
బరేలీలోని దిశా పటానీ నివాసం
దిశా పటాని ఇంటిపై కాల్పులు: ఇద్దరు గ్యాంగ్ స్టర్ల ఎన్ కౌంటర్
ఇద్దరు రోహిత్ గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని పోలీసుల ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దిశాపటాని ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు గ్యాంగ్ స్టర్ లను యూపీ పోలీసులు కాల్చి చంపారు. వీరు రోహిత్ గోదారా- గోల్డీ బ్రార్ గ్యాంగ్ లోని ఇద్దరు క్రియాశీలక సభ్యులని తేలింది. ఘజియాబాద్ లోని ట్రోనికా సిటీ సమీపంలో బుధవారం ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ సంయుక్తంగా నిర్వహించించిన ఆపరేషన్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.
మృతులను రోహ్ తక్ వాసి రవీందర్, సోనిపట్ కు చెందిన అరుణ్ గా గుర్తించారు. వీరు ఇద్దరు హర్యానాకు చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.
వారిలో ఇద్దరు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్, హెడ్ కానిస్టేబుల్ కైలాష్, మరో ఇద్దరు యూపీ ఎస్టీఎఫ్ అధికారులు అంకుర్, జై ఉన్నారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘజియాబాద్ లో ఎన్ కౌంటర్..
ఘాజియాబాద్ లోని ట్రోనికా సిటీలో ఎస్టీఎఫ్ నోయిడా యూనిట్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం ఆ ఇద్దరిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తరువాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. వీరు గ్యాంగ్ స్టర్ కార్యకలాపాలలో చురుకుగా పనిచేసేవారని, రవీందర్ కు నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
గతంలో అనేక కేసులు ఇతనిపై నమోదు అయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఒక గ్లోక్, జిగానా పిస్టల్ తో పాటు పెద్ద సంఖ్యలో ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
బరేలీ సీనియర్ సూపరిడెంటెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య మాట్లాడుతూ.. పటాని ఇంటి వెలుపల భద్రత యథాతథంగా ఉంటుందని అన్నారు. కథానాయిక తండ్రి జగదీష్ పటానీ బరేలీలో విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇంటి వెలుపల కాల్పులు జరిపిన వారు కాల్పుల్లో మరణించారని పోలీసులు తనకు తెలియజేశారని అన్నారు. అంతకుమించిన వివరాలు తనకు తెలియని అన్నారు.
బరేలీ కాల్పుల కేసు..
బరేలీ కాల్పుల కేసులో వీరిద్దరికి ప్రత్యక్ష పాత్ర ఉంది. ఇది రాష్ట్రంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ సంఘటన దోపిడికి సంబంధించిన బెదిరింపు వ్యూహాంగా అనుమానిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారి ఒకరు తెలిపారు.
పరారీలో ఉన్న ఇతర ముఠా సభ్యులను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 12న తెల్లవారుజామున 3.45 ప్రాంతంలో బరేలీలోని పటానీ నివాసం వెలుపగ గుర్తు తెలియని దుండగులు అనేక రౌండ్ల కాల్పులు జరిపారు. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఆ సమయంలో దిశా పటాని తండ్రి, రిటైర్డ్ డీఎస్పీ జగదీష్ సింగ్ పటానీ, ఆమె తల్లి, అక్క ఖుష్భు పటానీ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలంలానికి చేరుకుని ఇంటి బయట ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నాయి.
పోలీసుల గుర్తింపు..
గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ సోషల్ మీడియాలో ఈ సంఘటనకు బాధ్యత వహించాడని పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న గోల్డీ బ్రార్ స్క్రీన్ షాట్ ప్రకారం.. దిశా, ఆమె సోదరి ఇద్దరు వేరే మతాలకు చెందినవారిపై దుర్భాషలు ఆడారని ఆరోపించారు.
సెయింట్ ప్రేమానంద్ మహారాజ్, అనిరుద్ధా చార్య గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనకు కాల్పులు జరిపినట్లు బ్రార్ పేర్కొన్నాడు. దీనిపై బరేలీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ఈ విషయంలో తక్షణ చర్య తీసుకోవాలని ఆదేశించారు. నేరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని చెప్పారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, నిఘా సమాచారాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాల రికార్డులతో సరిపోల్చామని దీని ఫలితంగా కాల్పులు జరిపిన వారిగా రవీందర్, అరుణ్ గా గుర్తించామని యూపీ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యష్ తెలిపారు.
Next Story