మూగబోయిన పేదల గొంతుక.. అతుల్ కుమార్ అంజన్ మృత్తి
x

మూగబోయిన పేదల గొంతుక.. అతుల్ కుమార్ అంజన్ మృత్తి

సీపీఐ అగ్రనేత అతుల్ కుమార్ అంజన్ కన్ను మూశారు. 69 ఏళ్ల వయసులో ఆయన లక్నోలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. దేశవ్యాప్తంగా అనేక మంది ఆయన మృతికి నివాళులు అర్పించారు.


గత 12 ఏళ్లలో 2.14 లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాలే కారణమని కుండబద్ధలు కొట్టి చెప్పే కంఠం మూగబోయింది. సీపీఐ అగ్రనేత, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ కన్నుమూశారు. వ్యవసాయ కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ల కడుపు నింపడంలో అటు యూపీఏ అయినా ఇటు ఎన్డీఏ అయినా ఒకటేనని తెగేసే చెప్ప అతుల్ కుమార్ అంజన్ ఉత్తరప్రదేశ్ వాసి. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడే అతుల్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. పేదల పక్షాన అటు పార్లమెంటులో ఇటు క్షేత్రస్థాయిలో నిరంతరం గళం విప్పిన సీపీఐ అగ్ర నాయకుడు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఉండాల్సిందేనని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని మరణశయ్యపై ఉండి కూడా నినదించిన అతుల్ కుమార్ అంజన్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో మే 3వ తేదీ ఉదయం మరణించారు. 1953లో లక్నోలో జన్మించిన అతుల్ కుమార్ లక్నో స్టేట్ బోర్డ్ స్కూల్‌ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. 1967, 1972, 1976, 1983లో వరుసగా లక్నో విశ్వవిద్యాలయంలోనే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్‌ఎల్‌బి కూడా చేశాడు. 1978 నాటికి అంజన్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్- ఏఐఎస్ఎఫ్- ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీకి పెట్టని కోటగా భావించే ఘోసీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అనేక సార్లు పోటీ పడినా ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగారు. 2014 సాధారణ ఎన్నికలలో ఘోసి నుంచి గెలిచారు. ఆయన తండ్రి డాక్టర్ ఏపీ సింగ్. హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధుడు. బ్రిటిష్ పాలనలో సుదీర్ఘ జైలు శిక్షను అనుభవించారు. సమరయోధుల కుటుంబం నుంచి రావడం వల్ల అతుల్ కుమార్ అంజన్ కూడా చిన్నప్పటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి చూపేవారు. 20 ఏళ్ల వయసులోనే అతుల్ కుమార్ అంజాన్ నేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ పోలీసు-పిఎసి తిరుగుబాటులో అంజాన్ కీలక వ్యక్తి. తన రాజకీయ ప్రయాణంలో నాలుగేళ్ల తొమ్మిది నెలలు జైలు జీవితం కూడా ఉంది. ఆయన మరణం పట్ల దేశప్రముఖులనేక మంది సంతాపం వ్యక్తం చేస్తూ “ అతుల్ కుమార్ అంజన్ మరణంతో దిభ్రాంతి చెందామంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ధైర్యవంతుడు. అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడు అంటూ పలువురు నివాళులు అర్పించారు.

Read More
Next Story