ఈసారి ట్రాన్స్ జెండర్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే..
2019 ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య పెరిగిందని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి అనేక..
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో దేశ వ్యాప్తంగా పోలింగ్ జరగడానికి ఎన్నికల కమిషన్ సమాయత్తం అయింది. దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 48,000 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. వీరిలో 2019 లోక్‌సభ ఎన్నికలలో లింగమార్పిడి ఓటర్ల సంఖ్య 39,075, ఉన్నారని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (7,797) తర్వాత తమిళనాడు (5,793), కర్ణాటక (4,826) ఉన్నారు. లింగమార్పిడి ఓటర్లు లేని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం.
ఎన్నికల సంఘం ప్రకారం, "ఓటరు చైతన్యరహితంగా ఉండకూడదు" అనే దాని ఆదేశానికి కట్టుబడి, ఎన్నికల ప్రక్రియలో సమాజంలోని అన్ని వర్గాలను చేర్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేపట్టినట్లు వివరించాయి. "ఎన్నికల జాబితాలో ట్రాన్స్‌జెండర్లను నమోదు చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా వారిని చైతన్యపరచడం ఎన్నికల కమిషన్‌కు పెద్ద సవాలుగా మారిందన్నారు. ట్రాన్స్‌జెండర్లలో అవగాహన కల్పించడానికి అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఫలితంగా 2019 సాధారణ ఎన్నికల కంటే థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య పెరిగింది." అని సీఈసీ వివరించారు.
543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి, ఏప్రిల్ 19న మొదటి దశలో 102 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
Next Story