సెలబ్రిటీల స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా పోటీ
x
బాలీవుడ్ నటి, కంగనా రనౌత్

సెలబ్రిటీల స్థానంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా పోటీ

హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బరిలోకి దిగారు. ఇక్కడ నుంచి ఎప్పుడైన సెలబ్రిటీలు రాజవంశీయులు పోటీ చేయడం..


హిమాచల్ ప్రదేశ్ లోని మండి. రాజకుటుంబాలకు రాజధానిగా పేరుగాంచింది. చాలా హై ప్రొఫైల్ ఉన్న కుటుంబాలు ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుంటాయి. తాజాగా బీజేపీ తరఫున బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బరిలోకి దిగింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ కంగనా ఎంపిక చేయడం మాత్రం పలు వివాదాలకు దారి తీసింది.

హిల్స్ రాష్ట్రమైన హిమాచల్ లో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన మండిలో జరిగిన పోరు జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ఈ స్థానానికి ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు.
కంగనాను రంగంలోకి దించడం ద్వారా, బిజెపి వివాదాల్లో చిక్కుకుంది, ప్రత్యేకించి బీజేపీ హితం కోరుకునే ఓ నటుడితో పాటు పలువురు విమర్శకులు కూడా కంగనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఎప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్ కు గురవడం, వివాదస్పద ప్రకటనలు చేయడం వంటివి పలువురు ప్రస్తావించారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా కమలదళం టికెట్ కేటాయించింది. ఇప్పుడు కంగనా ఎదుర్కొనే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించగానే స్టార్ ఎట్రాక్షన్ కొత్త రూపం సంతరించుకుంటుంది.
వీఐపీ నియోజకవర్గం
సాధారణంగా, మండి స్థానం నుంచి పోటీ చేసేవారు ఎప్పుడూ సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కాదు. రాజకుటుంబానికి చెందిన మహేశ్వర్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ మూడుసార్లు చొప్పున గెలుపొందగా, వీరభద్ర సింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్ రెండుసార్లు చొప్పున మండి నుంచి గెలుపొందారు. ఇందులో వీరభద్ర సింగ్ బుషెహర్ రాచరిక కుటుంబానికి చెందినవారు, మహేశ్వర్ సింగ్ కులు, సుఖ్ రామ్ మండి జిల్లాకు చెందినవారు.
అదే సమయంలో, అనుభవజ్ఞుడైన జైరామ్ ఠాకూర్ మండి నుంచి ఓడిపోయారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అతను అక్కడ బలమైన పట్టు సాధించారు, RSS తో సంబంధం ఉన్న రామ్ స్వరూప్ 2019 లో ఇక్కడ విజయదుందుబీ మోగించారు.
బీజేపీ ట్రంప్ కార్డ్
మొత్తంమీద, మండి ఎన్నికలు ప్రతిసారీ కొత్త దశ, దిశ, కోణాన్ని తీసుకుంటాయి. సెలబ్రిటీ కంగనాపై బీజేపీ కావాలనే నిలబెట్టింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ తాను ఈసారి పోటీ చేయలేనని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ వీస్తుంన్నందునే ప్రతిభా సింగ్ పోటీ చేయట్లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఆమె ఖండించారు. మండి కి చెందిన కార్యకర్తలను అధికారంలో ఉన్న తమ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని కూడా ఆమె ఆరోపించారు. అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.
మండిలోని బీజేపీ కార్యకర్తలు కంగనాను ప్రత్యక్షంగా చూసి థ్రిల్‌గా ఫీలవుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఆమె ఉనికిని చూసి మురిసిపోతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను బాహాటంగా మాట్లాడే కంగనా తోసిపుచ్చినప్పటికీ, పాంగి, లాహుల్, రాంపూర్, ఛత్రీ, సరాజ్, మండి మాండలికాలు మాట్లాడే ఓటర్లు బిలాస్‌పురి, సర్కాఘటి మాండలికం మాట్లాడే కంగనాను చూసి కలవరపడ్డారు. ఈ స్థానిక యాసలు కూడా మాట్లాడడమే కంగనా ముందున్న సవాలు.
