ఢిల్లీ కిరీటం చేజిక్కించుకున్న బీజేపీ
x

ఢిల్లీ కిరీటం చేజిక్కించుకున్న బీజేపీ

చివరి వరకూ గట్టిపోటీ ఇచ్చిన ఆప్


దేశమంతా చిక్కింది. ప్రతిసారి లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తున్న.. అసెంబ్లీ ఎన్నికలవగానే చతికిలపడుతోంది. దాదాపు దశాబ్ధకాలంగా ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు కమలానికి దక్కింది. ఇదంతా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం గురించే.

తాజాగా జరుగుతున్న కౌంటింగ్ లో బీజేపీ దాదాపు 46 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరడంతో బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో సంబురాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో పీఠాన్ని దక్కించుకోవడానికి 27 సంవత్సారాలుగా కాషాయ పార్టీ పోరాటం చేస్తోంది. అయితే అది దానికి అందని ద్రాక్షలా మారింది.
ఈ సారి ఎన్నికల్లో దాని కల సాకారమైంది. ఈ విజయం లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మూడో రౌండ్ ముగిశాక దాదాపు 30 స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో బీజేపీ లో ఓరకమైన టెన్షన్ వాతావరణం కనిపించింది. చాలా చోట్ల ఆధిక్యం వేయి లోపే ఉండటంతో ఎప్పుడైనా ఏమైన జరగగొచ్చని అంచనాలు వెలువడ్డాయి.
అయితే చివరగా మురికి వాడలకు సంబంధించిన ఈవీఎంలు కౌంటింగ్ మొదలవగానే బీజేపీ హవా కు ఎదురేలేకుండా పోయింది. ఆప్ కేవలం 24 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. సీఎం ఆతీశీ మార్లేనా సైతం వెనకంజలో ఉన్నారు. అయితే రెండు పార్టీల మధ్య ఓటు షేర్ కేవలం 5 శాతం వరకు మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆరు శాతం ఓట్లను చేజిక్కించుకున్నప్పటికీ కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో కొనసాగలేదు.
ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం జరిగిన ఓటింగ్ లో 58 శాతం మంది ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ అసెంబ్లీలో 70 స్థానాలుండగా 36 స్థానాలు సాధించిన పార్టీకి అధికారం దక్కుతుంది. ఇంతకుముందు 2015 లో జరిగిన ఎన్నికల్లో ఆప్ కు 67 స్థానాలు దక్కించుకోగా, 2020 లో 62 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది.
అయితే తాజాగా కేజ్రీవాల్ పార్టీకి ఎదురుగాలి బలంగా వీచింది. ఆ పార్టీ పీకల్లోతూ అవినీతిలో కూరుకుపోవడంతో జనం పట్టించుకోలేదు. ఆయన సైతం ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు.


Read More
Next Story