
ఎన్నికల సంస్కరణపై లోక్ సభ లో ప్రత్యేక చర్చ
‘‘బ్యాలెట్ తో ఎన్నికలు, సర్ ను ఆపేయాలి’’
ఎన్నికల సంస్కరణపై ప్రత్యేక చర్చలో కాంగ్రెస్
లోక్ సభలో ఎన్నికల సంస్కరణల అంశం కింద ‘ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్ లేదా ఎస్ఐఆర్)’ పై చర్చపై కాంగ్రెస్ మంగళవారం తన అభిప్రాయాలను వివరించింది.
పార్టీ ఎంపీ మనీశ్ తివారీ ఈ డ్రైవ్ ను చట్టవిరుద్దం అని అభివర్ణించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ‘సర్’ ను అనుమతించారని, అయితే ఎన్నికల సంఘం మాత్రం ఏదైన ఒక నియోజకవర్గానికి మాత్రం ఎస్ఐఆర్ ను నిర్వహించాలని కానీ దేశంలోని అన్ని నియోజవర్గాలకు ‘సర్’ ను నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సర్ కు ఈసీ కారణాన్ని పేర్కొనాలి
ఒక నిర్దిష్ట నియోజకవర్గంలో ‘సర్’ నిర్వహించే విషయంలో కూడా ఈసీ కూడా కారణాన్ని పేర్కొనాల్సి ఉంటుందని తివారీ అన్నారు. ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం లేదా రాజ్యాంగంలోని సర్ కు ఎటువంటి నిబంధన తీసుకురాలేదు.
నిర్దిష్ట నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ప్రత్యేక సవరణ నిబంధన తీసుకొచ్చారు. కారణాలను లిఖిత పూర్వక కారణాలను పేర్కొనాలి’’ అని తివారీ అన్నారు.
‘‘సర్ ను నిర్వహించడానికి నియోజకవర్గాల వారీగా లిఖితపూర్వకంగా కారణాలు ఎక్కడ ఉన్నాయో నేను ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను? బీహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్ అంతటా సర్ ను నిర్వహించడానికి నియోజకవర్గాల వారీగా కారణాలను బహిర్గతం చేయాలని ఈసీ వివరించాలి. చట్టంలోని అంశాన్ని కోర్టు కూడా పరిశీలించకపోవడం దురదృష్టకరం’’ అని తివారీ అన్నారు.
బ్యాలెట్ పేపర్ కావాలి
ఎన్నికల ప్రక్రియపై మరోసారి అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్, తిరిగి విశ్వాసాన్ని పునరుద్దరించడానికి రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ఒకటి వందశాతం వీవీప్యాట్ లను లెక్కించాలని, లేదా బ్యాలెట్ పేపర్లను తిరిగి రావాలని అన్నారు.
‘‘ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను పరీక్షించడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఫలితం ఏమిటో చూడండి, దానిని మనం అందరం అంగీకరించాల్సి ఉంటుంది’’ అన్నారు.
‘‘సర్ కూడా ఇంతకుముందే జరిగిందని మీరు అనవచ్చు. నా సమాధానం సూటిగా ఉంటుంది. అనేక తప్పులు సరైనవి కావు. మునుపటి ప్రభుత్వం చట్టవిరుద్దంగా ఏదైనా చేసింది కాబట్టి మనం ఈ ఉదాహారణను అనుసరించాలని కాదు’’ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన అఖిలేష్
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో ఏకీభవిస్తూ ఎన్నికల కమిషనర్ల నియమక విధాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విధానాన్ని తను సమర్థిస్తున్నట్లు చెప్పారు.
‘‘ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలనే కాంగ్రెస్ వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. టెక్నాలజీలో మనకంటే చాలా ముందున్న అభివృద్ది చెందిన దేశాలు ఈవీఎం లను అంగీకరించడం లేదు.
అది జర్మనీ అయినా, యూఎస్ అయినా వద్దు అంటున్నాయి. మనం మాత్రం ఈవీఎంలను వాడుతున్నాము. మనం బ్యాలెట్లకు ఎందుకు తిరిగి రావడం లేదు?’’ అని యాదవ్ అన్నారు.
Next Story

