![దేశంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ దేశంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ](https://telangana.thefederal.com/h-upload/2025/02/08/511327-jpeg.webp)
దేశంలో రెండో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ
వరుసగా నాలుగో నెలలోనూ మారని దేశ రాజధాని స్థానం
దేశ రాజధాని వరుసగా నాలుగోసారి దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఓ స్వత్రంత్య సంస్థ చేసిన పరిశోధన ప్రకారం జనవరిలో కూడా ఢిల్లీ కలుషిత నగరంగా తన గత రికార్డును కొనసాగించినట్లు తెలియజేసింది.
ఇంతకుముందు ఇదే సంస్థ మూడు నెలలుగా చేస్తున్న పరిశోధన ప్రకారం కూడా ఢిల్లీ రెండో స్థానంలోనే ఉంది. జనవరి 2025 లో ఢిల్లీలో క్యూబిక్ మీటర్ కు సగటున 165 మైక్రోగ్రాములు, పీఎం 2.5 సాంద్రత నమోదైందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తెలిపింది.
కానీ గత నెలలతో పోలిస్తే గాలి నాణ్యత కాస్త మెరుగుపడిందని వెల్లడించింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 23.3 గా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం.. 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) సాయంత్రం నాలుగు గంటలకు 156 గా నమోదైంది.
ఈ సీజన్ లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రిల సెల్సియస్ గా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట తేమ 33-36 శాతం మధ్య ఉందని ఐఎండీ తెలిపింది. శనివారం ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ప్రధానంగా వాయువ్య దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తాయని, ఉదయం వేళల్లో గంటలకు 10 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని అంచనా. ఉదయం పూట పొగమంచు కురుస్తుందని మధ్యాహ్నం నాటికి వాయువ్య దిశ నుంచి గాలి వేగం క్రమంగా గంటలకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలిపింది.
సీఆర్ఈఏ నివేదిక ప్రకారం.. జనవరి లో 240 నగరాల్లో 105 నగరాలు పీఏం 2.5 నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్ట్స్ పరిమితి క్యూబిక్ మీటర్ కు 60 గ్రాములకు మించిపోయాయి.
Next Story