దూబే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ సీఈసీ ఖురేషీ
x
మాజీ సీఈసీ ఎస్ వై ఖురేషీ

దూబే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ సీఈసీ ఖురేషీ

వక్ఫ్ సవరణ చట్టం విషయంలో బీజేపీ పై విమర్శలు గుప్పించిన ఖురేషీ, ఘాటుగా ప్రతిస్పందించిన దూబే


బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలపై మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్ వై ఖురేషి స్పందించారు. తాను భారతీయుడనని, ఇక్కడ ఆలోచనలను నమ్ముతున్నానని అన్నారు.

కొంతమంది మతపరమైన గుర్తింపులు వారి ద్వేషపూరిత రాజకీయాలను ముందుకు తీసుకురావడానికి వాడుకుంటారని చెప్పారు. బీజేపీ ఎంపీ దూబే ఇంతకుముందు ఖురేషిని ‘ముస్లిం కమిషనర్’ అని విమర్శించాడు.

ఖురేషీ వక్ఫ్ సవరణ చట్టంపై ఇంతకుముందు మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ముస్లింల భూములు లాక్కోవడానికి బీజేపీ చేసిన దుష్టపథకం’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.‘‘ వక్ప్ చట్టాన్ని సుప్రీంకోర్టు ఖండిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా దూబే ‘ముస్లిం కమిషనర్’ అంటూ ఆయన పదవీకాలంలో జరిగిన అనేక అంశాలను లేవనెత్తారు.
భారత్ చాలాసార్లు నిలబడింది
భారత్ తన రాజ్యాంగ సంస్థలు, విలువల కోసం నిలబడి పోరాడుతుందని, ఇది చాలాసార్లు రుజువయిందని ఖురేషీ చెప్పారు.
‘‘నేను రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమిషనర్ పదవిలో నా సామర్థ్యం మేరకు పనిచేశాను, ఐఏఎస్ గా సుదీర్ఘమైన, సంతృప్తికరంగా కెరీర్ కొనసాగించాను. భారత్ ఆలోచనలను నేను నమ్ముతాను.
ఇక్కడ ఒక వ్యక్తి ప్రతిభ, సహకారాల ద్వారా పైకి ఎదుగుతారు. వారి మతపరమైన గుర్తింపు ద్వారా కాదు’’ అని ఖురేషీ జాతీయ మీడియాకు చెప్పారు.
‘‘కానీ కొంతమందికి మతపరమైన గుర్తింపులు వారి ద్వేషపూరిత రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమైనవి అని నేను అనుకుంటున్నాను. భారత రాజ్యాంగ సంస్థలు, సూత్రాల కోసం ఎల్లప్పుడూ నిలబడి పోరాడుతుంది’’ అని ఆయన అన్నారు.
ఖురేషి లాంటి అధికారి గర్వకారణం..
ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అకడమిక్ ఫోరం గౌరవ అధ్యక్షుడు ఐఏఎస్ కే. మహేశ్ ఖురేషికి మద్దతు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ గా దేశానికి ఖురేషి అపారమైన సేవలు చేశారని కొనియాడారు.
‘‘ఆయన ఈ గొప్ప పనులను ధైర్యంగా విశిష్టతతో నిర్వహించారు. వరుస సంస్కరణలను ప్రవేశ పెట్టడం ద్వారా ఎన్నికల కమిషన్ సంస్థను గొప్పగా సుసంపన్నం చేశారు. ఉదాహారణకు ఆయన ఓటర్ల విద్యా విభాగం, వ్యయ నియంత్రణ విభాగం స్థాపించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ను కూడా స్థాపించారు.’’ అని మహేశ్ అన్నారు.
ఖురేషీ హర్యానా క్యాడర్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనలాంటి ఐఏఎస్ అధికారులు ఉండటం దేశానికి గర్వకారణమని మహేశ్ చెప్పారు.(‘‘భారత్ లో అత్యుత్తమ వంశపారంపర్యత కలిగిన డాక్టర్ గోపాలకృష్ణ గాంధీ దీనిని అంగీకరించారు. ఆయన సీ రాజగోపాలాచారీ మనవడు’’)
‘‘డాక్టర్ ఖురేషీ గురించి గోపాల కృష్ణ గాంధీ మాట్లాడుతూ.. ఆయన మనం ఇప్పటి వరకూ మనకు వచ్చిన ఎన్నికల కమిషన్ లో అద్బుతమైన వ్యక్తి అని ప్రశంసించారు’’ అని మహేశ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
2010 నుంచి 2012 వరకూ ప్రధాన కమిషనర్..
సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాపై దుబే చేసి తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన దేశంలో మతయుద్దాలకు ఆయననే అని నిందించాడు.
ఖురేషీ ని ముస్లిం కమిషనర్ అని ఆయన విమర్శించిన దూబే.. జార్ఖండ్ లోని సంతల్ పరగణాలో అత్యధిక సంఖ్యలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్లుగా మార్చిన ఘనత ఆయనదే అని ఆరోపించారు. మహ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం 712 లో భారత్ కు వచ్చిందని భారత భూమి హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్దులదని అన్నారు.
ఇస్లాం దండయాత్రికుడు భక్తియార్ ఖిల్జి 1189 లో తన గ్రామమైన విక్రమశిలను తగలబెట్టాడని, విక్రమ శిల విశ్వవిద్యాలయం ప్రపంచానికి మొదటి వైస్ ఛాన్సలర్ అయిన అతీషీ దీపాంకర్ ను అందించిందని ఆయన చెప్పారు.
‘‘ఈ దేశాన్ని ఏకం చేయండి. చరిత్ర చదవండి.. పాకిస్తాన్ ను విభజించడం ద్వారా సృష్టించబడింది. ఇప్పుడు విభజన ఉండదు.’’ అని ఆయన అన్నారు. ఆయన జార్ఖండ్ లోని గోడ్డా నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
Read More
Next Story