ఐదు దశాబ్దాల తరువాత రెండు రోజుల రథయాత్ర..
పూరి జగన్నాథ యాత్రకు అంతా సిద్ధమైంది. దాదాపు 15 లక్షల మంది భక్తులు హజరవుతారని భావిస్తున్న ఈ వేడుక కు ఒడిశా ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు కావించింది.
పూరి జగన్నాథయాత్రలో ఐదు దశాబ్ధాల తరువాత అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. జూలై 7 వ తేదీ నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల దేవీలను గుండీచా ఆలయానికి తీసుకెళ్తారు.
ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథ రథయాత్ర కేవలం ఒకే రోజు మాత్రమే నిర్వహించే వారు. కానీ 53 సంవత్సరాల తరువాత రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నారు. చివరిసారిగా 1971లో రెండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో మొదట నబజౌబన్ దర్శనం, నేత్ర ఉత్సవ్ వంటివి రథయాత్రకు ముందు నిర్వహిస్తారు.
హజరుకానున్న రాష్ట్రపతి
రథోత్సవాన్ని తిలకించడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా సీఎం పాల్గొన బోతున్నారు. ముర్ము పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖుల కోసం వీఐపీ జోన్‌ను ఏర్పాటు చేయగా, రాష్ట్రపతి కోసం బఫర్ జోన్‌ను ప్లాన్ చేశారు. యాత్రికుల పట్టణానికి ముర్ము సందర్శనను పర్యవేక్షించేందుకు సీనియర్ ఎస్పీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15 లక్షల మంది భక్తులు హజరవుతారని అంచనా ఉంది.
సిద్ధంగా ఉన్న రథాలు
జగన్నాథ దేవాలయం సింహద్వారం ముందు రథాలు నిలిపి ఉంచారు, అక్కడి నుంచి గుండిచా ఆలయానికి తీసుకువెళ్లనున్నారు, అక్కడ దేవతలు వారం రోజుల పాట 'సెలవు'లో గడపనున్నారు. శనివారం కార్పెంటర్లు, కళాకారులు మూడు రథాలకు తుది మెరుగులు దిద్దారు. రథాలను భక్తులు ఇప్పటికే రత్ కాల నుంచి సింగద్వారా వరకు లాగారు. ఆదివారం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవీ రథాలపై అధిరోహించిన తరువాత మధ్యాహ్నం భక్తులు లాగనున్నారు.
అరుదైన వేడుక
ఈ సంవత్సరం, రథయాత్ర, 'నబజౌబన్ దర్శనం', 'నేత్ర ఉత్సవ్' వంటి సంబంధిత ఆచారాలు ఒకే రోజులో నిర్వహించనున్నారు. ఈ ఆచారాలు సాధారణంగా రథయాత్రకు ముందు జరుగుతాయి. నబజౌబన్ దర్శన్ అంటే స్నాన పూర్ణిమ రోజు జగన్నాథుడికి విశేషంగా స్నానం చేయిస్తారు.
అందువల్ల జగన్నాథుడికి జలుబు జ్వరం వస్తుంది. అందువల్ల 15 రోజుల పాటు స్వామి వారి దర్శనం ఉండదు.'నబజౌబన్ దర్శనం'కు ముందు, పూజారులు 'నేత్ర ఉత్సవ్' అనే ప్రత్యేక పూజను నిర్వహించారు. ఇందులో దేవతల కనుబొమ్మలను కొత్తగా చిత్రించారు.
భద్రతను కట్టుదిట్టం చేశారు
ఇదిలా ఉండగా వార్షిక పండుగను సజావుగా, సకాలంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. “స్టేక్‌హోల్డర్లందరి సహకారంతో, అన్ని కర్మలు సజావుగా జరుగుతున్నాయి. భగవాన్ జగన్నాథుని ఆశీస్సులతో, అన్ని ఇతర కర్మలు కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి, ”అని పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు.
పండుగ సందర్భంగా శాంతిభద్రతలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ను చూసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన 180 ప్లాటూన్‌ల (ఒక ప్లాటూన్‌లో 30 మంది సిబ్బంది) భద్రతా సిబ్బందిని నియమించినట్లు పూరి ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. క్యూలైన్ లో ఎవరైన అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రీన్ కారిడార్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
AI ఉపయోగం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిసిటివి కెమెరాలను ఉత్సవాల వేదిక, యాత్రికుల పట్టణంలోని ఇతర వ్యూహాత్మక ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు ఎడిజి (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ తెలిపారు. 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
రథయాత్ర కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో, సముద్ర తీరం వెంబడి మొత్తం 46 ఆధునిక ఫైర్ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అగ్నిమాపక శాఖ డీజీ సుధాంశు సారంగి తెలిపారు. వేడి- తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున, భక్తులపై నీరు చల్లుతామని ఆయన చెప్పారు.
Next Story