ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: కేజ్రీవాల్
x

ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: కేజ్రీవాల్

లెప్టినెంట్ గవర్నర్ తో పథకాలు ఆపేస్తున్నారని ఆగ్రహం


వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో మహిళా సమ్మాన్ యోజనను ఆపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మక్కు అయిందని అన్నారు.

ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని ఆప్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇది సక్రమంగా అమలైతే మహిళా ఓటర్లు తమ వైపు తిరిగి ఎక్కడా గెలుస్తామో అని కుట్రలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి విమర్శించారు.
అర్హత గల మహిళల వివరాలను సేకరించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే లెప్టినెంట్ గవర్నర్ ద్వారా ఉత్తర్వులు తెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపుతున్నారు.. ?
“ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలోని అర్హులైన మహిళలందరికీ నెలకు రూ. 2,100, సంజీవని యోజన కింద సీనియర్ సిటిజన్‌కి ఉచిత చికిత్సను ప్రకటించాము.’’ కానీ లెప్టినెంట్ గవర్నర్ ద్వారా బూటకపు ఆదేశాలను బీజేపీ తీసుకువచ్చిందని, తమ పథకం పై విచారణ ప్రారంభించారని, ఏం దర్యాప్తు చేస్తారని అన్నారు.
“అసలు పరిశోధించడానికి ఏముంది? మేం డబ్బులు వసూలు చేయడం లేదు. ఎన్నికల తర్వాత ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు వచ్చి నమోదు చేసుకోవాలని మాత్రమే కోరుతున్నాం. విచారణ పేరుతో ఇంకా ప్రారంభించని ఈ పథకాలను మూసివేయాలని చూస్తున్నారు'' అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
"ఇది ఎన్నికలలో గెలిచిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పిన ఎన్నికల వాగ్దానం, కానీ వారు ఇప్పటికే దానిని ఆపాలనుకుంటున్నారు," అన్నారాయన.
బీజేపీకి నిద్ర కరువైంది..
రెండు పథకాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయని, ఆప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే, వేల సంఖ్యలో ప్రజలు స్పందించారని అన్నారు. ‘‘బీజేపీ భయాందోళనకు గురై సరైన నిద్రకు దూరమైంది. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న క్యాంపులకు తమ గూండాలను పంపించి శిబిరాలను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వారు పోలీసులను కూడా పంపారు ” అని కేజ్రీవాల్ ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన, ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుయాత్ర వంటి పథకాలను నిలిపివేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ ఆరోపించారు. “నేను ఢిల్లీ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, పొరపాటున మీరు బిజెపికి ఓటు వేస్తే, మీరు ఢిల్లీని వదిలి వెళ్లవలసి ఉంటుంది. నగరం మీకు నివసించలేనిదిగా మారుతుంది ” అని జోశ్యం చెప్పారు.
చీకటి యుగం వైపు తీసుకెళ్తుంది..
ఓట్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. “ఈ రోజు బీజేపీ మనపైకి తెచ్చిన చీకటి యుగాన్ని భారతదేశం ఎన్నడూ చూడలేదు. వారు బహిరంగంగా నగదు పంపిణీ చేస్తూ తమకు ఓటు వేయమని చెబుతున్నారు. ఈ సంఘటనలపై విచారణ జరగడం లేదు’’ అని ఆరోపిస్తున్నారు. పర్వేష్ వర్మ ఇంతకుముందు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఒక్కో మహిళకు రూ. 11 వందలు పంచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే ఢిల్లీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. బీజేపీ- కాంగ్రెస్ కుమ్మక్కాయాయని ఆప్ ఆరోపణలు చేస్తూనే బీజేపీని కార్నర్ చేయడానికికి
“ బీజేపీ ఎంతగా తెగించిందో, దానిని కాపాడమని కాంగ్రెస్‌ను వేడుకుంటున్నది. మహిళా సమ్మాన్ యోజనకు వ్యతిరేకంగా ఎల్‌జీకి ఫిర్యాదు చేయడానికి కూడా అది ధైర్యం చేయలేదు. బదులుగా కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్‌ తో ఆ పని చేయించింది” అని ఆయన ఆరోపించారు.
అంతకుముందు రోజు, మహిళా సమ్మాన్ యోజన పేరుతో మహిళల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులను లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయం స్పందించింది. ప్రధాన ఎన్నికల కార్యాలయం ద్వారా ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎల్‌జీ ఆదేశించారు.


Read More
Next Story