హిమాచల్ రాజకీయం: కింగ్ వర్సెస్ క్వీన్..
x

హిమాచల్ రాజకీయం: కింగ్ వర్సెస్ క్వీన్..

కొండ ప్రాంతమైన హిమాచల్ లో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మండి లోక్ సభ స్థానంలో బాలీవుడ్ క్వీన్ కంగనా, బుషహార్ రాజవంశానికి చెందిన విక్రమాదిత్య పోటీ చేస్తున్నారు.


సార్వత్రిక ఎన్నికల మధ్యలోకి వచ్చేశాం. ఇప్పటి వరకూ మూడు దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం మరో దశకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకులు తమ అమ్ముల పొదిలోని అస్త్రాలు తీస్తుండగా, కొత్తగా వస్తున్నవారు అవేవీ తెలియక తాము వచ్చిన రంగంలోని ఎత్తులను ప్రజాక్షేత్రంలో ప్రయోగిస్తున్నారు. ఆ కోవలోకి చెందిన స్థానం హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ. ఇక్కడ బీజేపీ తరఫున బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లోకి దిగిన తన బాలీవుడ్ వాసనను మాత్రం తాను ఇంకా వదిలేయదని ప్రచారశైలిని చూస్తే తెలుస్తోంది.

BJP స్టార్ అభ్యర్థులలో ఒకరిగా, తన ఎన్నికల ర్యాలీలకు స్థానిక దుస్తులను ధరించడం ద్వారా హిమాచలీ ఓటరును ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఆమె తన ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చడానికి బాలీవుడ్ వ్యక్తిత్వాన్నే ఇంకా వాడుతున్నారు. మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ అసిస్టెంట్లతో కలిసి ఈ తాజా రాజకీయ నాయకురాలు మండిలో తెగ సందడి చేస్తున్నారు. తన బాలీవుడ్ శైలితో కంగనా వాడుతున్న పదాలు తరుచుగా విమర్శలకు గురైవుతున్నాయి.
ధాకడ్-మణికర్ణిక షేడ్స్
ప్రజాక్షేత్రంలో ధైర్యంగా, వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా చూపించుకోవడానికి కంగనా ప్రయత్నిస్తున్నారు. ఈ భావాల్లో ఎక్కువ మణికర్ణిక, ధాకడ్, తేజస్ చిత్రాల్లో మనకు కనిపించిన కంగనా కనిపిస్తోంది. ఆమె దుస్తులు వంటివి సాంప్రదాయకంగా ఉన్నా, సమావేశాల్లో ఉపయోగిస్తున్న పదజాలం మాత్రం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.



రాష్ట్రంలో ఒక రాజకీయ అభ్యర్థి సెక్యూరిటీ టీమ్, ఫిల్మ్ డైరెక్షన్ సిబ్బందితో పాటు మేకప్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ల బృందంతో ప్రయాణించడం కూడా ఇదే మొదటిసారి.
ప్రత్యర్థులకు..
బాలీవుడ్ తరహ ప్రచారం తో కంగనా ప్రత్యర్థులకు చాలా సులువైన టార్గెట్ లా మారారు. “ఇది సినిమా షూటింగ్ కాదు. మీరు మోదీ నుంచి రాష్ట్రానికి ₹ 9,000 కోట్ల పెన్షన్ తీసుకువస్తే.. నేను మీ భక్తుడిని అవుతాను ”అని బుషహర్ వంశపు రాజు, మండి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తన ప్రచార ప్రసంగాలలో కంగనాను ఉద్దేశిస్తూ విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కంగనా చేసిన మాటలను సింగ్ బహుశా పరోక్షంగా ప్రస్తావించారు, ఆమె ప్రసంగాలలో స్థానిక సమస్యల ప్రస్తావన కంటే ప్రధాని మోదీ పేరు ఎక్కువగా వాడుతుండటాన్ని ఆయన ఎత్తి చూపినట్లు అయింది.



