ఈ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అక్కడా ఫస్టే.. ఇక్కడా ఫస్టే..
x
Nina singh

ఈ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అక్కడా ఫస్టే.. ఇక్కడా ఫస్టే..

పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ కు రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారిణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.


కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక నియామకం చేపట్టింది. ఇప్పటికే మహిళలను యుద్ధభూమిలో, యుద్ధ విమానాల్లో ప్రవేశపెట్టి చారిత్రక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పారా మిలిటరీ భద్రతా దళం సీఐఎస్ఎఫ్(CISF ) కు సైతం మహిళా ఐపీఎస్ అధికారిని చీఫ్ గా నియమించింది. సీఐఎస్ఎఫ్ చరిత్రలో ఒక మహిళా ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే రాజస్తాన్ లో ఐపీఎస్ అధికారిగా పని చేసిన తొలి మహిళా కూడా నీనా సింగే.

రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి నీనా సింగ్ దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, పారిశ్రామిక సంస్థలకు భద్రత కల్పిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చీఫ్ గా నియమితులైయ్యారు. సీఐఎస్ఎఫ్ కు ప్రత్యేక డీజీగా పని చేస్తున్న నీనా సింగ్, ఇప్పుడు కేంద్ర బలగాల్లో డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందారు. నీనా 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2021 నుంచి సీఐఎస్ఎఫ్ లో ఉన్నారు. వచ్చే ఏడాది జూలై 31 వరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారు.

నీనాసింగ్ బిహార్ లో జన్మించారు. పాట్నా మహిళా కళాశాలలో విద్య అభ్యసించారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. గ్రాడ్యూయేషన్ తరువాత హర్వర్డ్ లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

ఐపీఎస్ కు ఎంపిక కావడానికంటే ముందు నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లోలతో కలిసి రెండు పరిశోధన పత్రాలు సమర్పించారు. 2013-18 మధ్య కాలంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేశారు. దేశంలో సంచలనం సృష్టించిన నటి జియాఖాన్ ఆత్మహత్య, షీనాబోరా హత్యకేసుల వంటి కొన్ని ప్రముఖ కేసులను నీనా సింగ్ పర్యవేక్షించారు.

వృత్తిలో ఆమె నిబద్ధత, నైపుణ్యతతో ప్రతిష్టాత్మక ‘అతి ఉత్కృష్ట్ సేవా పతకాన్ని’ అందుకుంది. ఐఏఎస్ అధికారి రోహిత్ కుమార్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆయన కేంద్ర వినియోగదారుల వ్యవహరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

ఇదే రోజు మరోవైపు ఇండో -టిబెటన్ బోర్డర్ ఫోర్స్(ITBP) చీఫ్ గా పని చేస్తున్న అనీష్ దయాల్ సింగ్ ను సీఆర్పీఎఫ్(CRPF) గా డైరెక్టర్ జనరల్ గా బదిలీ అయ్యారు.

Read More
Next Story