భారత్ ఏం ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు
x
సుప్రీంకోర్టు

భారత్ ఏం ధర్మసత్రం కాదు: సుప్రీంకోర్టు

శ్రీలంక శరణార్థి పిటిషన్ ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం, ప్రమాదం ఉంటే వేరే దేశాన్ని ఆశ్రయం కోరాలని సూచించిన న్యాయస్థానం


శ్రీలంక తమిళుడు దేశంలో ఆశ్రయం కోసం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మసత్రం కాదని పేర్కొంది.

‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలా? మేము 140 కోట్ల మంది ప్రజలతోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వారిని స్వాగతించడానికి ఏర్పాటు చేసిన ధర్మసత్రం కాదు’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు.
ఆశ్రయం కోసం విజ్ఞప్తి
తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి, భారత్ లో ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక జాతీయుడు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, కే. వినోద చంద్రన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. శ్రీలంకలోని ఉగ్రవాద సంస్థ అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్టీటీఈ) తో సంబంధం ఉన్నాడనే అనుమానంతో పిటిషనర్ ను 2015 లో అరెస్ట్ చేశారు. 2018 లో ట్రయల్ కోర్టు చట్టవిరుద్ద కార్యకలాపాల(నివారణ) చట్టం కింద అతన్ని దేశద్రోహిగా నిర్ధారించి పదిసంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2022 లో మద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించింది. శిక్ష పూర్తయిన తరువాత భారత్ విడిచివెళ్లమని ఆదేశించింది. దేశం నుంచి బహిష్కరించబడే వరకూ శరణార్థి శిబిరంలో ఉండాలని కోర్టు చెప్పంది. తన భార్య పిల్లలు భారత్ లోనే స్థిరపడ్డారని, తాను వీసాతో భారత్ కు వచ్చానని పిటిషనర్ తెలిపారు.
ఇంకేక్కడైన ఆశ్రయం పొందండి..
పిటిషనర్ తరుపు న్యాయవాదీ ఈ విషయాన్ని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 కింద వాదించారు. ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ ను చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నందున అతని నిర్భంధం ఆర్టికల్ 21 ని ఉల్లంఘించినట్లు కాదని జస్టిస్ దత్తా తన తీర్పులో పేర్కొన్నారు.
ఆర్టికల్ 19 అనేది కేవలం భారతీయుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో ఎత్తి చూపారు. ‘‘ఇక్కడ స్థిరపడటానికి మీకు ఏ హక్కు ఉంది’’ అని కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. అతను శరణార్థి అని, శ్రీలంకకు తిరిగి వెళ్తే అతని ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పినప్పుడూ వేరే దేశంలో ఆశ్రయం పొందాలని సూచించింది.
Read More
Next Story