అమేఠీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఎవరంటే?
కొన్ని వారాల సస్పెన్స్ తరువాత కాంగ్రెస్ నుంచి అమేఠీలో బరిలోకి దిగే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, పంజాబ్ కు చెందిన శర్మను..
చాలా రోజుల సస్పెన్స్ తరువాత కాంగ్రెస్ పార్టీ అమేథీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం అక్కడి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడు, కిషోరీ లాల్ శర్మను తన అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. శర్మ ఈరోజే(శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అమేథీ నుంచి బీజేపీ తరుఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. 2019 లో ఇరానీ ఇక్కడ రాహూల్ గాంధీని ఓడించేవరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది.
రాహుల్ 2004 నుంచి 2019 వరకు అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. అతని తల్లి సోనియా గాంధీ 1999 నుంచి 2004 వరకు ఇక్కడి నుంచి పోటీ చేసేవారు. కానీ కుమారుడి కోసం ఈ సీటును వదిలిన సోనియాగాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలో నిలుస్తున్నారు. అంతకుముందు రాహూల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 వరకూ అమేఠీ నుంచే ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న శర్మ, గాంధీ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహితుడు
కాంగ్రెస్ విధేయుడు, శర్మ వాస్తవానికి పంజాబ్‌లోని లూథియానాకు చెందినవాడు. అతను 1983 నుంచి రాజీవ్‌కు సన్నిహితుడు, 1991లో అతని హత్య తర్వాత, అమేథీలో కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి పని చేస్తున్నాడు. 1999లో అమేథీ నుంచి సోనియా మొదటి ఎన్నికల్లో విజయం సాధించడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గంలో ఆమె ప్రతినిధిగా శర్మనే ఉన్నారు. 2004లో రాయ్‌బరేలీ సీటును సోనియా గెలుపొందగా,
రాహుల్ తొలిసారిగా అమేథీలో విజయం సాధించినప్పుడు, శర్మ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నిర్వహించాడు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం వహించడంలో ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని కొనసాగించడంలో శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు .
అలాగే కొంతకాలం పంజాబ్, బీహార్‌లలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేశారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయన ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే సీపీఐ నుంచి గట్టి పోటీ ఉండడంతో ఆయన రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగుతారని రాజకీయ విశ్లేషకులతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం అన్నారు. ఆ మాటను నిజం అయ్యేలా కనిపిస్తోంది. మే 20న రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది
Next Story