ఖంగారు పడకండి: ఓట్లు, సీట్లు పెరిగాయంటున్న ఆ రాష్ట్ర సీఎం
x

ఖంగారు పడకండి: ఓట్లు, సీట్లు పెరిగాయంటున్న ఆ రాష్ట్ర సీఎం

రాష్ట్రంలో ఓటమికి ఆందోళనకు పడవద్దని, గతంలో కంటే ఓట్లు, సీట్లు పెరిగాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.


ఓటమికి కుంగిపొవద్దని, గతంలో కంటే ఎక్కువ శాతం ఓట్లని గెలుచుకున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, 2019 లో కేవలం ఒకే ఒక సీటు ఉండగా, ప్రస్తుతం మూడు సీట్లు గెలుచుకున్నామని సీఎం అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో, పంజాబ్‌లో ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లను అంటే ఏడు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు భారీగా దెబ్బతిన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. వాటిలో ఆనంద్‌పూర్ సాహిబ్, హోషియార్‌పూర్, సంగ్రూర్ స్థానాలు ఉన్నాయి.
ఓటు షేర్..
ఆప్ పనితీరుపై అడిగిన ప్రశ్నకు భగవంత్ మాన్ మన్ సమాధానమిస్తూ, 2019లో పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుందని, దాని ఓట్ల శాతం కేవలం 7.50 శాతం మాత్రమేనని చెప్పారు. 'ఈసారి మూడు సీట్లు గెలిచాం. మా బలమైన కోట అయిన సంగ్రూర్ సీటును మేము చేజిక్కించుకున్నాము” అని గురు అర్జున్ దేవ్ బలిదానం రోజున గురుద్వారాలో ప్రార్థనలు చేసిన తర్వాత మన్ మొహాలీలో విలేకరులతో అన్నారు.
2022 ఉప ఎన్నికలో, శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రంజిత్ సింగ్ మాన్ సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి 5,800 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఆప్‌కి చెందిన గుర్‌మైల్ సింగ్‌ను ఓడించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఓట్ల శాతం కూడా 26 శాతానికి పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్‌కు 35.50 లక్షల ఓట్లు రాగా, ఆప్‌కు 35.20 లక్షల ఓట్లు వచ్చాయని మన్‌ చెప్పారు.
' పట్టుకోల్పోతున్న ప్రత్యర్థులు '
ప్రత్యర్థి పార్టీల పనితీరుపై ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 2019లో 40 శాతం నుంచి ఈసారి 26 శాతానికి తగ్గిందని, బీజేపీ తమకు ఉన్న హోషియాపూర్ స్థానాన్ని కూడా కోల్పోయిందని అన్నారు. శిరోమణి అకాలీదళ్ (SAD)కి చెందిన పలువురు అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారని కూడా మన్ చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తున్నామని, లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరి చేస్తామని ఆప్ సీఎం చెప్పారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆప్ ఐదుగురు మంత్రులతో సహా ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపింది, అయితే, వారిలో ఒకరు గుర్మీత్ సింగ్ మీట్ హయర్ మాత్రమే విజయం సాధించగా, మిగిలిన అందరూ ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ కేవలం సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
పంజాబ్ సమస్యలు
రాష్ట్రం నుంచి మోదీ క్యాబినెట్ లో మంత్రిగా పని చేరిన బిట్టు, పంజాబ్ సమస్యలను ప్రస్తావించాలని, ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు ఊతమివ్వడం అత్యవసరమని ఆయన అన్నారు.లూథియానాలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చేతిలో బిట్టు ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది.
ఉప ఎన్నికకు సిద్ధమైంది
AAP ఎమ్మెల్యే పదవికి శీతల్ అంగురాల్ రాజీనామా చేయడంతో అవసరమైన జలంధర్ (పశ్చిమ) అసెంబ్లీ సెగ్మెంట్‌లో జూలై 10న జరగనున్న ఉప ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా మన్ తెలిపారు.
రాష్ట్రంలో వచ్చే వరి సీజన్‌కు తమ ప్రభుత్వం సిద్ధమైందని, రాష్ట్ర ప్రభుత్వం అనేక "ప్రజల అనుకూల" మరియు పౌర-కేంద్రీకృత కార్యక్రమాలను చేపట్టిందని సిఎం చెప్పారు.
Read More
Next Story