పది ఏళ్లలో నూట పదిసార్లు మోదీని అవమానించారు : నడ్డా
x

పది ఏళ్లలో నూట పదిసార్లు మోదీని అవమానించారు : నడ్డా

రాహుల్ గాంధీ ప్రధాని మోదీని, ఓబీసీలను, మాజీ ప్రధానులను అవమానించిన చరిత్ర ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజలు పదే పదే రిజెక్ట్ చేసిన


రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంపై బీజేపీ- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా విమర్శించి అవమానించిన చరిత్ర రాహుల్ గాంధీకి ఉందని ధ్వజమెత్తారు. అలాగే ఓబీసీ వర్గాలు, భారత వ్యతిరేక శక్తులతో జత కట్టి దేశాన్ని నిందించిన చరిత్ర లోక్ సభ ప్రతిపక్ష నాయకుడికి ఉందన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు మూడు పేజీల లేఖ రాసిన నడ్డా.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకంగా ప్రజాస్వామ్య దేవాలయమైన లోక్ సభ లో అనుచిత పదాలు వాడారని కొన్ని ఫిర్యాదులను ఉదహరించారు.
రాహుల్‌ను ఎందుకు సమర్థిస్తున్నారు?
ప్రధానితో సహా మొత్తం ఓబీసీని ‘దొంగ’ అని, మోదీపై అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించిన చరిత్ర రాహుల్‌కు ఉందని నడ్డా విరుచుకుపడ్డారు. ‘ ఎవరి బలవంతం వల్ల రాహుల్ గాంధీని సమర్థించాలనుకుంటున్నారు’ అని బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ప్రశ్నించారు. గత పదేళ్లలో కాంగ్రెస్ నేతలు 110 సార్లు మోదీని దూషించారని, ప్రతిపక్ష పార్టీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
విఫలమైన ఉత్పత్తి మార్కెట్..
ప్రజలు పదే పదే తిరస్కరించిన "విఫలమైన ఉత్పత్తి"ని మార్కెట్ చేయాలన్న రాజకీయ ఒత్తిడితో ఖర్గే లేఖ రాశారని నడ్డా పేర్కొన్నారు. "మీ వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మీరు గాంధీ, ఇతర నాయకుల దుర్మార్గాలను మరచిపోయారని లేదా ఉద్దేశపూర్వకంగా వాటిని విస్మరించారని మీ లేఖ ద్వారా తెలుస్తోంది" అని నడ్డా తన లేఖలో ఆరోపించారు.
‘‘ మౌత్ కా సౌదాగర్’’
రాహుల్ ఒకప్పుడు మోదీని లాఠీతో "కొట్టడం" గురించి మాట్లాడారని, అతని "అగౌరవ" మనస్తత్వం బయట పెట్టుకున్నారని అన్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని "మౌత్ కా సౌదాగర్" అని పిలిచారని ఆయన అన్నారు. "మీరు, మీ పార్టీ నాయకులు ఇటువంటి దురదృష్టకర, అవమానకరమైన వ్యాఖ్యలను కీర్తిస్తూనే ఉన్నారు" నడ్డా చెప్పారు.
'మోదీ అత్యంత అవమానించారు'
స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ నాయకులు మోదీని అవమానించినంతగా ఏ నాయకుడిని అవమానించలేదని నడ్డా ఆరోపించారు. సంవత్సరాలుగా ప్రధాని కోసం ఉపయోగించిన అనేక అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఉటంకించారు. భారత వ్యతిరేక, పాక్ అనుకూల శక్తులతో సహకరిస్తున్నందుకు, భారత ప్రజాస్వామ్యంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నందుకు రాహుల్‌ను చూసి కాంగ్రెస్ గర్వపడుతుందా అని బిజెపి అధ్యక్షుడు ప్రశ్నించారు.
హిందూ 'సనాతన్' సంస్కృతిని రాహుల్ పదే పదే అవమానించారని, సాయుధ బలగాల ధైర్యసాహసాలకు ఆధారాలు వెతకాలని, సిక్కుల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. శామ్ పిట్రోడా, శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, కె సురేష్, ఇమ్రాన్ మసూద్ వంటి కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నేతలు దేశం పరువు తీయడానికి అంతా చేశారని నడ్డా పేర్కొన్నారు.
కులతత్వ విషాన్ని అమ్ముతున్న కాంగ్రెస్‌..
కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు వ్యతిరేకంగా ప్రజలను, ప్రాంతాలను ప్రేరేపించారని.. వారి కార్యక్రమాలలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కించపరిచినా, అవమానించినా అది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు. నడ్డా ఎమర్జెన్సీ విధించడాన్ని ఉదహరించారు. ట్రిపుల్ తలాక్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని, కాంగ్రెస్ తన "మొహబ్బత్ కి దుకన్" నుంచి కులతత్వం, దేశ వ్యతిరేక కంటెంట్‌ను విక్రయిస్తోందని పేర్కొన్నారు.
మోదీకి ఖర్గే లేఖ
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మోదీకి రాసిన లేఖలో రాహుల్‌పై అధికార కూటమి సభ్యులు చేసిన "అత్యంత అభ్యంతరకరం", "హింసాత్మక" ప్రకటనలు తన నిరసన తెలియజేశారు. తమ నాయకులను అదుపులో పెట్టాలని ప్రధానిని కోరారు.
భారత రాజకీయాలు దిగజారకుండా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు తన లేఖలో డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కేంద్ర మంత్రి, రాహుల్‌ని నంబర్‌ వన్‌ టెర్రరిస్టు అని అనడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుందని అన్నారు. ప్రతిపక్ష నేత నాలుక నరికిన వ్యక్తికి శివసేన ఎమ్మెల్యే రూ.11 లక్షల రివార్డు ప్రకటించారు " లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై నడ్డా విమర్శలు గుప్పించారు.
Read More
Next Story