జార్ఖండ్ కు రావాల్సిన రూ. లక్ష కోట్ల రాయల్టీ సంగతేంటీ? కాంగ్రెస్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి లక్షకోట్ల బొగ్గు గనుల రాయల్టీని చెల్లించాలని, దానిపై వివరణ ఇచ్చాకే ఎన్నికల్లో ఓట్లు అడగాలని...
తమ నుంచి అధికారం తీసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విఫలయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. జార్ఖండ్ లో బీజేపీ ఓట్లు అడగడానికంటే ముందు రాష్ట్రానికి రావాల్సిన బొగ్గు గనుల రాయల్టీ అయిన రూ. 1.36 లక్షల కోట్లు విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
జార్ఖండ్‌కు బొగ్గు రాయల్టీలు, కేంద్ర పథకాల ప్రయోజనాలలో కేంద్రం లక్షల కోట్ల రూపాయలను బకాయిపడిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. జార్ఖండ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థలు బొగ్గు గనులను నిర్వహిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. " భూపరిహారం చెల్లించనందుకు" ₹1,01,142 కోట్లు, "కామన్ కాజ్ బకాయిలు" కింద ₹ 32,000 కోట్లు, " బొగ్గు రాయల్టీ" కింద ₹ 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.
జార్ఖండ్ పై బీజేపీ ‘సవతి తల్లి ప్రేమ’
రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో బీజేపీ ఎందుకు విఫలమైందని, ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని జార్ఖండ్ బీజేపీ నాయకులను జైరాం రమేష్ ప్రశ్నించారు. "ఈ నిధులను విడుదల చేయడంలో ప్రధానమంత్రి ఎందుకు విఫలమయ్యారు? JMM-INC కూటమికి ప్రజలు ఓటు వేసినందుకు జార్ఖండ్‌కు సవతి తల్లిగా వ్యవహరిస్తోందా? రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎందుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేకపోయింది?" అని రమేష్ ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించారు.
జార్ఖండ్ ప్రజల నుంచి ఒక్క ఓటు అడిగే ముందు, రాష్ట్రానికి 1.36 లక్షల కోట్లు విడుదల చేయడంలో జరిగిన ఈ జాప్యానికి బిజెపి సమాధానం ఇవ్వాలి, ”అని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Next Story