ఆర్ఎస్ఎస్- బీజేపీని ప్రశంసించిన దిగ్విజయ్ సింగ్
x
దిగ్విజయ్ సింగ్

ఆర్ఎస్ఎస్- బీజేపీని ప్రశంసించిన దిగ్విజయ్ సింగ్

మోదీ పాత ఫొటోను షేర్ చేసిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి


కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించారు. 1960 లో తీసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో అంటూ షేర్ చేసి తాజా వివాదానికి ఆజ్యం పోశారు.

బీజేపీలో అట్టడుగు కార్యకర్తలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడని కొనియాడారు. 60 లలో గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, యువ ప్రధాని మోదీ అద్వానీ దగ్గర నేలపై కూర్చుకున్నట్లు చూపించే స్క్రీన్ షాట్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు.

సంస్థ శక్తి..
కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యండిల్స్, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఆయన ట్యాగ్ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో నేలపై కూర్చున్న అట్టడుగు స్థాయి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థాగత చట్రంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎలా కాగలరో ప్రశంసించారు. ఈ ఫొటో ఆర్ఎస్ఎస్- బీజేపీ శక్తిని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
‘‘నేను ఈ చిత్రాన్ని క్వారాలో చూశాను. ఇది చాలా అద్బుతంగా ఉంది. ఆర్ఎస్ఎస్ అట్టడుగు స్థాయి స్వయం సేవకులు, జన్ సంఘ్ కార్యకర్తలు నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రి అయిన విధంగా ఇది సంస్థ శక్తి, జై సియారామ్’’ అని దిగ్విజయ్ సింగ్ ఎక్స్ లో అన్నారు.
1990 నాటి చిత్రం..
దిగ్విజయ్ సింగ్ షేర్ చేసి ఫొటోపై జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది. ఈ ఫొటో 1990 ల నాటిదని తెలిపింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాజకీయాల్లో తొలినాళ్లలోనిదని తెలిపింది.
1996 లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా ఈ చిత్రం తీయబడిందని తెలుస్తోంది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆ కార్యక్రమానికి హజరయ్యారు.
రాహుల్ స్పందించాలి: బీజేపీ
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ స్పందించింది. దిగ్విజయ్ సింగ్ వేసిన సత్యబాంబ్ కు రాహుల్ గాంధీ ధైర్యం చూపించి స్పందిస్తారా అని బీజేపీ ప్రశ్నించింది.
దిగ్విజయ్ సింగ్ పోస్ట్ కాంగ్రెస్ మొదటి కుటుంబం పార్టీని ఎలా నియంతృత్వ పద్దతిలో నడుపుతుందో బయటపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ అన్నారు.
‘‘కాంగ్రెస్ మొదటి కుటుంబం పార్టీని ఎలా నిర్దాక్షిణ్యంగా నియంతృత్వంగా నడుపుతుందో ఈ కాంగ్రెస్ నాయకత్వం ఎంత నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ఉందో పూర్తిగా బయటపెట్టిన శ్రీ దిగ్విజయ్ సింగ్ వేసిన షాకింగ్ ట్రూత్ బాంబ్ ట్వీట్ పై రాహుల్ గాంధీ ధైర్యం చూపిస్తారా, స్పందిస్తారా?’’ అని కేశవన్ అన్నారు.
నేపథ్యం..
దిగ్విజయ్ సింగ్ రెండో రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియబోతోంది. మూడో సారి ఆయనకు పదవీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమల్ నాథ్, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీట్ కోసం పోటీపడుతున్నారు.
వీరితో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, శాసనసభా పార్టీ నాయకుడు ఉమాంగ్ సింగర్ కూడా రాష్ట్ర యూనిట్ లో సింగ్ కు వ్యతిరేక నాయకులుగా పరిగణించబడుతున్నారు.
Read More
Next Story