మమతా బెనర్జీ బెదిరింపు వ్యాఖ్యలపై భగ్గుమన్న పొరుగు రాష్ట్రాలు
బెంగాల్ ను తగలబెడితే పక్క రాష్ట్రాలకు కూడా అదే గతి పడుతుందనే వ్యాఖ్యలపై పక్క రాష్ట్రాలపై సీఎం భగ్గుమన్నారు. సొంత ప్రజలకు న్యాయం చేయడంపై దీదీ దృష్టి పెడితే ..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు నాయకులు భగ్గుమన్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి లో జరిగిన ఘోర అత్యాచారం, హత్య పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్‌కు నిప్పు పెడితే అస్సాం, ఈశాన్య భారత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కి కూడా అదే గతి పడుతుందనే తరహలో మాట్లాడారు. దీనితో కమల దళం ఘాటుగా ప్రతిస్పందించింది.
కోల్‌కతాలో బుధవారం (ఆగస్టు 28) తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) విద్యార్థి విభాగం ర్యాలీలో ప్రసంగిస్తూ మమత ఈ వివాదాస్పద ప్రకటన చేశారు. బుధవారం 12 గంటల బంద్ సందర్భంగా కోల్‌కతాలో హింసాత్మక నిరసనల తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలకు మమతా హెచ్చరిక చేసింది.
ఈ హెచ్చరికపై సామాజిక మాధ్యమాలపై చురుకుగా ఉండే అసోం సీఎం హిమాంత్ బిశ్వ శర్మ గట్టిగా చురక అంటించారు. మమతా హెచ్చరిక చేసిన అదే రోజు సాయంత్రం హిందీలో పోస్ట్ చేస్తూ.. “దీదీ, అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? కళ్లు ఎర్రగా చేసి మా వైపు చూడొద్దు. మీ వైఫల్యాలను పక్కవారీగా తోయవద్దు. దేశాన్ని కాల్చివేయడానికి కూడా ప్రయత్నించవద్దు. విభజన మాట్లాడటం అంతమంచిది కాదు’’ అని అన్నారు.
'రాజకీయ నాయకుడికి తగనిది'
ఈ వ్యాఖ్యలపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లోనే ట్వీట్ చేసిన ఆయన.. ఈశాన్య భారతాన్ని బెదిరించడానికి నీకెంత ధైర్యం. తీవ్రపదజాలంతో నేను ఈ బెదిరింపును ఖండిస్తున్నాను. దేశానికి, ఈశాన్యరాష్ట్రాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. విభజన రాజకీయాలతో హింసను, ద్వేషాన్ని రెచ్చగొట్టడాన్ని మమతా తక్షణమే ఆపాలి. బహిరంగ వేదికపై హింసాత్మక బెదిరింపులు చేయడం రాజకీయ నేతకు తగని పని అని హితబోధ చేశారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఇదే స్వరంతో మమతా పై విమర్శలు గుప్పించారు. "ఒడిశా శాంతియుత రాష్ట్రం. ఇక్కడి ప్రజలపై ప్రతికూల, విభజన, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? ఒడిశా ప్రజలు తమపై అలాంటి ద్వేషపూరిత, ప్రతికూల అనుచిత వైఖరిని అంగీకరించరు." మాఝీ బుధవారం రాత్రి ఎక్స్ లో పోస్టు చేశారు.
పక్క రాష్ట్రాలపై పడకుండా మీ దృష్టిని బాధితురాలికి న్యాయం చేయడం పై పెట్టాలని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు నాయకులు దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు.
“మమతా బెనర్జీ, ఒక మహిళ, తన రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నేడు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నం ఎప్పటికీ నెరవేరదు, ప్రజలు తగిన సమాధానం ఇస్తారు" అని మాఝీ చెప్పారు.
కేంద్ర మంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ మమత బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఎక్స్‌లో ఇలా వ్రాశారు, “సీఎం మమతా బెనర్జీ ఈ రోజు సిగ్గు లేకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇది రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సందేశం ఇదా. అది దేశ వ్యతిరేక స్వరం. ఆమె ప్రకటన ప్రజలను బెదిరించడం, హింసను ప్రేరేపించడం, ద్వేషాన్ని నాటే ప్రయత్నమే. అంత ముఖ్యమైన పదవిని చేపట్టే అర్హత ఆమెకు లేదు. మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలి’’ తన పోస్టులో డిమాండ్ చేశారు.
న్యాయం కాదు, ప్రతీకారం
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ లో చేసిన పోస్ట్ లో "140 కోట్ల మంది భారతీయులు పశ్చిమ బెంగాల్ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు... మమతా బెనర్జీ ప్రాధాన్యత న్యాయం కాదు, ప్రతీకారం. ఒక సీఎం ఏకంగా ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, ఈశాన్య, ఒడిశా రాష్ట్రాలను కాల్చి వేస్తామని బెదిరిస్తోంది.
అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఆప్ లేదా గౌరవ్ గొగోయ్ ఈ ప్రకటనకు మద్దతిస్తారా అని నేను అడగాలనుకుంటున్నాను... న్యాయం కోరే వ్యక్తులు అశాంతి కలిగిస్తున్నారా, మమతా బెనర్జీ న్యాయం కోరడం ఇష్టంలేక అశాంతిని కలిగిస్తోంది. ఆమె రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది. రాజ్యాంగం కాపీతో తిరుగుతున్న రాహుల్ గాంధీ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు.
ఆమె ప్రకటనను కేంద్ర మంత్రులు కూడా ఖండించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మాట్లాడుతూ.. “ఒక ఎన్నికైన ముఖ్యమంత్రి హింసకు పిలుపు ఇవ్వడం ప్రజల ఇచ్చిన అధికారానికి చేసిన గొప్ప ద్రోహం.
ఎక్స్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, “మమతా దీదీ, మీ నిరాశ న్యాయమైనది. కోల్‌కతా అత్యాచారం-హత్య కేసులో మీ ప్రభుత్వం, పోలీసులు ప్రతిరోజూ బహిర్గతమవుతున్నారు.
“ మీరు బెంగాల్‌ను అరాచకం, హింస, చెడు పాలనకు కోటగా మార్చారు. కానీ బెంగాల్ లాగా, బిజెపి పాలిత రాష్ట్రాల్లో, గూండాలు, అరాచక శక్తులు, నేరస్థులకు ప్రేమ, రక్షణ ఇవ్వబడదు, చట్టం బుల్డోజర్ వారిపై ప్రయోగించబడింది, ”అన్నారాయన.
కార్నర్ చేయబడిన మమత
బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, “యువత డాక్టర్ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ లో జరిగిన క్రూరమైన అత్యాచారం హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న సొంత ప్రజలపైనే మమతా బెనర్జీ యుద్ధం ప్రకటించారు. మరణించిన వారు మా సోదరి లేదా కుమార్తె కావచ్చు, కానీ మమతకు మాత్రం రక్తపాతం కావాలని అన్నారు.
Next Story