‘‘ఉగ్రవాదుల రహస్య స్థావరంలో ఐఈడీలు, వైర్ లెస్ సెట్లు’’
x

‘‘ఉగ్రవాదుల రహస్య స్థావరంలో ఐఈడీలు, వైర్ లెస్ సెట్లు’’

సహజ గుహలో గ్యాస్ సిలిండర్లు దుప్పట్లు, వంట సామగ్రి దాచుకున్న ఉగ్రవాదులు, అన్నింటిని ధ్వంసం చేసిన భద్రతా బలగాలు


జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా జరిపిన గాలింపు చర్యల్లో పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న స్థావరాన్ని కనుగొన్నారు.

ఇందులో 5 ఐఈడీలు, రెండు వైర్ లెస్ సెట్ లు స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ పోలీసులు ఈ స్థావరం ఫొటోలు విడుదల చేశారు. వాటిలో బహుళ రేడియో సెట్లు, ఐదు శక్తివంతమైన బాంబులు ఉన్నాయి.

కాశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వీకే బర్డీ కాశ్మీర్ లోని సంయుక్త భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఒకరోజు తరువాత ఈ ఉగ్రవాద స్థావరం బయటపడింది.
ఎలా బయటపడిందంటే..
నిన్న సాయంత్రం సురాన్ కోట్ లోని మర్హోట్ ప్రాంతంలోని సురాన్తల్ లో సైన్యం, జేకే పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ బృందం సంయుక్తంగా నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్ లో ఈ రహస్య స్థావరాన్ని ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.
పూంచ్ జిల్లాలోని హరి గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా సహజ గుహలలో ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరాన్ని వీరు కనుగొన్నారు.
భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను అక్కడే ధ్వంసం చేసినట్లు, ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఐఈడీలు ధ్వంసం..
అర కిలో నుంచి ఐదు గ్రాముల వరకూ బరువుండి దాడికి సిద్దంగా ఉన్న ఐఈడీ లను అక్కడే నియంత్రిత పేలుడుతో ధ్వంసం చేశామని, సరిహద్దు జిల్లాలో పేలుళ్లు జరపాలనే ఉగ్రవాదుల ప్రణాళికలను సమర్థవంతంగా తిప్పికొట్టామని అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం.. ఇవి రెండు స్టీల్ బకెట్లలో అమర్చబడి ఉండగా, మరో మూడు టిఫిన్ బాక్స్ లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఇంకా ఇక్కడ అదనంగా ఐదు యూరియా ప్యాకెట్లు, ఐదు లీటర్ల గ్యాస్ సిలిండర్, ఒక జత బైనాక్యూలర్లు, మూడు ఉన్ని టోపీలు, మూడు దుప్పట్లు, అలాగే కొన్ని ప్యాంట్లు, పాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
Read More
Next Story