బీహార్: సీట్ల కేటాయింపులో అగ్రకులాలదే ఆధిపత్యం
x
బీహార్ చిత్రం

బీహార్: సీట్ల కేటాయింపులో అగ్రకులాలదే ఆధిపత్యం

ఈబీసీలకు సరిగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్ష, అధికార పార్టీలు


బీహార్ అంటే కులసమరం. దేశంలో ఎక్కడలేనంతగా ఇక్కడ కులస్వామ్యం కొనసాగుతోంది. కొన్నిపార్టీలు అయితే కులం ఆధారంగానే సీట్ల కేటాయింపు, రాజకీయం చేస్తుంటాయి. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ పోరులో కూడా కులాల ఆధిపత్యం స్పష్టంగా తెలుస్తోంది.

అందులో సీట్లు కేటాయింపులలో అధికార పక్షంతో పాటు, విపక్షాలు కూడా అగ్రకులాల వారికి ప్రాధాన్యం ఇచ్చాయి. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి రాజ్యాధికారం చేరువ చేస్తామనే హమీని ఇరుపక్షాలు కూడా పక్కనపెట్టినట్లు గణాంకాలు చూస్తే తెలుస్తోంది.

2020 అసెంబ్లీ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపును పరిశీలించినప్పుడు ఎన్డీఏ, మహాఘట్ బంధన్ రెండు కూడా కొన్ని మార్పుల ప్రకారం సీట్లను సర్దుబాటు చేసినప్పటికి ఇప్పటికి సీట్ల పంపకాలలో అగ్ర కులాలకు అసమాన ప్రాముఖ్యతను ఇస్తున్నాయని తేలింది.



అగ్రకులాలదే ఆధిపత్యం..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తున్న 101 సీట్లలలో 49 మంది అగ్రవర్ణాల వారికి టికెట్లు ఇచ్చింది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికలలో 52 మందికి టికెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఆ సంఖ్య స్వల్పంగా తగ్గింది. అలాగే బీసీలకు గత ఎన్నికలలో 9 సీట్లు ఇవ్వగా, ఈసారి పది స్థానాలు కేటాయించింది.
నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) పార్టీ ఈసారి అగ్రవర్ణాలు, ఈబీసీలకు చెరో 22 సీట్లు కేటాయించింది. 2020 లో ఈబీసీలకు కేవలం 9 సీట్లే కేటాయించగా, ఈ సారి వారి సంఖ్యను భారీగా పెంచింది. అయితే బీహార్ లో ఈబీసీల వాటా 36 శాతంగా ఉంది.
మొత్తంగా ఎన్డీఏ తరఫున 243 సీట్లలో ఈబీసీలకు కేటాయించిన సీట్ల సంఖ్య 36 మాత్రమే. ఇది శాతంగా చెప్పాలంటే 14.81 శాతం. తాము ఈబీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికార పార్టీ చేస్తున్న వాదన గణాంకాలలో కనిపించడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ కూడా అగ్రకులాల అభ్యర్థులకు సీట్లను పెంచింది. 2020 లో 12 మందికి టికెట్లు ఇవ్వగా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో 16 మందికి పోటీకి నిలిపింది.
అలాగే బీసీలకు 24 నుంచి 21 సీట్లకు తగ్గించింది. కాంగ్రెస్ అగ్ర కులం ప్రాధాన్యాన్ని భారీగా తగ్గించింది. అంతకుముందు ఎన్నికలలో 34 మంది అభ్యర్థులను నిలబెట్టగా, అది ప్రస్తుతం 20 సీట్లకు తగ్గించింది, అలా అని బీసీలకు అది ప్రాధాన్యం పెంచలేదు.
ఈబీసీ ఓటర్లను ఆకర్షించడానికి 2025 లో ‘‘అతి పిచ్చదా న్యాయ్ సంకల్ప్’’ (అత్యంత వెనకబడిన వారికి న్యాయం) ప్రారంభించింది. అయితే సీట్ల ఎంపికలో మాత్రం ఈబీసీలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు.
మైనారిటీలు..
ముస్లింలకు అన్ని పార్టీలు సమప్రాధాన్యం ఇవ్వడం లేదు. 2020 నుంచి 2025 మధ్య బీజేపీ ఏ ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. దాని మిత్రపక్షం జేడీ(యూ) 2020 లో మైనారిటీలకు 11 సీట్లు కేటాయించింది.
ఈ సంవత్సరం కేవలం 4 సీట్లు మాత్రమే ఇచ్చింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు దాదాపుగా 17 శాతం ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం తమ సీట్లలో 2020 నుంచి 2025 వరకు ఒకే పద్దతిలో వరుసగా 18, 10 సీట్లు కేటాయించాయి.
షెడ్యూల్డ్ కులాలు..
చాలా పార్టీలలో దళిత(షెడ్యూల్డ్ కులం) ప్రాతినిధ్యం స్తబ్ధుగా లేదా కొద్దిగా తగ్గింది. అయితే షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) అభ్యర్థుల జాబితాలో వాస్తవంగా లేవు. ముఖ్యంగా బీజేపీ 2020 లో 15 సీట్లను కేటాయించగా, ఈ ఎన్నికలలో 11 సీట్లను అలాట్ చేసింది.
బీహార్ జనాభాలో ఎస్సీలు, ఎస్టీలు 20 శాతానికి పైగా ఉన్నారు. జేడీ(యూ) ఎస్సీ అభ్యర్థుల సంఖ్యను 18 నుంచి 15 కి తగ్గించింది. ఆర్జేడీ తన ఎస్సీ ప్రాతినిధ్యాన్ని 19 నుంచి 21 కొద్దిగా పెంచింది. కానీ ఎస్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. 2020 లో రెండు సీట్ల నుంచి వెనక్కి తగ్గింది.
ఈబీసీలు మెజారిటీ..
బీహార్ లో ఈబీసీ అతిపెద్ద కుల కూటమి అయినప్పటికీ అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ ఈబీసీలను నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నాయనేది మాత్రం సత్యం.
రాజకీయ విశ్లేషకుడు రూపేష్ కుమార్ ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘ఈబీసీల ప్రతినిధిగా ఉన్న నితీశ్ కుమార్ కూడా వారికి దామాషా ప్రాతినిధ్యం ఇవ్వడానికి దూరంగా ఉన్నారు. ఇది సామాజిక న్యాయంపై ద్వంద్వ వైఖరిని బయటకు తెలిసింది’’.
సీట్ల కేటాయింపుల్లో స్వల్ప మార్పులతో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గత సంవత్సరాల సామాజిక అసమతుల్యతను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రం కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. ఇది ఈబీసీలకు వాస్తవికంగా ఎప్పుడూ సమన్యాయం చేస్తుందో చూడాలి.
Read More
Next Story