కీలక సవాళ్లు
మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో కులు జిల్లా నుంచి నాలుగు, చంబా, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లా జిల్లాల నుంచి ఒక్కొక్కటి సహా 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పార్లమెంటరీ ప్రాంతం ఆరు జిల్లాలను కలిగి ఉంది. ఈ ఆరింటికి వేర్వేరు మాండలికాలు ఉన్నాయి. ఈ 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
సరాజ్‌లోని జైరామ్ ఠాకూర్ స్థానం, మండిలో అనిల్ శర్మ స్థానం, భర్మౌర్‌లోని జనక్ రాజ్ స్థానం, సుందర్‌నగర్‌లోని రాకేష్ జమ్వాల్ స్థానం నుంచి బిజెపి మెజారిటి ఓట్లను పొందుతుంది. సొంత ఇమేజ్ కలిగి ఉన్న కంగనా, నిస్సంకోచంగా మోదీ మద్ధతుదారుగా పేరు పొందారు. అయితే అంతే స్థాయిలో సవాళ్లు సైతం ఉన్నాయి.
ముందు ముందు ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ పూర్తి స్థాయి దాడికి దిగనుంది. సంఘ్, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కంగనా చిత్రాలు, ఆమె బహిరంగ ప్రకటనలు లేదా ఆమె డైట్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా కంగనాకు అడ్డంకులు సృష్టిస్తాయి.
సాధ్యమయ్యే అడ్డంకులు
కులు నుంచి బిజెపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపి మహేశ్వర్ సింగ్ నేతృత్వంలోని పెద్ద దేవ్ కమ్యూనిటీ ప్రభావం కొంచెం కంగనాకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. వీరభద్ర కుటుంబం రంగంలోకి దిగితే, రాజకుటుంబం, దేవ్లు వర్గీయుల ఐక్యత కూడా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపుతుంది. కంగనా గ్లామర్ కారణంగా వేదికపై పెద్ద పెద్ద నాయకుల ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ అంశం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇష్టమైన నటి
బోల్డ్ యాక్టర్‌గా కంగనా యువతకు ఫేవరెట్‌గా నిలిచింది. ఈ కోణంలో చూస్తే, ఆమెకు బీజేపీ కార్యకర్తల ఓట్లు రాకపోయినా, ఆమె అభిమానుల ఓట్లు వస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ హవాను ఇంకా అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. కొంచెం ఆలస్యం అయినా మాజీ సీఎం కుటుంబం ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. వీరు ప్రచారం లో దిగితే కంగనాకు ఇబ్బందులు తప్పవు. ఒకవేళ విక్రమాదిత్య సింగ్‌ తన తండ్రి పదవిని తీసుకుంటే కంగనా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. తన తండ్రిలాగే విక్రమాదిత్య సింగ్ కూడా యువతలో బాగా పాపులర్.
కంగనా లేక మోదీవేవ్?
2021 లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్‌కు 365,650 ఓట్లు, బీజేపీకి చెందిన ఖుషాల్ సింగ్‌కు 356,664 ఓట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మకు 6,47,189 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రయ్ శర్మకు 2,41,730 ఓట్లు వచ్చాయి. 2014లో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్‌కు 362,824 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్‌కు 322,968 ఓట్లు వచ్చాయి.
కంగనా బాలీవుడ్ ఇమేజ్, ఆమె సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ నియోజకవర్గంలో మోదీ వేవ్‌ను కప్పివేస్తుందా? నటిగా వివాదాలను పక్కనబెట్టి ఆమె సొంతంగా రాజకీయాల్లోకి వస్తారా?
కంగనా సోషల్ మీడియాలో తన ట్రేడ్‌మార్క్ పదునైన వ్యాఖ్యలు చేసినందున, జూన్ 4న మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి.
Read More
Next Story