మండి లోక్‌సభ నియోజకవర్గం రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు - లాహౌల్ స్పితి, పాంగి, కిన్నౌర్ లు కాంగ్రెస్ కు పట్టున్న స్థానాలు. ముఖ్యంగా బుషహర్ రాజకుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి అండగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈసారి ఆయన విక్రమ్ ఆదిత్య సింగ్ తల్లి సిట్టింగ్ మండి లోక్‌సభ ఎంపీ ప్రతిభా సింగ్ స్థానంలో సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన సింగ్‌ను పోటీకి దింపింది.
వస్త్రధారణ ప్రచార అంశంగా..
వస్త్రధారణ మీద ఇంత చర్చ ఎందుకని ఎవరికైనా అనిపిస్తుంది. బట్టలు సంప్రదాయాన్ని చూపించేవే కాకుండా స్థానిక, స్వభావం, సంప్రదాయాలు, అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. కంగనా ను మండి లోక్ సభ స్థానానికి బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించగానే ఆమె మోడలింగ్ చేస్తున్నప్పుడు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వాటిల్లో చాలా వాటిలో ఆమె పొట్టి దుస్తులు ధరించి ఉంది. దీనిపై చాలా మంది బీజేపీ పై విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపై కంగనా పూర్తిగా హిమాచలీ వార్డ్‌రోబ్‌తో స్పందించింది. అది పాంగి లేదా కిన్నౌర్ అయినా, ఆమె గిరిజన స్థానిక దుస్తులతో ప్రచారంలోకి దూకింది. అదేవిధంగా, ఆమె సూట్ చీరలో మండికి చేరుకున్నారు. రాంపూర్‌లో, ఆమె స్థానిక ధాతు, రెజ్తా వేషధారణలను ధరించింది.
కాంగ్రెస్ కంచుకోట
రాంపూర్ విక్రమాదిత్య, అతని తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు బలమైన కోట పేరుపొందింది. ఇక్కడ కంగన వాళ్లకు ఉన్న రాజులు, వారి వేషధారణను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. అయితే, ఇదంతా బీజేపీకి అదనపు భారంగా మారిందని వర్గాలు చెబుతున్నాయి. కంగనా, తన పరివారానికి ప్రచారానికి వెళ్లేందుకు వారు పెద్ద సంఖ్యలో గదులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కంగనాతో ప్రయాణిస్తున్న కార్మికులు, వాలంటీర్లు ఎక్కువగా పార్టీ కార్యకర్తలేనని కొందరు ఫెడరల్‌కి చెప్పారు.
అన్ డిగ్నిఫైడ్ డిగ్స్, ఫాక్స్ పాస్
కంగనాకు ఎదుర్కొంటున్న ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ కు రాజకీయ అనుభవం ఉంది. ఆమె చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక ర్యాలీలో, కంగనా రాహూల్ గాంధీని 'పప్పు' అనే సంబోధించింది. బీజేపీ ఆధ్వర్యంలోని రైట్ వింగ్ దీనిని విపరీతంగా ఉపయోగించాయి. నిజానికి అవమానించాయి. ఇది ఆ పార్టీపై సింపతీ పెరిగేలా చేసింది.
మరో వేదికలో కంగనా మాట్లాడుతూ.. బీజేపీ సొంత తప్పులతో రాష్ట్రంలో అధికారాన్ని కొల్పోయిందని ఎత్తిపొడిచింది. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అదే వేదికపై ఉన్నాడు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆమెను 'రాజకీయ నటి' అని పిలుస్తుంటే, కంగనా తన ప్రసంగాలలో విక్రమాదిత్యను 'షాజాదా' అని ఎత్తిపొడుస్తోంది.
శాంతియుత రాష్ట్రంలో..
హిమాచల్ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని, అక్కడి ప్రజలు గౌరవప్రదంగా ఉంటారని గమనించాలి. రాజకీయ నాయకులు, వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి, సాధారణంగా నాగరిక పద్ధతిలో మాట్లాడతారు. ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సింగ్ తన సౌమ్య ప్రవర్తన కారణంగానే జనాల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయనే కాదు, బీజేపీకి చెందిన ఠాకూర్, మళ్లీ మాజీ సీఎం, ప్రజలతో అత్యంత ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా, ప్రశాంతంగా వ్యవహరించే తీరుకు పేరుగాంచారు.



ప్రస్తుత ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ, లేదా అతని పూర్వీకులు శాంత కుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్ అయినా, వీళ్లెవరూ రాజకీయ సంబరాలను ఉద్దేశించి లేదా స్కోర్ చేయడానికి వేదికపై లేదా పరిపాలనా విధానాలలో ఎప్పుడూ కఠినమైన, అనుచితమైన లేదా తప్పుడు పదజాలాన్ని ఉపయోగించలేదు. కొండ ప్రాంతాలైన రాష్ట్ర రాజకీయ వాతావరణం,పవిత్రతను, గౌరవాన్ని కించపరిచేలా చేదు మాటలు రావడం ఇదే మొదటి సందర్భం.
'క్వీన్' vs 'కింగ్'
కంగనా తన ఢాకడ్ అవతార్‌ను మండిలో ప్రజలలో ప్రదర్శించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆమె విజయం కేవలం బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంది. అందుకే కంగనాకు టికెట్ దక్కిన వెంటనే ఠాకూర్ ఆమెను కలిసేందుకు ఆమె ఇంటికి చేరుకున్నారు. మండిలో కంగనానే గెలిపించేందుకు మాజీ సీఎం ఠాకూర్, బిజెపి ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
మరోవైపు, విక్రమాదిత్య నాలుగు దశాబ్దాలుగా మండిలో తన తల్లి-ఎంపీ ప్రతిభా సింగ్, తండ్రి-సీఎం వీరభద్ర సింగ్ చేసిన పని - ముఖ్యంగా వారు అందించిన ఉద్యోగాలపై ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల రణరంగంలో, తీవ్రమైన పోటీ నేరుగా ఠాకూర్, మోదీ రాజకుటుంబం ప్రతిష్టతో ముడిపడి ఉంది.
క్వీన్ కంగనా, టాప్ గ్రాసర్లలో ఒకరిగా మిగిలి ఉండగా, విక్రమాదిత్య తన రాజవంశం కారణంగా 'కింగ్'. కాబట్టి, ఇది క్వీన్ వర్సెస్ కింగ్ కేసు.
Read More
Next Story