‘ఇండియా’ కూటమి ఆలోచన తనదే: మల్లికార్జున్ ఖర్గే
x
మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు

‘ఇండియా’ కూటమి ఆలోచన తనదే: మల్లికార్జున్ ఖర్గే

ఇండియా కూటమి నుంచి ఎవరూ వెళ్లిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.


విపక్షాలందరిని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాలనే ఆలోచన బిహార్ సీఎం నితీష్ కుమార్ దే అని, కానీ తనే కూటమి నుంచి వెళ్లిపోతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దేశంలోని ప్రధాన పార్టీ నాయకులు కూటమిలోకి రావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

‘కానీ నితీష్ కూటమి నుంచి వెళ్లిపోతున్నారని అంటున్నారు, అయితే దాని గురించి పూర్తి సమాచారం లేదు . తన మదిలో ఏముందో మాకు తెలియదు. కూటమిని స్థిరంగా నిలిపేందుకు ప్రయత్నాలు చేశాను. కొంతమందికి లేఖలు రాశాను ’ అని ఖర్గే అన్నారు.

ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వెళ్లిపోకుండా ప్రయత్నించామని, అంతా కలిసి ఉందామని చెప్పామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పాటైన కూటమిలో జేడీయూ ఒకటి, బలమైంది. ప్రస్తుతం వివిధ పార్టీలు కూటమి నుంచి వైదొలగడంతో అదిబలహీనంగా మారింది.

"నితీష్ కుమార్ రాజీనామా చేస్తారనే సమాచారం నాకు లేదు. గవర్నర్ ను కలవడం గురించి కూడా మాకు తెలియదు. నేను మమత, నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరితో మాట్లాడాను, మనం ఐక్యంగా ఉండమని చెప్పాను. అప్పుడే బీజేపీతో మనం పోరాడగలం " అని ఖర్గే మీడియాతో అన్నారు.

బిహార్ లో ఏదో జరుగుతోంది.

బిహార్ లో ప్రస్తుతం ఉన్న మహాఘట్ బంధన్ ప్రభుత్వం కూలిపోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిని జేడీ యూ ఖండించినప్పటికీ, ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ పక్ష సమావేశానికి పిలుపునిచ్చినందువల్ల ఏదో జరుగుతుందని అనుమానం వస్తోంది.

తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారనే వదంతుల నేపథ్యంలోనే బీజేపీ నాయకులు కూడా స్పందించారు. తాము ఎవరికీ తలుపులు మూయలేదని అన్నారు. దీనితో తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు చేపడతారని పుకార్లు వినిపిస్తున్నాయి.

2022 ఆగష్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తరువాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ తో చేతులు కలిపిన నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. తరువాత బీజేపీని ఓడించడానికి దేశ వ్యాప్తంగా పర్యటించి అందరూ అధినేతలతో మాట్లాడి విపక్ష కూటమికి బీజం వేశారు. తరువాత ఇదే ఇండియా కూటమిగా ఏర్పాటు అయింది.

బీజేపీ గ్రాఫ్ పెరిగిందనే..

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తరువాత ఉత్తరాదిన బీజేపీ ప్రతిష్ట బాగా పెరిగింది. దాంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి 2019 ఫలితాలు బిహార్ లో పునరావృతం అయ్యే అవకాశం ఉందని భావించిన నితీష్ అర్జంట్ గా ప్లేట్ మార్చేశారు.

పైగా కూటమిలోని ఆర్జేడీ అధిపత్యం పెరగడం, ప్రతి నిర్ణయాన్ని లాలూ కు వివరించడం లాంటివి ఆయనకు నచ్చడం లేదని సమాచారం. పైగా ఇండియా కూటమిని తను కష్టపడి ఏర్పాటు చేస్తే తనను కన్వీనర్ గా నియమించకపోవడంతో నితీష్ మనస్తాపం చెందినట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ తిరిగి నితీష్ ను ఎన్డీఏ గూటికి చేర్చిందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read More
Next Story