ఈ ఐపీఎస్ అధికారి... మొన్నటి బాలివుడ్ బ్యూటీ
x
Simala Prasad, IPS

ఈ ఐపీఎస్ అధికారి... మొన్నటి బాలివుడ్ బ్యూటీ

బాలీవుడ్.. ఓ రంగుల ప్రపంచం, అందులోకి వెళ్లిన వారు అంత త్వరగా బయట ప్రపంచంలోకి రాలేరు.. అందులో సక్సెస్ అయ్యాక ఇక వేరే రంగం వైపు చూడరు..


యూపీఎస్సీ లో విజేత గా నిలవాలి అనేది నేటీ యువత కల. ఎన్నోసార్లు పరీక్షలు రాస్తే గానీ ఎంపిక కాలేరు. దానికోసం ఎంత కష్టపడాలి. ఎన్నిత్యాగాలు చేయాలి. ఎంత కమిట్ మెంట్ కావాలి ఒకసారి అందులోకి వెళ్లాక వేరే ప్రపంచం అంటూ ఏమి ఉండదు. విజేతలయ్యాక కానీ బయటకు రాలేరు.

కొన్నిసార్లు ఓడిపోతేనే వేరే రంగంలోకి వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ అక్కడ కూడా విజేతలయి, మరోరంగంలోకి వచ్చి అక్కడ కూడా విజేతలుగా నిలిచే వారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కోవకే చెందింది సిమలా ప్రసాద్.. బాలీవుడ్ యాక్టర్.. కమ్ ఐపీఎస్ అధికారి. అసాధ్యం అనుకున్న రెండు విజయాలను సాధించింది ఈ డైనమిక్ ఆఫీసర్




సిమల ప్రసాద్ అక్టోబర్ 8,1980న మధ్యప్రదేశ్లో రాజధాని,భోపాల్ లో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. చదువుకునే రోజుల్లోనే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. కాలేజ్ డేస్ లోనే అనేక నాటకాల్లో పని చేసిన అనుభవం సొంతం చేసుకుంది. ఆ అనుభవంతోనే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి ఇంట్లో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఇక ఆమె వెంటనే ముంబై బయల్దేరి వెళ్లింది. తండ్రి డాక్టర్ భగీరథ్ ప్రసాద్ 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రెండు యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్ గా పని చేశారు. అలాగే భింద్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. తల్లి మెహరున్నీసా పర్వేజ్ ప్రసిద్ధ రచయిత.

సిమల ప్రసాద్ స్టూడెంట్ ఫర్ ఎక్సలెన్సీ నుంచి బీకామ్ పూర్తి చేసింది. తరువాత భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, బంగారుపతకాన్ని అందుకుంది. తరువాత మధ్యప్రదేశ్ సర్వీస్ కమిషన్ పరీక్షకు అర్హత సాధించింది. ఆతరువాత బాలీవుడ్ లోకి వెళ్లింది.

అక్కడ నిలదొక్కుకుని తిరిగి యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది. అక్కడ మొదటి ప్రయత్నంలోనే సిమల ప్రసాద్ ఐపీఎస్ సాధించారు. అలా 2010లో విజయతీరాలకు చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి గా పనిచేయడం సవాల్ తో కూడుకున్నది అయినప్పటికీ ఇష్టమైన వాటిని సాధించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అంటున్నారు సిమల.. ఓ వైపు ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటూనే.. మరోవైపు నేరస్థులతో కఠినంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బెతూల్ జిల్లా ఎస్పీ గా పనిచేస్తున్నారు. బెతూల్... ప్రాణహితనదీ పుట్టిన ప్రదేశం..

Read More
Next Story