హర్యానా: సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కొత్త సీఎంగా..
x

హర్యానా: సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కొత్త సీఎంగా..

లోక్ సభ ఎన్నికల ముందు హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. భాగస్వామి జేజేపీతో ఏర్పడిన విభేదాలతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా సమర్పించారు. తన రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఖట్టర్ స్థానంలో హర్యానా బీజేపీ చీఫ్ నయాబ్ సింగ్ సైనీని సీఎంగా నియమించవచ్చని తెలుస్తోంది.

ఖట్టర్ ను కర్నాల్ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకంపై రాష్ట్రంలోని అధికార బిజెపి, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జెజెపి) సంకీర్ణంలో చీలికలు వచ్చిన తరువాత ఈ పరిణామం జరిగింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

బీజేపీ తన ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ప్రస్తుతం, 90 మంది సభ్యుల సభలో బిజెపికి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జెజెపికి 10 మంది ఉన్నారు. పాలక కూటమికి ఏడుగురు స్వతంత్రులలో ఆరుగురి మద్దతు ఉంది.
అంతకుముందు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నయన్ పాల్ రావత్ మాట్లాడుతూ.. పొత్తు ముగింపు దశలో ఉందని, ఖట్టర్ ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చే ఎమ్మెల్యేలు సైతం పునరాలోచనలో ఉన్నాయని చెప్పారు.
బీజేపీ, జేజేపీ (జననాయక్‌ జనతా పార్టీ) రెండు పార్టీల అగ్రనాయకత్వం తమ తమ ఎమ్మెల్యేలను వేర్వేరుగా సమావేశాలకు పిలిచాయి. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌తో సహా కేంద్ర బిజెపి నాయకులు మార్పులను పర్యవేక్షించడానికి రాష్ట్రంలో ఉన్నారని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
90 మంది సభ్యుల అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల అనంతరం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటివరకు బీజేపీ అధికారంలో ఉంది. ఇది 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నుంచి విడిపోయిన చౌతాలా, అతని JJPకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రస్తుత సంక్షోభం మధ్య జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు దీనికి రాకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం స్వతంత్రులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జేజేపీని తుడిచిపెట్టుస్తుందని పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read More
Next Story