వక్ప్ బోర్డు మనీలాండరింగ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
x

వక్ప్ బోర్డు మనీలాండరింగ్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

మనీలాండరింగ్ అనేది హత్యా, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించింది కాదు. నిందితులను ఎక్కువ కాలం జైలులో బంధించడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.


వక్ప్ బోర్డులో జరిగిన అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సహ నిందితుడైన జావేద్ ఇమామ్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వక్ప్ బోర్డుకు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ అధ్యక్షత వహిస్తున్నాడు. నిందితుడైన జావేద్ గత ఏడాది నవంబర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం విచారణ దశలో పత్రాల సరఫరాలో ఇబ్బంది వల్ల కేసు ముందుకు సాగడం లేదని భావించిన జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.

అనేక మంది నిందితులు, వేల పేజీల పత్రాల సాక్ష్యాలు, చాలా పెద్ద సంఖ్యలో నిందితులను విచారించాల్సి ఉంది. అయితే ఇది సమీప భవిష్యత్ లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45ని నిర్బంధానికి సాధనంగా ఉపయోగించడం అనుమతించదని అన్నారు.

సెక్షన్ 45 PMLA కేసులలో బెయిల్ మంజూరుపై కొన్ని పరిమితులను విధించింది. ‘‘ ఈ కేసులో నిజాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధాన నిందితుడు బెయిల్ పై బయట ఉన్నాడు. సహ నిందితుడు జైలులో ఉండటం, విచారణ ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 207 ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారుడు సాధారణ బెయిల్ పై విడుదల చేస్తున్నాం’’ అని హైకోర్టు పేర్కొంది.

మనీలాండరింగ్ కేసులో నిందితుడిని హత్య, అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష వంటి నేరాలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్న వారితో సమానం కాదని, స్వేచ్ఛ, న్యాయమైన పవిత్రమైన హక్కు అని కూడా కోర్టు పేర్కొంది.
జావేద్.. ఢిల్లీ వక్ప్ బోర్డులో అక్రమంగా సిబ్బందిని నియమించడంతో పాటు భారీ మొత్తంలో నగదు రూపంలో నేరాలకు పాల్పడ్డాడని, అనేక స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆప్ ఎమ్మెల్యే అయిన అమానుల్లాఖాన్ ఇంటిపై ఈడీ దాడులు చేసినట్లు కొన్ని వివరాలు లభించాయి.
ఏజెన్సీ తన ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో ఐదుగురి పేర్లను పేర్కొంది, ఇందులో అమానుల్లా ఖాన్ తో పాటు జీషన్ హైదర్, దౌద్ నాసిర్, జావేద్ ఇమామ్ సిద్ధిఖీ ఉన్నారు.
2018-2022లో ఖాన్ వక్ఫ్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో అక్రమంగా సిబ్బందిని నియమించుకోవడం, నిందితులు వక్ఫ్ బోర్డ్ ఆస్తులను అన్యాయంగా లీజుకు ఇవ్వడం ద్వారా అక్రమంగా వ్యక్తిగత లాభాలు పొందారని ED తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అనేక డిజిటల్, పత్రాల రూపంలో సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ వెల్లడించింది.
Read More
Next Story