‘సంవిధాన్ హత్య దివస్’ తో కాంగ్రెస్ ను కమలం కార్నర్ చేసిందా?
x

‘సంవిధాన్ హత్య దివస్’ తో కాంగ్రెస్ ను కమలం కార్నర్ చేసిందా?

గత కొన్ని నెలలుగా బీజేపీపై రాజ్యాంగాన్ని మారుస్తారనే అంశంతో ఇండి కూటమి ప్రచారం చేసి లబ్ధి పొందింది. ఇప్పుడు కమల దళం ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన ఎమర్జెన్సీని..


గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి చేస్తున్న రాజ్యాంగ రక్షణ విధానంపై నరేంద్ర మోదీ సర్కార్ ఎదురుదాడి తీవ్రతరం చేసింది. రాజ్యాంగాన్ని మారుస్తారనే ప్రచారంతో ఎన్నికల్లో ఓట్లు, సీట్లు సాధించిన కాంగ్రెస్ కూటమికి ఇప్పుడు ఊహించని షాక్ ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. 1975 లో దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హాయాంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ని ఇక నుంచి ‘సంవిధాన్ హత్యా దివస్’ గా పాటిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మోదీ రాజ్యాంగాన్ని మారుస్తారనే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ యుగంలో కాంగ్రెస్ చేసిన దురాగతాలను ప్రజలకు తిరిగి గుర్తు చేసే పనిని బీజేపీ మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి దాని మిత్రపక్షాలను వేరు చేయడం కూడా ఓ వ్యూహంలో భాగం.
'నియంతృత్వ ప్రభుత్వం'
" నియంతృత్వ ఇందిరాగాంధీ ప్రభుత్వం చేతిలో అనేక దౌర్జన్యాలు, హింసను ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేయడానికి పోరాడుతున్న" వారందరినీ గౌరవించడమే మోదీ ప్రభుత్వ నిర్ణయం లక్ష్యంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో అమిత్ షా అన్నారు.
పూర్తి స్థాయిలో మెజారీటి సీట్లు రాకున్నా మూడోసారి వరుసగా అధికారం చేపట్టిన బీజేపీ పాత విషయాలను తిరిగి గుర్తు చేయడం ప్రారంభించింది. ఇంతకుముందు పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. తరువాత జరిగిన లోక్ సభ సమావేశాల్లోనూ స్పీకర్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. దీనితో కాంగ్రెస్ దూకుడు కాస్త తగ్గింది. పాత విషయాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ప్రారంభం అయింది.
కాంగ్రెస్ నిరసనలు
జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ లోక్‌సభ స్థానాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకున్న కాంగ్రెస్, దాదాపు 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీని పార్లమెంట్ లో రాష్ట్రపతి, స్పీకర్ ప్రస్తావించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. ఇండి కూటమిని విభజించడానికి బీజేపీ ఈ ఎత్తు వేసిందని పార్లమెంట్ లోపల బయట నిరసనలకు దిగింది. ఇండి కూటమిలో చాలామంది నేతలు ఇందిరాగాంధీ హాయాంలో విధించిన ఎమర్జెన్సీ వల్ల జైలు శిక్ష అనుభవించారు. ఈ విషయాన్ని బీజేపీ మరోసారి గుర్తు చేయడంతో కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది.
ప్రతిపక్షం తన వ్యూహాన్ని పునఃపరిశీలించింది
జూలై 3న పార్లమెంటు సమావేశాలు ముగిసినప్పటి నుంచి ప్రతిపక్షాలు తమ వ్యూహాన్ని పునఃపరిశీలించాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇండి కూటమి సీనియర్ నాయకుడు ఫెడరల్‌తో మాట్లాడుతూ, “ఎమర్జెన్సీని ఎత్తివేయడం ఇప్పుడు బిజెపి వ్యూహంలో శాశ్వత స్థానం అవుతుందని ప్రతిపక్షాల కూటమి గ్రహించింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనే ప్రచారం ద్వారా పెద్ద ఎత్తున ఓటర్లను చేరుకున్నట్లు ఆయన అంగీకరించారు. దీనివల్ల తమ స్థానాలు డబుల్ అయినట్లు ఆయన వివరించారు. జూన్ 25ని సంవిధాన్ హత్యా దివస్ గా పాటించాలన్న కేంద్రం నిర్ణయం పై ప్రతిపక్షాల స్పందన, రాష్ట్రపతి ప్రసంగం, స్పీకర్ ప్రకటనపై ఆయన పొందికగా సమాధానాలు చెప్పారు.
