’ఆయన విజయానికి ఎటువంటి ప్రశంసలు సరిపోవు’: ప్రధాని మోదీ
x

’ఆయన విజయానికి ఎటువంటి ప్రశంసలు సరిపోవు’: ప్రధాని మోదీ

బీహార్ లో సుపరిపాలన తీసుకొచ్చిన ఘనత సీఎం నితీష్ కుమార్ దే అని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.


బిహార్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ నుంచి మార్చడంలో సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయన విజయానికి ప్రశంసలు ఎటువంటి ప్రశంసలు సరిపోవని కొనియాడారు.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు ₹12,100 కోట్ల విలువైన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
" జంగిల్ రాజ్ యుగం నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చేందుకు నితీష్ జీ సుపరిపాలన నమూనాను ఏర్పాటు చేశారు. ఈ విజయానికి ఎటువంటి ప్రశంసలు లేవు, సరిపోవు" అని ప్రధాని మోదీ అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో బీహార్ లో జరిగిన అభివృద్ధిని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. వివిధ రంగాలలో ముఖ్యంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలలో మెరుగుదలలను హైలైట్ చేశారు.
"బీహార్ చాలా అభివృద్ధిని చూస్తోంది. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బీహార్‌లో గత ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. వారు తప్పుడు వాగ్దానాలు చేశారు, కానీ నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడింది' అని మోదీ అన్నారు. బీహార్ వరదల సమస్యపై, రాష్ట్రంలో పునరావృతమయ్యే వరద సమస్యలను పరిష్కరించడానికి NDA ప్రభుత్వం ₹11,000 కోట్ల వరద-నివారణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందని ప్రధాన మంత్రి చెప్పారు.



Read More
Next Story