యూపీ బీజేపీలో ఎందుకీ లుకలుకలు.. ఎవరితో ఎవరికీ పడటం లేదు?
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అక్కడి కార్యకర్తలు చెప్పుకుంటున్న మాట..
సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ తక్కువ సీట్లకు పరిమితం కావడంపై పార్టీలో ఇంకా లుకలుకలు చల్లారినట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య సత్సంబంధాలు లేవని చాలా కాలంగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ దీనికి బలం చేకూర్చించింది.
"పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదు" బిజెపి కార్యకర్తలకు నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ట్వీట్ ఈ పదాలతో ప్రారంభమైంది: “ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది; కార్యకర్తల బాధ నా బాధ." యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి చేసిన ఈ ట్వీట్ మంగళవారం (జూలై 16) సాయంత్రం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో మౌర్య విడిగా సమావేశం జరిపిన ఒక గంట తరువాత ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినప్పటికీ, యూపీలోని బీజేపీ పార్టీ విభాగంలో నెలకొన్న అంతర్గత విభేదాలను కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీతో పార్టీకి, యూపీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా నడ్డాతో విడిగా భేటీ అయ్యారు. తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
రెండవసారి
ఒకప్పుడు సీఎం కుర్చీపై కన్నేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రభుత్వంపై పార్టీ అధిష్టానం వద్ద ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఇది రెండోసారి. జూలై 14న లక్నోలో నడ్డా అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి యోగి ఆదిత్యనాథ్, మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, దాదాపు 3,500 మంది ప్రతినిధులు హాజరైనప్పుడు, మౌర్య ప్రభుత్వం వర్సెస్ పార్టీ అంశాన్ని లేవనెత్తారు.
సమావేశాన్ని ఉద్దేశించి మౌర్య మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమూ సంస్థ కంటే పెద్దది కాదని అన్నారు. "నేను మొదట పార్టీ కార్యకర్త, తరువాత డిప్యూటీ సిఎం" అని ఆయన ప్రకటించారు, ప్రభుత్వం, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను గౌరవించాలని సమావేశంలోనే పట్టుబట్టారు.
మౌర్య అక్కడితో ఆగలేదు. సమావేశం తర్వాత, అతను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ఇదే అంశాన్ని పునరావృతం చేశాడు - 'S అంగథాన్ సే బడీ కోయి సర్కార్ నహీ హోతీ...హర్ ఏక్ కార్యకర్త హమారా గౌరవ్ హై. . (ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది...సంస్థ కంటే ఎవరూ అతీతులు కాదు. ప్రతి కార్యకర్త మనకు గర్వకారణం' అని రాశాడు.
కొందరు రాజకీయ పరిశీలకులు ఈ ప్రకటన బిజెపి రాష్ట్ర యూనిట్‌లోని అసమ్మతిని చల్లార్చడానికి ఉద్దేశించినట్లు భావించినప్పటికీ, మరికొందరు ఆదిత్యనాథ్- మౌర్యల మధ్య విభేదాలు ఉన్నాయని విశ్లేషించారు.
బీజేపీ రాష్ట్ర శాఖలో కలకలం
సార్వత్రిక ఎన్నికల పరాజయం తర్వాత యూపీ బీజేపీలో కలవరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మౌర్య ప్రభుత్వ సమావేశాలకు హాజరుకాకపోవడంతో పాటు రెండుసార్లు కేబినెట్ సమావేశాలకు కూడా హాజరుకాకపోవడంతో ఇద్దరు బీజేపీ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌర్య నిరసన తెలుపుతున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో మౌర్య సుదీర్ఘంగా బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్య మంత్రులతో భేటీ కావడం ఇరువురు నేతల మధ్య విభేదాలను మరింత పెంచిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆదిత్యనాథ్- మౌర్యల మధ్య విభేదాలు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కూడా వార్తలను ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి పనితీరే లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు తగ్గడానికి కారణమైందని కొంతమంది బీజేపీ నాయకులు ప్రైవేట్ గా అంగీకరించిన విషయాన్ని ఆ సంస్థ ఈ కథనంలో పేర్కొంది. బీజేపీ 'ప్రమాదకర' స్థితిలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మిశ్రా ఓ వీడియోలో చెప్పారు. కేంద్ర నాయకత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని మిశ్రా కోరారు.
సంస్థాగత మార్పులు
రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. యూపీ బీజేపీలో కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేయాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఓబీసీ నేతగా, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న మౌర్యకు పార్టీలో కీలక సంస్థాగత పదవి ఇవ్వవచ్చని నివేదికలు చెబుతున్నాయి. బీజేపీలో ఏర్పడిన చీలికలను ప్రతిపక్షాలు మాత్రమే ఉపయోగించుకుంటాయని బీజేపీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు పెద్ద దెబ్బ తగిలి, యుపిలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో 43 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే 2024 లో కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ క్యాట్ ఫైట్ గా విమర్శించింది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. పార్టీలో కొందరు అధికారం కోసం పోరాడుతూనే ఉన్నారని, యూపీలో పరిపాలన పట్టించుకోవడం లేదని యాదవ్ ఆరోపించారు.
అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నారని.. సొంత ఎమ్మెల్యేలే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారని.. ఓడిపోయిన అభ్యర్థులకు అండగా నిలబడాలని బీజేపీ భావిస్తోందని.. వారు బలహీనంగా మారారని.. కుర్చీ కోసం జరుగుతున్న పోరులో ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
Next Story