వీవీప్యాట్ స్లిప్పులను ప్రజలకు ఇవ్వండి: జైరాం రమేష్
x
జైరాం రమేష్

వీవీప్యాట్ స్లిప్పులను ప్రజలకు ఇవ్వండి: జైరాం రమేష్

ఓటు వేశాక వీవీప్యాట్లలోని స్లిప్పులను ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ ఈసీని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.


ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎం, వీవీప్యాట్ లపై అభిప్రాయాలను చెప్పేందుకు తనకు, ఐ.ఎన్.డీ.ఐ( INDIA)కూటమి భాగస్వాములకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు.

డిసెంబర్ 19 న కూటమి నాయకులు సమావేశం అయ్యారని, వీవీప్యాట్ అంశాలపై తాము పలు తీర్మానాలు ఆమోదించామన్నారు. తీర్మానాల ఆధారంగా కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నామని లేఖలో వివరించారు. అందుకు తమకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ‘మా కూటమి నాయకులు ఆమోదించిన తీర్మానాలను ప్రత్యక్షంగా భారత ఎన్నికల ప్రధాన అధికారికి ఇవ్వాలని అనుకుంటున్నాం.. అలాగే కొన్ని కీలక విషయాలను మీతో చర్చించాలని అనుకుంటున్నాం’ అని లేఖలో కోరారు. ‘మా కూటమి తరఫున ముగ్గురు లేదా నలుగురు నాయకులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు మిగిలిన కమిషనర్ లను కలుస్తాం’ అని లేఖలో అనుమతి కోసం అర్ధించారు.

గత ఏడాది ఆగష్టు 9 న ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించిన అంశాలపై కూడా ఓ మెమోరాండమ్ సమర్పించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ లేఖలో ప్రస్తావించారు.

‘గత ఏడాది ఆగష్టు 23న మా కూటమి ఈవీఎంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను ఉటంకించిన విషయాన్ని సైతం ఉటంకించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1961 సెక్షన్ 61(ఏ) వంటి అంశాలను వివరించే ప్రయత్నం చేశారని, 2004 నాటి నుంచి ఎన్ని పార్టీలు అధికారంలో ఉండి తిరిగి ప్రతిపక్షంలో కూర్చున్నాయో కూడా వివరించారని జైరాం రమేష్ రాసిన లేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ తాము కొన్ని అంశాలపై మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈవీఎంలపై ఇండియా కూటమి నాయకులకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఓటు వేశాక వీవీఫ్యాట్ స్లిప్ లను ఓటర్లకు అందజేయాలని కోరారు. అది కూడా కౌంటింగ్ పూర్తయ్యాక అందజేయాలన్నారు. కొన్ని రోజుల కిందట జరిగిన ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని, ఇదే విషయాన్ని ప్రజల ముందు కలిసికట్టుగా లేవనెత్తాలని అనుకుంటున్నామని లేఖలో ప్రస్తావించారు.

అయితే అనేక సందర్భాల్లో ఈవీఎంలపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంలు ట్యాంపర్ కు గురి అవుతున్నాయనే అంశంపై ఓపెన్ ఛాలెంజ్ సైతం విసిరింది. దీనిని ఎవరూ నిరూపించలేకోపోయారు. అలాగే ఎన్నికల్లో మరింత పారదర్శకత కోసం వీవీప్యాట్ లను ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ లో యాధృచ్చికంగా ఎంపిక చేయబడిన ఐదు వీవీఫ్యాట్ లలో ఆడిట్ ట్రయల్ నిర్వహించిన తరువాతనే ఈవీఎంలోని ఓట్లను లెక్కింపు చేస్తారు.

Read More
Next Story