‘మానస సరోవర్’ కి తొలి దర్శన్ ప్లైట్
x
మానస సరోవర్

‘మానస సరోవర్’ కి తొలి దర్శన్ ప్లైట్

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మానస సరోవర్ యాత్రకు విమాన ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి. కేవలం గంటన్నరలోనే అక్కడికి ప్రయాణించవచ్చు.


హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస్ మానస సరోవర్ కు తొలిసారిగా 38 మంది భారతీయులు విమానంలో ప్రయాణించారు. మంగళవారం లక్నో నుంచి 200 కిలోమీటర్ల దూరంలో గల నేపాల్ గంజ్ నుంచి తొలి దర్శన్ ప్లైట్ బయలుదేరింది.

ఇందులో ఢిల్లీ, ముంబై, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు చెందిన భక్తులు ప్రయాణించారు. సాధారణంగా మానస సరోవర్ వెళ్లాలి అంటే దాదాపు నెల రోజులు ప్రయాణం పట్టేది. వాహనాలు, కాలినడకన దుర్గమమైన కొండలు, చలి ప్రాంతాల్లో ప్రయాణించాల్సి ఉండేదీ. అయితే విమానంలో ప్రయాణం చేయాల్సి రావడంతో ఈ సమయం కేవలం 1.5 గంటల్లోనే చేరుకోవచ్చు.

కైలాస్ మానస సరోవర్ సముద్ర మట్టం నుంచి 27,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మౌంట్ కైలాష్ హిందువులు, బౌద్దులు, సిక్కులతో పాటు టిబెట్ లోని బోన్పా తెగ ప్రజలు కూడా పరమ పవిత్రంగా భావిస్తారు. ఇది టిబెట్ పీఠభూమిలో నెలకొని ఉంది.

కరోనా వైరస్ విభృంభణ తరువాత ఈ యాత్రను చైనా ప్రభుత్వం నిలిపివేసింది. పరిస్థితులన్నీ కుదుటపడిన తరువాత 2023లో తిరిగి యాత్రను ప్రారంభించింది. అయితే భారతీయ యాత్రికుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేసింది. తరువాత వీసాలపై పరిమితులు విధించింది.

"38 మంది భారతీయ పర్యాటకులతో శ్రీ ఎయిర్ లైన్స్ ద్వారా తొలి చార్టర్ దర్శన్ ఫ్లైట్ ప్రారంభించాం. దీనికోసం కేవలం ఒకటిన్నర గంట మాత్రమే పడుతుంది " అని వెంచర్ ను ప్రారంభించిన సిద్దార్థ బిజినెస్ గ్రూప్ ప్రాంతీయ డైరెక్టర్ కేశవ్ న్యూపానే మీడియాకు చెప్పారు.

తదుపరి విమాన ప్రయాణాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుందని చెప్పారు. " భారతీయులు ఎక్కువగా కష్టపడకుండానే కైలాష్ పర్వత, మానస సరోవర్ అందాలను దగ్గరి నుంచి వీక్షించొచ్చు. మేము డిమాండ్ ఆధారంగా వీలైనన్నీ ఎక్కువ ప్లైట్ లు నడుపుతాం. ఇది నమ్మదగినది, సురక్షితమైంది కూడా. నేపాల్ వెళ్లకుండానే మీరు అక్కడికి చేరుకోవచ్చు" అని కేశవ్ అంటున్నారు.

Read More
Next Story