ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్, గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు
x

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్, గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు

ఢిల్లీ మంగళవారం ట్రాఫిక్ రద్దీతో విలవిలలాడింది. ‘ఢిల్లీ చలో’ అంటూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అన్ని కీలక రహదారులను మూసివేశారు.


కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ఢిల్లీ చుట్టూ భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించడం కూడా ట్రాఫిక్ రద్దు పెరగడానికి ఓ కారణమైంది. మొత్తం నగరం చుట్టూ కూడా ఓ భారీ గోడ కట్టిన పరిస్థితులు సృష్టించారు. ఈ పరిస్థితులో కారులో ఒక కిలోమీటర్ వెళ్లడానికి ఒక గంటకు పైగా సమయం పడుతోంది. ఢిల్లీలోని ఘజియాబాద్, నోయిడా తో కలిపే ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల వద్ద గల హైవేలపై కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ క్యూలు కనిపిస్తున్నాయి.

విఫలమైన చర్చలు

పంటలకు కనీస మద్థతు ధర(ఎంఎస్ఎస్పీ) హమీ చట్టంతో సహా తమ మిగిలిన డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 200 కు పైగా రైతు సంఘాలు ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి. గత రాత్రి రైతు సంఘం ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ బృందంతో చర్చలు జరిపాయి. అయితే రైతులు ప్రతిపాదించిన మూడు ప్రధాన డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో రైతు సంఘాల నాయకులు ఢిల్లీ వైపు తమ ప్రయాణం మొదలుపెట్టాయి.

బారికేడ్లతో గోడలు

ఢిల్లీ సరిహద్దులో గల సింగు, టిక్రి, ఘూజీపూర్ పాయింట్ లో పోలీసులు వందల సంఖ్యలో బారికేడ్లను పెట్టారు. ఇక్కడ పోలీసుల తనిఖీల కారణంగా సింగూ, టిక్రిల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో క్యూలో ఉన్నాయి. కేవలం పంజాబ్ కు చెందిన రైతులు భారీగా ట్రాక్టర్లతో ఆరు నెలలకు సరిపడా ఆహార నిల్వలతో ఢిల్లీ చలో మార్చ్ కు వస్తున్నారనే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని బహుళ అంచెల బారికేడ్లు, కాంక్రీట్ బ్లాకులు, ఇనుప చువ్వలు, కంటైనర్ గోడలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు జనవరి 26, 2021న కూడా రైతు సంఘాల పేరుతో కొన్ని ఖలిస్తానీ శక్తులు ఢిల్లీలో నానాభీతత్సం సృష్టించిని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

తిప్పలు పడ్డ ప్రయాణికులు

రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేసి కానీ నగరంలోకి అనుమతించకపోవడం, బారికేడ్లు ఉండడంతో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఈ సందర్బంగా నోయిడాకు చెందిన ప్రయాణీకుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.." ఈ రోజు జరిగే రైతుల మార్చ్ గురించి నాకు తెలుసు. అందుకని నేను ఓ గంట ముందుగానే ఇంటి నుంచి ఆఫీస్ కు బయల్దేరాను. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మా ఆఫీస్ కు చేరుకోవడానికి నాకు మరో రెండు గంటలు ఆలస్యం అవుతుంది" అని చెప్పాడు. బారీకేడ్లు ఉండడంతో కేవలం రెండు వాహనాలు మాత్రమే ఒక్కసారి వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ట్రాఫిక్ లో చిక్కుకున్న మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఉదయం ఆరుగంటలకే ఆఫీస్ కు బయల్దేరాను. కానీ 9 తొమ్మిది గంటలయినా నేను ట్రాఫిక్ లోనే ఉన్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ- గురుగ్రామ్ ను కలిపే జాతీయరహదారి 48 పై వాహనాలు నత్తతో పోటీపడుతూ వెళ్తున్నాయి.

ప్రత్యామ్నాయా మార్గాలు

చిల్లా బోర్డర్ మీదుగా ఢిల్లీకి వెళ్లే వాహనాలు గోల్ చక్కర్ చౌక్ సెక్టార్ 15కి చేరుకోవడానికి 14ఏ ప్లై ఓవర్ తీసుకుని, అక్కడి నుంచి సందీప్ పేపర్ మిల్లు చౌక్, జూండ్ పురా చౌక్ అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లవచ్చు. చిల్లా వైపు నుంచి వచ్చే ప్రజలు సెక్టార్ 14ఏ ప్లైఓవర్, రౌండ్ అబౌట్ చౌక్, సెక్టార్ 15 నుంచి సందీప్ పేపర్ మిల్లు, జూందాపూరా మీదుగా వెళ్లవచ్చు ఢిల్లీ కాళింది కుంజ్ సరిహద్దుకు ప్రయాణించడానికి కాళింది కుంజ్ ఉన్న మహామాయ ఫైఓవర్ ను ఎక్కాల్సి ఉంటుంది.

Read More
Next Story