కుండపోత వర్షంతో అతలాకుతలమైన ఢిల్లీ
x
ఢిల్లీలో భారీ వర్షానికి నీట మునిగిన వాహనాలు

కుండపోత వర్షంతో అతలాకుతలమైన ఢిల్లీ

రద్దు అయిన విమాన సర్వీసులు, భారీ వర్షంతో 18 ఏళ్ల నాటి రికార్డు బద్దలు


కుండపోతగా కురిసిన వర్షం వల్ల ఢిల్లీ మొత్తం అతలాకుతలం అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వల్ల విమాన సేవలకు సైతం తీవ్ర అంతరాయం కలిగింది. 17 అంతర్జాతీయ సర్వీసులు సహ మొత్తం 49 విమానాలు దారి మళ్లించారు. వీధులలో మోకాళ్ల లోతు వరకూ నీళ్లు నిలిచిపోయాయి. అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.

శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 5.30 నిమిషాల వరకూ ఏకధాటిగా కురిసింది. ఆరుగంటల్లో 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, 81.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
విమాన సర్వీసులకు అంతరాయం..
శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల మధ్య వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన కార్యకలాపాలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని ఇండిగో సంస్థ ఉదయం 4 గంటలకు ఎక్స్ లో పోస్ట్ చేసింది.
‘‘వాతావరణం క్రమంగా మారుతున్నప్పటికీ ఎయిర్ సైడ్ లో రద్దీ కొనసాగుతోంది. పరిస్థితులు అనుకూలించినందున విమానాల కదలికలు క్రమంగా తిరిగి ప్రారంభవుతున్నాయని మేము హమీ ఇస్తున్నాము’’ అని ఎయిర్ లైన్ తెలిపింది.
ఉదయం ఆరుగంటల సమయంలో చేసిన ఓ పోస్ట్ లో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఢిల్లీలో స్పష్టమైన ఆకాశం ఉందని పేర్కొంది. విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ ‘‘ఫ్లైట్ రాడార్ 24.’’ ప్రకారం.. విమానాశ్రయంలో దాదాపు 180 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని కొన్ని రద్దు అయ్యాయని తెలుస్తోంది.
2008 మే లో 165 మిల్లీమీటర్లే ఇప్పటికి అత్యధిక వర్షపాతం, ఇప్పుడు 186.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసి పాత రికార్డును చెరిపేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ ను గంటకు 60-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.

మోతీబాగ్, మింటోడ్ రోడ్, ఢిల్లీ కంటోన్మెంట్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లు వరదల్లో చిక్కుకున్నాయని నివేదికలు తెలిపాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడిపోయింది.
రెడ్ అలర్ట్..
శనివారం రాత్రి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులు, వడగళ్లు గంటకు 60-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.
ప్రజా సలహ..
అవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలని విద్యుత్ ఉపకరణాలను ఆపివేయాలని చెట్లకింద ఉండకూడదని, మొబైల్ ఫోన్లను ఆరుబయట ఉపయోగించకూడదని, అత్యవసర మెడికిల్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలని సలహ జారీ చేసింది.
కేరళ ను తాకిన రుతుపవనాలు..
సాధారణ తేదీ కంటే ఒక వారం ముందుగానే రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తరువాత తొలిసారిగా దేశంలోని ప్రధాన భూభాగానికి అనుకున్న తేదీ కంటే ముందే రుతుపవనాలు చేరాయి.
ఇదే సందర్భంలో ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రారంభమై జూలై 8 నాటికి దేవం మొత్తం వ్యాపిస్తాయి. సెప్టెంబర్ 1 నాటికి వాయువ్య భారత నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటాయి.
నాలుగు ఇంజిన్ల సర్కార్ విఫలం: ఆప్
ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై ఆప్, బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించింది. దీనిని నాలుగు ఇంజిన్ల ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించింది. ఢిల్లీ కంటోన్మెంట్, ఐటీఓ వంటి నగరంలోని మునిగిపోయిన ప్రాంతాల చిత్రాలను పంచుకుంది.
‘‘ఢిల్లీలో నీటి నిల్వ లేని ప్రదేశం ఒక్కటి కూడా లేదు. ఇది బీజేపీ నాలుగు ఇంజిన్ల ప్రభుత్వ వైఫల్య కథను చెబుతోంది’’ దఅని హిందీలో పోస్ట్ చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషీ ఎక్స్ లో ఒక బ్రిడ్జీ వీడియోను పంచుకున్నారు.
‘‘కొద్దిపాటి వర్షం తరువాత మింటో బ్రిడ్జి కింద కారు మునిగిపోయింది. నాలుగు ఇంజిన్ల ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని హిందీలో ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ప్రతిపక్ష ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. మూడు నెలల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆప్ కు ఘోర పరాజయం మిగిల్చింది.

Read More
Next Story