డబ్బుల కోసం,దండల మార్పు.. యూపీలో ఘరానా మోసం
x

డబ్బుల కోసం,దండల మార్పు.. యూపీలో ఘరానా మోసం

అదొక సామూహిక వివాహాల కార్యక్రమం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ వివాహాలకు హజరైయ్యారు.. కానీ సీట్ కట్ చేస్తే.. అదంతా ఉత్తుత్తి కథని తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


యూపీ ప్రభుత్వం పెళ్లి చేసుకునే యువతులకు రూ. 51,000 అందజేస్తుంది. అందులో యువతికి నేరుగా రూ. 35,00, వివాహా సామగ్రి కోసం 10,000, మరో రూ. 6,000 పెళ్లి ఖర్చు కింద అందజేస్తుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు సామూహిక వివాహాలకు తెరతీశారు. కొంతమంది యువతి, యువకులను డబ్బులకు మాట్లాడి సామూహిక పెళ్లి తంతులో కూర్చొబెట్టారు. దీనిలో కొంతమంది ఆ పెళ్లిలు చూడడానికి వెళ్లిన వారు సైతం ఉన్నారు. వీరికి దండలు మార్చుకుంటే రూ. 500 నుంచి రూ. 2000 వరకూ ఇస్తామని కేటగాళ్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ సంఘటన యూపీలోని బల్లియా జిల్లాలో జనవరి 25 న జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, అందులో కొంతమంది యువకులు తమ ముఖం కనపడకుండా దాచుకోవడంతో జాతీయ మీడియా ప్రతినిధులు మెల్లగా వివరాలు సేకరించారు. దీనితో మోసగాళ్ల గుట్టురట్టు అయింది. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో మొత్తం 550 జంటలు పాల్గొన్నాయి.

"వివాహతంతుకు అంగీకరించే మహిళకు రూ. 500, పురుషులకు రూ. 1000 ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి. కొంతమందికీ రూ. 2000 ఆఫర్ చేశారు. కొందరు స్త్రీలు తమకు తామే వరమాల ధరించారు. కొంతమంది డబ్బులు తీసుకుని కేవలం దండలు మార్చుకుని ఫొటోలు దిగారు" అని విమల్ కుమార్ పాఠక్ అనే వ్యక్తి చెప్పారు. పెళ్లి కొడుకుగా నటిస్తే తనకు డబ్బు ఇస్తామన్నారని 19 ఏళ్ల యువకుడు ఒకతను చెప్పాడు. " పెళ్లి చూసేందుకు నేను వెళ్లాను. అయితే నాకు డబ్బులు ఇస్తామని చెప్పి పీఠలపై కూర్చొబెట్టారు. నన్నే కాదు.. చాలామందిని అలానే కూర్చొబెట్టారు" అని రాజ్ కుమార్ అనే యువకుడు చెప్పాడు.

సామూహిక వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే కేత్కీ సింగ్ మాట్లాడుతూ " నాకు కేవలం రెండు రోజుల ముందే నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. అయితే పెళ్లికి వెళ్లినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు మోసం బయటపడింది. విచారణ జరుగుతోంది" అని అన్నారు.

నిందితులకు నగదు బదిలీ చేసే సమయంలో ఈ కుంభకోణం బయటపడిందని సంబంధిత అధికారులు తెలిపారు. "మేము ఈ నేరాలను గమనించగానే ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశాం. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అని విచారణ చేస్తాం. అప్పటి వరకూ ఎలాంటి ప్రయోజనాలను వారికి బదలాయించబోము" అని విచారణ అధికారులు వెల్లడించారు.

Read More
Next Story