చైనాపై 12 శాతం సుంకాలు విధించిన భారత్
x

చైనాపై 12 శాతం సుంకాలు విధించిన భారత్

దేశీయ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు న్యూఢిల్లీ చర్యలు


చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతున్న ఉక్కు ఉత్పత్తులను కట్టడి చేయడానికి భారత్ చర్యలు తీసుకుంది. ఇటీవల బీజింగ్ నుంచి ఉక్కు ఉత్పత్తులు న్యూఢిల్లీని ముంచెతున్న నేపథ్యంలో దేశీయ ఉక్కు పరిశ్రమను రక్షించేందుకు దిగుమతి సుంకాలు విధించింది.

చైనా నుంచి వచ్చే కొన్ని రకాలు ఉక్కు ఉత్పత్తులపై 11-12 శాతం దిగుమతి సుంకం విధించింది. రాయిటర్స్ ప్రకారం.. మొదటి సంవత్సరంలో సుంకాల రేటు 12 శాతంగా ఉంది. రెండో సంవత్సరంలో ఈ సుంకం 11.5 శాతానికి తగ్గుతుంది. మూడో సంవత్సరంలో మరో 11 శాతానికి తగ్గుతుంది.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారు అయిన భారత్, చైనా నుంచి చౌక ఉక్కు దిగుమతిలో పెరుగుదల ఎదుర్కొంటోంది. ఈ సమస్య డంపింగ్ వ్యతిరేక ఆందోళనలకు దారితీసింది. దేశీయ ఉక్కు తయారీదారులను ఇబ్బందుల్లో పడేసింది.

కొన్ని రకాల వాటికి మినహయింపు..
ప్రభుత్వ గెజిట్ లో ప్రచురించబడిన ఈ నిర్ణయం కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దిగుమతులను మినహయించిందని, అయితే చైనా, వియత్నాం, నేపాల్ నుంచి సంబంధిత దిగుమతులు సుంకం పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. అయితే స్టెయిన్ లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు మినహయింపు ఇచ్చారు.
తక్కువ ధర, నాసిరకం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమకు ఎలాంటి హాని జరగకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తామని ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘ఇటీవల ఆకస్మికంగా పదునైన, గణనీయమైన దిగుమతుల పెరుగుదల.. దేశీయ పరిశ్రమకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది’’ అని గమనించిన తరువాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటీఆర్) సుంకాలను సిఫార్సు చేసింది’’ అని రాయిటర్స్ పేర్కొంది.
2025 ఏప్రిల్ లో కేంద్రం అన్ని దిగుమతులపై 200 రోజుల పాటు 12 శాతం తాత్కాలిక సుంకాన్ని విధించింది. ఆ సుంకం నవంబర్ 2025 లో గడువు ముగిసిందని ఇండియా టుడే నివేదించింది.
భారతీయ ఉక్కు తయారీదారుల సమస్య..
చౌకైన చైనీస్ స్టీల్ దిగుమతులు పెరుగుతున్నాయని ఇండియన్ స్టెయిన్ లెస్ స్టీల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ 2025 ఆగష్టులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ లో ఒక పిటిషన్ దాఖలు చేసింది. చౌకైన స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ లెవీలు విధించాలని ప్రభుత్వాన్ని కోరింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలు గణనీయమైన వాణిజ్య హెచ్చుతగ్గులను సృష్టించిన సమయంలో ఈ పరిణామం జరిగింది. ట్రంప్ సుంకాలు కూడా చైనా ఉక్కు దిగుమతుల పెరుగుదలకు పాక్షికంగా కారణమయ్యాయి.
ఎందుకంటే వారు చైనా ఎగుమతులను ఇతర మార్కెట్లకు మళ్లించారు. ఫలితంగా అనేక దేశాలు దిగుమతి పరిమితులను కఠినతరం చేశాయని ఇండియా టుడే నివేదించింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణ కొరియా, వియత్నాం కూడా చైనా నుంచి తక్కువ ధరల ఎగుమతులను అరికట్టడానికి చైనా ఉక్కు ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాలను విధించాయి.
Read More
Next Story