
సరిస్కాలోని పులి స్మారకం నమూనా
దేశంలో తొలిసారిగా ‘పులి’కి రాజమాతగా గౌరవం
సరిస్కా పులుల సంరక్షణ కేంద్రానికి పునర్ వైభవం తీసుకొచ్చిన ‘ఎస్టీ2’ అనే ఆడపులి
(మూలం.. అజయ్ సూరి)
సమాజం కోసం పోరాడిన వాళ్ల కోసం మనం విగ్రహాలు, స్మారకాలు పెట్టడం చూస్తాం.. కానీ మనదేశంలో మొదటిసారిగా ఓ జంతువుకు స్మారకం నిర్మించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ లోని పెద్ద పులులన్నీ 2004 లో దాదాపుగా చనిపోయాయి. అదే సమయంలో అక్కడ తిరిగి పులుల సంఖ్య పెంచడంలో కీలక పాత్ర పోషించింది ఓ ఆడపులి. దానికి గుర్తుగా దేశంలో తొలిసారిగా ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు.
2010 తరువాత అక్కడ తిరుగుతున్న 43 పులుల్లో 70 శాతం దాని సంతానమే అని తేలింది. ఇక్కడ నివసించే ఎస్టీ2 అనే ఫులి పిల్లలు ఇక్కడ టైగర్ రిజర్వ్ ను కాపాడాయని అధికారులు అంటున్నారు.
క్వీన్ మదర్ కి గొప్ప నివాళి..
ఈ పులికి తాజాగా రాజమాత లేదా క్వీన్ మదర్ అని పేరు పెట్టారు. ఎస్టీ2 ను సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గురించి వివరిస్తూ సరిస్కా అటవీ శాఖ అధికారి సంగ్రామ్ సింగ్ కటియార్ మాట్లాడారు. ‘‘ ఈ పురాణ పులికి మనం ఇవ్వగలిగే గొప్ప నివాళి ఇదే’’. అన్నారు.
‘‘సరిస్కా ఇప్పుడు వైభవంగా ఉండటానికి కారణం ఆమెనే’’ ఆయన సింగ్ చెప్పారు. స్మారకచిహ్నం నమూనాను సిద్దం చేశాము, అది త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.
సందేహాస్పద రికార్డు..
సరిస్కా లో దేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్. ఇది 2004 లో ప్రకటించారు. అయితే అధికారులు ఉదాసీనత, వేట వల్ల చాలా పులులు అంతరించిపోయాయి. తరువాత రాజస్థాన్ లోని రణతంబోర్ నుంచి పులులను ఇక్కడకు తరలించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా 2008 లో ఎస్టీ1 అనే మగపులిని హెలికాప్టర్ ద్వారా సరిస్కాకు తరలించారు. కొన్ని రోజుల తరువాత రణతంబోర్ నుంచి వచ్చిన ఎస్టీ2 అనే ఆడపులిని సరిస్కా లోపల ఉంచారు. అయితే రెండు పులులను ఇక్కడకు తీసుకురావడం వల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
రణతంబోర్ నుంచి పులులను తీసుకొచ్చినప్పటికీ ఆడ పులులకు ఇక్కడ పిల్లలు జన్మించలేదు. ఈ పులులను ఇక్కడకి తరలించడానికి వ్యూహం పన్నిన అనేక మంది అధికారులు, వన్యప్రాణి నిపుణులు, అటవీ అధికారులకు వేదన మిగిలింది. వీటిలో అనేక సిద్దాంతాలు కూడా ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి ఏంటంటే.. ఫులి లాంటి తెలివైన ప్రిడేటర్ పిల్లలకు సురక్షితం కాదని భావించిన ప్రదేశంలో పిల్లలను కనదు.
తరువాత కొన్ని రోజులకు అంటే 2011 లో మగ పులిని గ్రామస్తులు చంపివేశారు. ఇది పెను విషాదంగా మారింది. కానీ ఎస్టీ2 తరువాత కాలంలో పిల్లలకు జన్మనిచ్చింది. వాటికి ఎస్టీ7, ఎస్టీ8 అని పేర్లు పెట్టారు. 2015 లో రెండోసారి సంతానం పొందింది. వాటిలో ఒకటి ఆడ సంతానం..మరోకటి మగ సంతానం. వాటికి ఎస్టీ 13 అని మగ సంతానానికి, ఎస్టీ 14 అని ఆడ సంతానానికి పేరు పెట్టారు. ఇవి సరిస్కాకు మ్యాజిక్ చేశాయి.
తరువాత వీటి ద్వారా సంతానం పెరిగింది. మధ్యలో ఎస్టీ2, మూడు పిల్లలను కన్నది. కొంతకాలం తరువాత ఎస్టీ18, ఎస్టీ 19 అనే ఆడపులులు రెండు కూనలకు జన్మనిచ్చాయి. ఇలా అవి తమ వంశంలో పిల్లలను పెంచుకుంటూ వెళ్లాయి. వీటిని ఎస్టీ13 అనే మగపులి తోడుగా ఉంటుంది. వీడి వల్లనే ఇక్కడ 13 పిల్లలు జన్మించాయి.
సరిస్కాకు పునర్ వైభవం తీసుకొచ్చిన ఎస్టీ2 2024 లో మరణించింది. కానీ తన వారసత్వం మాత్రం కొనసాగుతోంది. ఆ పులికి అధికారికంగా గౌరవం, గుర్తింపు ఇవ్వడానికి దానికి ‘రాజమాత’ అని బిరుదు ఇచ్చి గొప్ప స్మారకం ఏర్పాటు చేయబోతున్నారు.
Next Story