బీహార్ లోనూ ఆందోళన చేపట్టిన ఇండి కూటమి
x

బీహార్ లోనూ ఆందోళన చేపట్టిన ఇండి కూటమి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వీ యాదవ్


Click the Play button to hear this message in audio format

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణలో అవకతవకలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో కూడా ఆందోళనలు కొనసాగాయి. విపక్ష నేత, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ఇండి కూటమి ఈ ర్యాలీ నిర్వహించింది.

ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని ఇతర పక్షాలు ఇందులో పాల్గొన్నాయి. వారు దీనికి ఆక్రోశ్ యాత్ర అని పేరు పెట్టాయి. బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న లోక్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మొదట వీరు విధాన సభ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరుల స్మారక చిహ్నమైన ‘షహీద్ స్మారక్’ వద్ద సమావేశమయ్యారు. అయితే అక్కడి నుంచి కేవలం వందమీటర్లు ముందుకు వెళ్లగానే ప్రతిపక్ష నాయకులను ముందుకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.
‘‘ఇది చాలా దారుణం, మేము శాంతియుత ఊరేగింపుతో గవర్నర్ గారెని కలుస్తామని వారికి తెలియజేశాము. అయినప్పటికీ కొందరు పోలీస్ సిబ్బంది ఏకే 47 రైఫిళ్లను ప్రదర్శిస్తూ నాకు కనిపించారు. జ్ఞానేశ్ కుమార్ ప్రొత్సహిస్తున్న అధికార ఎన్డీఏ నియంతృత్వ వైఖరి ఇది’’ అని యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు, నాయకులు స్పృహ కోల్పోయారు.
‘‘ప్రతిపక్ష నాయకుడితో పాటు మరికొందరిని లోక్ భవన్ కు తీసుకెళ్లగా, అక్కడ వారు గవర్నర్ ను కలిశారు. చాలామంది అదుపు తప్పిన కొందరు నిరసనకారులను మేము అదుపులోకి తీసుకున్నాము. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము’’ అని పాట్నాసీనియర్ ఎస్పీ కార్తికేయ శర్మ పీటీఐకీ తెలిపారు.
ఈ నిరసనల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా ఊరేగింపు శాంతియుతంగా జరిగిందని, ఎలాంటి శాంతిభద్రతల సంక్షోభం తలెత్తలేదని మీరు చూడవచ్చు. అయినప్పటికీ పోలీసులు పెత్తందారుగా ప్రవర్తించారు. అధికారంలో ఉన్నవారి ఈ వైఖరినే మేము ఎదుర్కొంటున్నాము’’ అని అన్నారు.
లోక్ భవన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇటీవల పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరపడం మనం చూశాం. నియంతృత్వ ప్రభుత్వ లక్ష్యాల జాబితాలో తరువాత స్థానంలో ప్రతిపక్ష నాయకులే ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని అన్నారు.
ఎన్నికలలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్యాయమైన ప్రయోజనం చేకూర్చేందుకు సీఈసీ చేస్తున్నారనే ఆరోపణలపై విమర్శలు చేస్తున్నారు. ‘‘జ్ఞాను, జ్ఞాను ఎస్ పాపా.. దొంగ ఓట్లు వద్దు పాపా, న్యూస్ పేపర్ తెరవండి.. హహహ’’ అని ఎగతాళి చేశారు.
పోలీసులు భారీగా మోహరించినప్పటికీ లోక్ భవన్ సమీపంలోకి నిరసనకారులు ప్రవేశించగలిగారు. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరయోగీ లోక్ భవన్ కు రావడంతో ‘‘ఓట్ చోర్ కహన్ మిలేంగే, బీజేపీకే దఫ్తర్ మే’’ అని నినాదాలు వినిపించాయి.
గవర్నర్ తో జరిగిన సమావేశంలో యాదవ్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ రామ్ కూడా ఉన్నారు. అలాగే వికాశ్ షీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహనీ కూడా వారితో వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. మా వినతీ పత్రాన్ని గవర్నర్ సంబంధిత అధికారులకు పంపుతామని చెప్పారని, అయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిసినప్పటికీ, మనం సుదీర్ఘ పోరాటానికి సిద్దంగా ఉండాలని అన్నారు.
Read More
Next Story