‘‘కుటుంబం కోసం కాదు.. బీహార్ కోసమే పనిచేశాను’’
x
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

‘‘కుటుంబం కోసం కాదు.. బీహార్ కోసమే పనిచేశాను’’

సీఎం నితీశ్ కుమార్


ఎన్నికలలో తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతిసారి బీహార్ ప్రజల కోసమే నిజాయతీగా, కష్టపడి పనిచేశానని, కానీ తన కుటుంబానికి ఏమి చేయలేదని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన వీడియోలలో ఈ మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మాట్లాడారు. రాష్ట్ర వృద్దికి ఎల్లప్పుడూ తన ప్రాధాన్యత అన్నారు. తాను అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడినట్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు జంగిల్ రాజ్ ఉదంతాలను పరోక్షంగా ప్రస్తావించారు.
బీహారిగా ఉండటం అవమానం..
గతంలో బీహారీగా ఉండటం అవమానకరమైన విషయమని, కానీ అది ఇప్పుడు గర్వకారణంగా మారిందని అన్నారు. అలా మార్చింది తన ప్రభుత్వమే పేర్కొన్నారు.
‘‘2005 లో మేము అధికారంలోకి రావడానికి ముందు బీహార్ ప్రజల స్థితి మాకు తెలుసు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్దరణకు ప్రాధాన్యం ఇచ్చాము. చట్టబద్దమైన పాలన తీసుకొచ్చాము. ఇప్పుడు దేశంలో బీహార్ అని చెప్పుకోవడం మా అందరికి గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి వీడియోలో అన్నారు.
జేడీ(యూ) మహిళలు, హిందువులు, ముస్లింలు, అగ్రవర్ణాలు, దళితులు, సమాజంలోని బలహీనవర్గాల, వెనకబడిన తరగతుల సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు.
‘‘మీరు నాకు 2005 నుంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. బీహార్ సమగ్ర అభివృద్ది కోం మేము అనేక చర్యలు తీసుకున్నాము, ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
డబల్ ఇంజిన్ ప్రభుత్వం..
బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏకి ఓటు వేయాలని అభ్యర్థించారు. డబల్ ఇంజిన్ సర్కార్ తిరిగి ఎన్నికైతే బీహార్ అభివృద్ది వేగాన్ని పెంచుతుందని కుమార్ అన్నారు. ‘‘ఈ వేగం కొనసాగాలి.
కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో డబల్ ఇంజిన్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది చర్యల కొనసాగింపు కోసం మీరు(ప్రజలు) మరోసారి ఎన్డీఏకి అవకాశం ఇవ్వాలి. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే, రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని చూస్తుంది’’ అని కుమార్ అన్నారు.
‘‘నేను నా కుటుంబానికి ఎలాంటి పనిచేయలేదు. రాష్ట్రాభివృద్దికే నా తొలి ప్రాధాన్యత. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయండి, మరోసారి మీకు సేవ చేయడానికి వికసిత్ బీహార్ ను, దేశంలోని అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా మార్చడానికి అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను’’ అని ఆయన అన్నారు.


Read More
Next Story