"పేదలు - అణగారిన వారి ఆత్మను గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దోచుకుంటోందని, వీరు ప్రతిరోజు రాజ్యాంగాన్ని హతమారుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎదురుదాడికి దిగారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇవే రుజువు చేశాయని దాని బలం కేవలం 240 సీట్లకే పరిమితం అయిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ ఆరోపించారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న ముక్తి దివస్ గా అభివర్ణించారు. మరోవైపు కాంగ్రెస్ పాట్నర్ ఆర్జేడీ కూడా మోదీపై విమర్శలు గుప్పించింది. గత పది సంవత్సరాలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను జైలుకి పంపడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇలాంటి రాజ్యాంగాన్ని హత్య చేయడం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త రోజులకు లేదా పాత రోజులకు పేరు పెట్టడానికి ఇష్టపడితే, ముందుగా అమరవీరుల దినోత్సవం (జనవరి 30) - మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేసిన రోజు - "గాంధీ హత్యా దివస్" అని పేరు మార్చాలని, ఆ తర్వాత "గాంధీ హంతకుడి రాజకీయ, సైద్ధాంతిక అనుబంధాలు ప్రజలకు వివరించబడ్డాయి" అని నిర్ధారించుకోండి.
'మరణం - విధ్వంసం గురించి మాత్రమే ఆలోచించవచ్చు'
బిజెపికి రాజ్యాంగంపై నిజమైన గౌరవం ఉంటే, అది సంవిధాన్ సమర్థన్ దివస్‌తో వచ్చేదని ఝా అన్నారు, అయితే, వారు (బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్) మరణం, విధ్వంసం గురించి మాత్రమే ఆలోచించగలరని విమర్శించారు.
సమాజ్‌వాదీ పార్టీ యూపీ యూనిట్ చీఫ్, ఫతేపూర్ నుంచి కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపి నరేష్ ఉత్తమ్ పటేల్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయం “నిరుద్యోగం, ధరల పెరుగుదల, జీవనోపాధి సమస్యలపై ప్రజల, ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ఈ ఎత్తుగడ వేసినట్లు విమర్శించారు. పెరుగుతున్న సామాజిక అసమానత, మతపరమైన విభజన సహ ఇతర సవాళ్లను మోదీ గత 10 సంవత్సరాలుగా దేశం ముందుకు పెట్టారని అన్నారు.
NCP..
శరద్ పవార్ ఎన్‌సిపికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ, “50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీని ప్రజలు గుర్తుంచుకోవాలని బిజెపి కోరుకుంటోంది. దీనికి కాంగ్రెస్, దివంగత ఇందిరా గాంధీ కూడా పదేపదే విచారం వ్యక్తం చేశారు, క్షమాపణలు చెప్పారు. ఇది బీజేపీ రాజకీయ అవసరం గురించే కానీ వారికి ఎలాంటి ప్రేమ లేదన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లకు సంబంధించి పాఠశాల పుస్తకాలను తొలగిస్తోందని ఆరోపించారు.
ఎమర్జెన్సీ గురించి మోదీ పాలన పదేపదే వాదిస్తున్న తీరు బిజెపి "ఆసక్తిని" మాత్రమే బహిర్గతం చేస్తుందని, "రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రభుత్వ చర్యపై ఇండి కూటమి నిశ్చయాత్మకమైన వ్యతిరేకతను అది నిరూపిస్తుంది" అని ప్రతిపక్ష వర్గాలు చెబుతున్నాయి.
ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ, “పదేపదే ఎమర్జెన్సీని తీసుకురావడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని ఇండి కూటమిలో సైడ్ ట్రాక్ చేసే పని బీజేపీ చేస్తోందని, అయితే ఈ వ్యూహాలు ఇప్పుడు పని చేయవు... మా కూటమిలోని అందరికీ తెలుసు. మోదీ ఇలా చేస్తున్నారు. మేము లోక్‌సభ ఎన్నికల్లో పోరాడిన అంశాలను లేవనెత్తుతూనే ఉంటాము. రాహుల్ గాంధీ (ప్రతిపక్ష నాయకుడు) లోక్‌సభలో చెప్పినట్లుగా, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కొనసాగిస్తాము.
Read More
Next Story