద్ర సింగ్ అన్నారు.
ఈ చర్య ఏఎంయూ లోని హిందూ విద్యార్థుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించి, నిందితులిద్దరిపై కఠినచర్యలు తీసుకోవాలని కర్ణి సేన డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.
‘‘సులైమాన్ హాల్ కు చెందిన ఇద్దరు అధికారిక వ్యక్తులుజారీ చేసినట్లుగా చెప్పబడుతున్న ఆ నోటీసులో ఆదివారం భోజనం మెను మార్చబడింది. డిమాండ్ ప్రకారం.. చికెన్ బిర్యానీ బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది’’ అని మార్చేశారు.
ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. నోటీసు ఆహార మెనుకు సంబంధించిందని మేము కనుగొన్నాం. అయితే అందులో టైపింగ్ లోపం ఉంది. నోటీసుకు అధికారిక సంతకాలు లేనందున దాని ప్రామాణికతపై సందేహాలు తలెత్తడంతో వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారని ఏఎంయూ ప్రజా సంబంధాల విభాగం సభ్యురాలు విభా శర్మ అన్నారు.
‘‘ మా ప్రోవోస్ కు బాధ్యత వహించిన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విశ్వవిద్యాలయ నిబంధనలను కచ్చితంగా పాటించేలా మేము ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నాము’’
Next Story